అన్వేషించండి

River Indie కంటే Yamaha EC-06 రేటు ₹22,000 ఎక్కువ - ఈ అదనపు ధరకు ఏం ఇస్తున్నారు?

Yamaha EC-06 & River Indie మధ్య డిజైన్‌, స్టోరేజ్‌, రేంజ్‌, టాప్‌ స్పీడ్‌, ధరలో ఉన్న కీలక తేడాలు ఏమిటి? ₹22 వేల అదనపు ధరకు EC-06 ఏమి ఇస్తుందో తెలుసుకోండి.

Yamaha EC-06 vs River Indie: ఇటీవల భారత మార్కెట్‌లోకి అడుగుపెట్టిన Yamaha EC-06 ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పటికే మంచి చర్చను రేపుతోంది. ఈ స్కూటర్ పూర్తిగా కొత్త ప్లాట్‌ఫామ్‌పై కాకుండా, బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న స్టార్టప్ కంపెనీ River రూపొందించిన River Indie స్కూటర్‌ ఫ్లాట్‌ఫామ్‌ మీదే ఆధారపడి తయారైంది. యమహా - రివర్ కలిసి ఈ స్కూటర్‌ను అభివృద్ధి చేయడం ఇదే మొదటిసారి కాదు. అయినా, EC-06 అనేది కేవలం బ్యాడ్జ్ మార్పుతో వచ్చిన స్కూటర్ కాదు. డిజైన్‌ నుంచి ఫీచర్ల వరకు కొన్ని కీలక మార్పులు ఉన్నాయి. మరి, River Indie కంటే ₹22,000 అదనపు ధరకు Yamaha EC-06 నిజంగా విలువైనదేనా?.

డిజైన్‌లో తేడాలు

River Indie డిజైన్‌ను చూస్తే వెంటనే అర్థమయ్యేది ఒకటే - ఇది పూర్తిగా ప్రాక్టికాలిటీ మీద దృష్టి పెట్టిన స్కూటర్‌. ప్యానియర్ స్టేస్‌, లగేజ్‌ను కట్టుకునే హుక్స్‌, బలమైన బాడీ - ఇవన్నీ రోజువారీ వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని ఇచ్చినవి.
దానికి భిన్నంగా Yamaha EC-06 మాత్రం క్లీన్‌గా, యువతను ఆకట్టుకునే స్టైల్‌లో ఉంది. ఇండీకి ఉన్న ట్విన్ హెడ్‌ల్యాంప్స్‌ను తొలగించి, EC-06లో నిలువుగా అమర్చిన హెడ్‌ల్యాంప్స్‌ ఇచ్చారు. టెయిల్‌ల్యాంప్‌ డిజైన్‌ కూడా పూర్తిగా భిన్నంగా ఉంటుంది. మరో ముఖ్యమైన మార్పు ఏమిటంటే - ఇండికేటర్లు. ఇండీలో అవి కింద భాగంలో ఉండటంతో డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువ. EC-06లో మాత్రం హెడ్‌ల్యాంప్‌ పైనే ఉంచారు.

స్టోరేజ్‌ సామర్థ్యం

స్టోరేజ్ విషయానికి వస్తే River Indie స్పష్టంగా ముందంజలో ఉంటుంది. ఇండీకి 43 లీటర్ల అండర్‌సీట్ స్టోరేజ్‌తో పాటు, ముందు భాగంలో 12 లీటర్ల కవర్డ్ స్టోరేజ్ కూడా ఉంది. ఇది మార్కెట్‌లో ఉన్న చాలా ఎలక్ట్రిక్ స్కూటర్ల కంటే ఎక్కువే.
Yamaha EC-06లో మాత్రం స్టోరేజ్ చాలా తగ్గింది. దీనిలో కేవలం 24.5 లీటర్ల అండర్‌సీట్ స్టోరేజ్ మాత్రమే ఉంటుంది. ముందు భాగంలోని స్టోరేజ్ స్థానంలో చార్జింగ్ పోర్ట్‌, కీ స్లాట్‌ను అమర్చారు. ఈ మార్పుల వల్ల స్కూటర్ బరువు 3 కిలోలు తగ్గింది. EC-06 బరువు 132 కిలోలు మాత్రమే ఉంటుంది.

రేంజ్‌, టాప్‌ స్పీడ్‌

పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కొంత మిక్స్‌డ్ పిక్చర్ కనిపిస్తుంది. River Indie గరిష్టంగా 90 kmph టాప్‌ స్పీడ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. కానీ Yamaha EC-06 టాప్‌ స్పీడ్ మాత్రం 79 kmphకి పరిమితం. అయితే, రేంజ్‌లో మాత్రం EC-06కు స్వల్ప ఆధిక్యం ఉంది. ఇది 169 కిలోమీటర్ల IDC రేంజ్ ఇస్తే, ఇండీ 163 కిలోమీటర్లు మాత్రమే ఇస్తుంది.

చార్జింగ్

చార్జింగ్ టైమ్‌లో ఈ రెండు స్కూటర్లు దాదాపు ఒకేలా ఉన్నాయి. 480W చార్జర్‌తో 0 నుంచి 80 శాతం చార్జింగ్‌కు సుమారు 8 గంటలు పడుతుంది. అయితే ఇండీకి అదనంగా 750W ఫాస్ట్ చార్జర్ ఆప్షన్ ఉంది. దీని ద్వారా అదే చార్జింగ్‌ను కేవలం 5 గంటల్లో పూర్తి చేయవచ్చు. ఈ ఫీచర్ EC-06లో లేదు.

ధర, లభ్యత

Yamaha EC-06 ధరను కంపెనీ ₹1.68 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌)గా నిర్ణయించింది. ప్రస్తుతం ఇది మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులో మాత్రమే అందుబాటులో ఉంది. 

River Indie ధరతో పోలిస్తే EC-06 సుమారు ₹22,000 ఎక్కువ. ఈ అదనపు ధరకు Yamaha బ్యాడ్జ్‌, క్లీనర్ డిజైన్‌, స్వల్పంగా ఎక్కువ రేంజ్ లభిస్తున్నాయి. అయితే ప్రాక్టికాలిటీ, స్టోరేజ్‌, టాప్‌ స్పీడ్ విషయంలో ఇండీనే మెరుగ్గా కనిపిస్తుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే - EC-06 పూర్తిగా రివర్ హోస్కోటే ప్లాంట్‌లోనే తయారవుతుంది.

మీకు రోజువారీ వినియోగం, ఎక్కువ స్టోరేజ్‌, బలమైన నిర్మాణం కావాలంటే River Indie సరైన ఎంపిక. స్టైల్‌, Yamaha బ్రాండ్ వాల్యూ, క్లీన్ లుక్‌ కావాలంటే Yamaha EC-06 వైపు చూడొచ్చు. ధరలో తేడా చిన్నదే అయినా, అవసరాల ఆధారంగానే నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

స్పోర్టీ లుక్‌తో వచ్చిన ఏప్రిలియా SXR GT 175 మ్యాక్సీ స్కూటర్.. ఇంజిన్‌, ఫీచర్లు, సౌకర్యం ఎలా ఉన్నాయి?
Aprilia SXR GT 175 ఫుల్‌ రివ్యూ.. ఈ బండిని కొనొచ్చా? ప్లస్‌లు, మైనస్‌లు ఏంటి?
39hp పవర్.. ట్విన్ సిలిండర్ ఇంజిన్.. కేటీఎం డ్యూక్‌కు పోటీ.. Kawasaki Z300 గురించి ఇంకా మీకేం తెలుసు?
యూత్‌ఫుల్‌ బైక్‌ కవాసాకి Z300 గురించి 5 కీలక విషయాలు.. కొనే ముందే మీకివి తెలియాలి!
Top 10 Best Selling SUVs: బడ్జెట్‌ కార్లలో ఏది నంబర్ వన్? అమ్మకాల్లో ముందున్న టాప్ 10 SUVల లిస్ట్‌
గత 6 నెలల్లో జనం ఎక్కువగా కొన్న టాప్‌ 10 కార్లు.. వీటికి ఫుల్‌ డిమాండ్‌, మీ బడ్జెట్‌లోనే!
కేటీఎం డ్యూక్, టీవీఎస్ అపాచీకి గట్టి పోటీ.. Kawasaki Z300 లాంచ్‌.. ఈ బండి ప్రత్యేకతలు ఇవే!
యూత్‌ చేతికి కొత్త బండి.. స్పోర్టీ 296cc ఇంజిన్, 39hp పవర్‌తో Kawasaki Z300 ఎంట్రీ

వీడియోలు

Ravi Shastri Backs Mohammed Shami | షమీకి తప్పని నిరాశ.. సెలెక్టర్ల తీరును తప్పుబట్టిన రవిశాస్త్రి
Mitchell Santner's Warning to Vaibhav Suryavanshi | వైభవ్ పై న్యూజిలాండ్ శాంట్నర్ సంచలన వ్యాఖ్యలు
Ravi Shastri Backs Struggling Rishabh Pant | రిషబ్ పంత్‌కు రవిశాస్త్రి కీలక సూచన
Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Elections: ఏపీలో స్థానిక పోరు- తీవ్ర ఉద్రిక్తతల మధ్య నామినేషన్లు.. సుప్రీం ఆదేశాలతో ఎస్ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ!
ఏపీలో స్థానిక పోరు- తీవ్ర ఉద్రిక్తతల మధ్య నామినేషన్లు.. సుప్రీం ఆదేశాలతో ఎస్ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ!
AP Odisha Cyclone Alert: తీవ్ర తుఫాను హెచ్చరిక - అక్టోబర్ 27-30 మధ్య కోస్తాంధ్ర-ఒడిశాపై ప్రతాపం - తెలంగాణలోనూ వర్షాలుంటాయా?
తీవ్ర తుఫాను హెచ్చరిక - అక్టోబర్ 27-30 మధ్య కోస్తాంధ్ర-ఒడిశాపై ప్రతాపం - తెలంగాణలోనూ వర్షాలుంటాయా?
Vijayashanti : రాములమ్మ వ్యూహాత్మక మౌనం - ఎమ్మెల్సీ పదవి వచ్చినా కాంగ్రెస్‌లో విజయశాంతి ఎందుకు సైలెంట్?
రాములమ్మ వ్యూహాత్మక మౌనం - ఎమ్మెల్సీ పదవి వచ్చినా కాంగ్రెస్‌లో విజయశాంతి ఎందుకు సైలెంట్?
Teja Sajja : US అమ్మాయితో పెళ్లి - కన్ఫర్మ్ చేసిన తేజ సజ్జా... డెస్టినేషన్ వెడ్డింగ్ ఎప్పుడంటే?
US అమ్మాయితో పెళ్లి - కన్ఫర్మ్ చేసిన తేజ సజ్జా... డెస్టినేషన్ వెడ్డింగ్ ఎప్పుడంటే?
Nadendla Manohar Janasena: నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
IND VS NZ Result Update: :  టీమిండియా స్ట‌న్నింగ్ విక్ట‌రీ.. కివీస్ పై తొలి టీ20లో ఘ‌న విజ‌యం.. స‌త్తా చాటిన సంజూ, శ్రేయ‌స్, న‌మ‌న్,  
టీమిండియా స్ట‌న్నింగ్ విక్ట‌రీ.. కివీస్ పై తొలి టీ20లో ఘ‌న విజ‌యం.. స‌త్తా చాటిన సంజూ, శ్రేయ‌స్, న‌మ‌న్,  
Pawan Kalyan Chandrababu Naidu Meeting : నో కన్వాయ్, నో సెక్యూరిటీ - చంద్రబాబు వద్దకు పవన్.. సుప్రీం తీర్పు వేళ సంచలన భేటీ!
నో కన్వాయ్, నో సెక్యూరిటీ - చంద్రబాబు వద్దకు పవన్.. సుప్రీం తీర్పు వేళ సంచలన భేటీ!
AICC Maha Garjana Delhi: నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?
నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?
Embed widget