అన్వేషించండి

Yamaha నుంచి తొలి ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ EC-06: 169km రేంజ్‌, 79kmph టాప్‌ స్పీడ్‌

Yamaha EC-06 ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ మన మార్కెట్‌లో రూ.1.68 లక్షల ఎక్స్‌-షోరూమ్‌ ధరతో లాంచ్‌ అయింది. 169km రేంజ్‌, 79kmph టాప్‌ స్పీడ్‌ ఉన్న ఈ స్కూటర్‌ గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.

Yamaha EC-06 Price And Features: భారత ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహన మార్కెట్‌లోకి Yamaha అధికారికంగా అడుగుపెట్టింది. జపాన్‌కు చెందిన ఈ ప్రముఖ బ్రాండ్‌ తన తొలి ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ Yamaha EC-06ను రూ.1.68 లక్షల ఎక్స్‌-షోరూమ్‌ ధరతో లాంచ్‌ చేసింది. ఈ ధర మహారాష్ట్రకు వర్తిస్తుంది. ప్రస్తుతం ఈ స్కూటర్‌ మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో మాత్రమే అందుబాటులో ఉంది.

గతంలో ముంబైలో జరిగిన ఈవెంట్‌లో Yamaha EC-06ను ప్రదర్శించిన కంపెనీ, ఇప్పుడు అధికారికంగా మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఈ మోడల్‌ను బెంగళూరుకు చెందిన స్టార్టప్‌ కంపెనీ Riverతో కలిసి డెవలప్‌ చేయడం విశేషం. ఇదే Yamaha నుంచి భారత్‌లో వచ్చిన తొలి ఎలక్ట్రిక్‌ వాహనం కావడం ప్రత్యేకత.

River Indie ఆధారంగా Yamaha EC-06

Yamaha EC-06 పూర్తిగా River Indie ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి రూపొందింది. ఇందులో కూడా Indieలో ఉన్నట్లే 4kWh బ్యాటరీ ప్యాక్‌ ఉపయోగించారు. ఈ బ్యాటరీకి 6.7kW పవర్‌ ఉత్పత్తి చేసే మోటార్‌ జత చేశారు. ఈ సెటప్‌ River Indieతో పోలిస్తే దాదాపు ఒకేలా ఉన్నా, పెర్ఫార్మెన్స్‌లో స్వల్ప తేడా కనిపిస్తుంది.

Yamaha EC-06కు కంపెనీ పేర్కొన్న టాప్‌ స్పీడ్‌ 79 kmph మాత్రమే. ఇది River Indieతో పోలిస్తే 11 kmph తక్కువ. అయితే రేంజ్‌ విషయంలో మాత్రం Yamaha స్వల్పంగా ముందంజలో ఉంది.

రేంజ్‌, చార్జింగ్‌ వివరాలు

Yamaha EC-06కు, IDC ప్రకారం, 169km రేంజ్‌ ఉందని కంపెనీ చెబుతోంది. ఇది River Indie కంటే సుమారు 6km ఎక్కువ. చార్జింగ్‌ విషయానికి వస్తే, 0 నుంచి 80 శాతం వరకు చార్జ్‌ కావడానికి సుమారు 8 గంటల సమయం పడుతుంది. ఇది 480W స్టాండర్డ్‌ చార్జర్‌తో ఈ చార్జింగ్‌ టైమ్‌ ఉంటుంది.

River Indieలో ఉన్న 750W ఫాస్ట్‌ చార్జర్‌ ఆప్షన్‌ మాత్రం Yamaha EC-06లో ఇవ్వలేదు. దీన్ని కొందరు వినియోగదారులు మైనస్‌ పాయింట్‌గా భావించే అవకాశం ఉంది.

ఫీచర్లు, డిజైన్‌లో మార్పులు

ఫీచర్ల విషయానికి వస్తే, Yamaha EC-06లో కలర్‌ LCD డిస్‌ప్లే, మూడు రైడింగ్‌ మోడ్స్‌, రివర్స్‌ అసిస్ట్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. డిస్‌ప్లే లేఅవుట్‌ పాత River Indie డిజైన్‌లాగే ఉంటుంది. ఇటీవల వచ్చిన Indie Gen 2.5లో మాత్రం కొత్త లేఅవుట్‌ ఇచ్చారు.

డిజైన్‌ పరంగా చూస్తే, Yamaha EC-06కు షార్ప్‌, స్లీక్‌ లుక్స్‌ ఉన్నాయి. River Indie బాక్సీగా, యుటిలిటేరియన్‌ డిజైన్‌తో ఉంటే, EC-06 మాత్రం మరింత కన్వెన్షనల్‌గా కనిపిస్తుంది. హెడ్‌ల్యాంప్స్‌, టెయిల్‌ లైట్‌ కూడా సాధారణ స్కూటర్‌ల మాదిరిగానే డిజైన్‌ చేశారు.

స్టోరేజ్‌, బరువు తేడాలు

River Indie ప్రత్యేకత దాని భారీ స్టోరేజ్‌. 43 లీటర్ల బూట్‌, ముందు భాగంలో 12 లీటర్ల స్టోరేజ్‌ ఉండటం దానికి పెద్ద ప్లస్‌. కానీ Yamaha EC-06లో మాత్రం 24.5 లీటర్ల అండర్‌సీట్‌ స్టోరేజ్‌ మాత్రమే ఉంది. ముందు భాగంలో ఓపెన్‌ కబ్బీ ఇచ్చారు.

ఈ తక్కువ స్టోరేజ్‌ వల్లే EC-06 బరువు కొంత తగ్గింది. River Indieతో పోలిస్తే ఇది 3 కిలోలు తక్కువ, మొత్తం బరువు 132 కిలోలు మాత్రమే.

ధర, లభ్యత వివరాలు

River Indie కంటే Yamaha EC-06 ధర రూ.22,000 ఎక్కువ. Yamaha బ్యాడ్జ్‌ ఉన్నా, ఈ స్కూటర్‌ కర్ణాటకలోని హోస్కోటె వద్ద River ఫ్యాక్టరీలోనే తయారు కానుంది.

Yamaha బ్రాండ్‌పై నమ్మకం ఉన్నవారికి, స్లీక్‌ డిజైన్‌తో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ కోరుకునేవారికి Yamaha EC-06 ఒక కొత్త ఎంపికగా నిలుస్తోంది. అయితే ధర, ఫీచర్ల పోలికను చూసుకుని నిర్ణయం తీసుకోవడం మంచిది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

Royal Enfield Himalayan 440: తక్కువ ధరలో అడ్వెంచర్ టూరర్.. కొనేముందు తెలుసుకోవాల్సిన 5 విషయాలు
రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్‌ 440 కొనాలా, వద్దా? 3 ప్లస్ పాయింట్లు.. ఈ 2 మైనస్‌లు!
2027 KTM 200 Dukeలో రైడింగ్ మోడ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్ సహా కొత్త ఫీచర్లు.. మీరు తెలుసుకోవాల్సిన 7 విషయాలు
KTM 200 Duke మరోసారి అప్‌డేట్.. ఈసారి కొత్తగా వచ్చిన ఫీచర్లు ఏంటి?
Skoda Kodiaq vs Volkswagen Tayron.. ఏ SUV ఎక్కువ మైలేజీ ఇస్తుంది? రియల్ వరల్డ్ టెస్ట్‌లో ఆసక్తికర ఫలితాలు
రియల్‌ వరల్డ్‌ మైలేజ్‌ టెస్ట్‌: స్కోడా కొడియాక్‌, వోక్స్‌వ్యాగన్ టైరాన్‌లో ఏది బెస్ట్‌?
LLR Online Test: ఇంటి నుంచే లెర్నర్ లైసెన్స్ పొందొచ్చు.. ఏఐ టెక్నాలజీతో ఎల్ఎల్ఆర్ ఎగ్జామ్.. రవాణా శాఖ కీలక నిర్ణయం
ఇంటి నుంచే లెర్నర్ లైసెన్స్ పొందొచ్చు.. ఏఐ టెక్నాలజీతో ఎల్ఎల్ఆర్ ఎగ్జామ్.. రవాణా శాఖ కీలక నిర్ణయం

వీడియోలు

Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nandikotkuru Municipal Elections: కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
Andhra Pradesh Rains Update: తీరం దాటినా వణికిస్తున్న మురసు తుపాను.. ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు.. విజయవాడకు బుడమేరు ముప్పు
తీరం దాటినా వణికిస్తున్న మురసు తుపాను.. ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు.. విజయవాడకు బుడమేరు ముప్పు
Raptadu Incident Update: రాప్తాడు దాడి ఘటన.. నిందితుడు హేమంత్‌ కాలు తొలగించిన డాక్టర్లు
రాప్తాడు దాడి ఘటన.. నిందితుడు హేమంత్‌ కాలు తొలగించిన డాక్టర్లు
Royal Enfield Himalayan 440: తక్కువ ధరలో అడ్వెంచర్ టూరర్.. కొనేముందు తెలుసుకోవాల్సిన 5 విషయాలు
రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్‌ 440 కొనాలా, వద్దా? 3 ప్లస్ పాయింట్లు.. ఈ 2 మైనస్‌లు!
YS Jagan: మాజీ సీఎం వైఎస్ జగన్‌పై కేసు నమోదు చేసిన పులివెందుల పోలీసులు
మాజీ సీఎం వైఎస్ జగన్‌పై కేసు నమోదు చేసిన పులివెందుల పోలీసులు
The Grand Master OTT : చెస్ బోర్డుపై పేదింటి కుర్రాడి జర్నీ - ఓటీటీలోకి స్పోర్ట్స్ ఎమోషనల్ డ్రామా 'ది గ్రాండ్ మాస్టర్'... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
చెస్ బోర్డుపై పేదింటి కుర్రాడి జర్నీ - ఓటీటీలోకి స్పోర్ట్స్ ఎమోషనల్ డ్రామా 'ది గ్రాండ్ మాస్టర్'... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Malla Reddy Farmhouse: మల్లారెడ్డి ఫామ్‌హౌస్ పైకి హైడ్రా బుల్డోజర్లు.. ఫాక్స్ సాగర్ ఎఫ్‌టీఎల్‌లో కాంపౌండ్ గోడ, గేటు కూల్చివేత
మల్లారెడ్డి ఫామ్‌హౌస్ పైకి హైడ్రా బుల్డోజర్లు.. ఫాక్స్ సాగర్ ఎఫ్‌టీఎల్‌లో కాంపౌండ్ గోడ, గేటు కూల్చివేత
Revanth Reddy Delhi Vote Chori Rally Mobilisation: ఢిల్లీ ర్యాలీకి భారీగా జన సమీకరణ - హైకమాండ్ వద్ద పెరిగిన రేవంత్ రెడ్డి పట్టు !
ఢిల్లీ ర్యాలీకి భారీగా జన సమీకరణ - హైకమాండ్ వద్ద పెరిగిన రేవంత్ రెడ్డి పట్టు !
Embed widget