అన్వేషించండి

Rs 2 crore for number plate : గుంటూరోళ్లు అంతే - నంబర్ ప్లేట్ ధర 2.08 కోట్లు: దేశంలోనే అత్యంత ఖరీదైన రికార్డు సృష్టించిన వ్యక్తి!

DDC 0001: ఓ నెంబర్ కోసం రవాణా శాఖ కార్యాలయాల్లో వేలంపాట సహజమే. కానీ పాత నెంబర్ కోసం జరిగిన వేలంలో రెండు కోట్లు వెచ్చించారు ఓ గుంటూరు వ్యక్తి.

Andhra man pays Rs 2 crore for number plate:  ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక వ్యక్తి ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్నారు. తన కారు నంబర్ ప్లేట్ కోసం ఏకంగా 2.08 కోట్ల రూపాయలు ఖర్చు చేయడమే దీనికికారణం.  ఒక సాధారణ లగ్జరీ కారు ధర కంటే కేవలం నంబర్ ప్లేట్ కే ఇంత భారీ మొత్తం వెచ్చించడం ఇదే మొదటిసారి.  
 
గుంటూరుకు చెందిన కిరణ్ కొలపాకుల అనే వ్యాపారవేత్త ఈ అసాధారణమైన వేలంలో విజేతగా నిలిచారు. ప్రముఖ లగ్జరీ కార్ల విక్రయ సంస్థ  బిగ్ బాయ్ టాయ్జ్  (Big Boy Toyz) ఇటీవలే తమ కొత్త వేలం ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. ఈ సందర్భంగా నిర్వహించిన ఈ ఆక్షన్‌లో  DDC 0001 అనే వీఐపీ నంబర్ ప్లేట్‌ను కిరణ్ రూ. 2.08 కోట్లకు దక్కించుకున్నారు. భారతదేశ చరిత్రలో ఒక వాహనం నంబర్ ప్లేట్ కోసం వెచ్చించిన అత్యధిక మొత్తం ఇదే కావడం విశేషం.

 ఎందుకింత ధర? 

నిజానికి ఈ నంబర్ ప్లేట్ గతంలో  బిగ్ బాయ్ టాయ్జ్ వ్యవస్థాపకుడు జతిన్ అహూజా వ్యక్తిగత వినియోగంలో ఉండేది.  0001  అనే అంకెకు ఉన్న క్రేజ్ ఒక ఎత్తు అయితే,  DDC  అనే ప్రత్యేక అక్షరాల కలయిక దీన్ని మరింత అరుదైనదిగా  మార్చింది. ఈ నంబర్ ప్లేట్‌ను కేవలం రిజిస్ట్రేషన్ నంబర్‌గా మాత్రమే కాకుండా, ఒక  డిజిటల్ అసెట్  లేదా కలెక్టబుల్ గా భావించి ఈ స్థాయిలో వేలం పాట జరిగినట్లు తెలుస్తోంది.

 కారు కంటే నంబర్ ప్లేటే ఖరీదు! 

అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ప్రస్తుతం ఈ నంబర్ ప్లేట్‌ను ఒక  మారుతి సుజుకి ఇగ్నిస్ కారుపై అమర్చిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కారు మార్కెట్ విలువ సుమారు 7 నుంచి 10 లక్షల రూపాయల మధ్య ఉంటుంది. అంటే, కారు ధర కంటే దాని నంబర్ ప్లేట్ ధర దాదాపు 20 రెట్లు ఎక్కువగా ఉండటం నెటిజన్లను విస్మయానికి గురిచేస్తోంది. అయితే, భవిష్యత్తులో ఈ నంబర్‌ను కిరణ్ తన వద్ద ఉన్న ఏదైనా ఖరీదైన లగ్జరీ కారుకు మార్చుకునే అవకాశం ఉందని  భావిస్తున్నారు.

సరికొత్త రికార్డులు 

ఇంతకుముందు హర్యానాకు చెందిన ఒక వ్యక్తి తన కారు నంబర్ HR 88B 8888 కోసం రూ. 1.17 కోట్లు వెచ్చించి రికార్డు సృష్టించారు. ఇప్పుడు ఆ రికార్డును కిరణ్ కొలపాకుల భారీ తేడాతో అధిగమించారు. కేవలం మెట్రో నగరాల్లోనే కాకుండా, గుంటూరు వంటి ప్రాంతాల నుంచి కూడా లగ్జరీ వస్తువులపై పెట్టుబడి పెట్టే ఆసక్తి పెరుగుతోందని ఈ ఘటన నిరూపిస్తోంది.  నచ్చిన వస్తువు కోసం ఎంతైనా ఖర్చు చేయవచ్చు అనే మాటకు ఈ డీల్ ఒక నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది.

నంబర్ రిటెన్షన్ ద్వారా మార్చుకోవచ్చు! 
 
పాత వాహనం   రిజిస్ట్రేషన్ నంబర్‌ను కొత్త వాహనానికి మార్చుకోవచ్చు. దీనిని  నంబర్ రిటెన్షన్ విధానం అంటారు.  పాత వాహనాన్ని విక్రయించేటప్పుడు లేదా స్క్రాప్ చేసేటప్పుడు, ఆ నంబర్‌ను మీ వద్దే ఉంచుకోవాలని సంబంధిత ఆర్టీఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకోసం ప్రభుత్వం నిర్ణయించిన నామినల్ ఫీజును చెల్లించి, పాత వాహనానికి కొత్త నంబర్‌ను కేటాయించేలా చూసుకోవాలి. ఆ తర్వాత కొనుగోలు చేసే కొత్త వాహనానికి అదే పాత నంబర్‌ను కేటాయించమని డీలర్ లేదా ఆర్టీఓ అధికారులను కోరవచ్చు.  ఈ ప్రక్రియ అంతా పాత వాహనం రిజిస్ట్రేషన్ రద్దు కావడానికి ముందే లేదా విక్రయించిన వెనువెంటనే పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాంటి లాంఛనాలు పూర్తి చేసి ఈ నెంబర్ ను వేలం వేస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

రూ. 2 లక్షల డౌన్ పేమెంట్‌తో Tata Nexon కొంటే, EMI ఎంత చెల్లించాలి
రూ. 2 లక్షల డౌన్ పేమెంట్‌తో Tata Nexon కొంటే, EMI ఎంత చెల్లించాలి
గత ఆరు నెలల్లో జనం ఎగబడి కొన్న కార్లు ఇవే - బాలెనో, డిజైర్, విండ్సర్‌కు జేజేలు
పెట్రోల్‌కు బలెనో.. CNGకి డిజైర్.. EVల్లో విండ్సర్ - 2026లో టాప్ సెల్లింగ్‌ కార్లు ఇవే!
టాటా నెక్సాన్ కామో ఎడిషన్‌లో ఆశ్చర్యపరిచే మార్పులు.. కొత్త రంగులు, 12.3 అంగుళాల స్క్రీన్, మరెన్నో!
టాటా నెక్సాన్‌ కామో ఎడిషన్ లాంచ్ - రూ.9.99 లక్షలే! ఏంటి దీని స్పెషాలిటీ?
మారుతి గ్రాండ్ విటారా నుంచి బలెనో వరకు సూపర్‌ ఆఫర్లు - రూ.1.55 లక్షల వరకు డిస్కౌంట్
ఇప్పుడు మారుతి కారు కొనేవాళ్లు నక్క తోక తొక్కినట్లే, రూ.లక్షల్లో డిస్కౌంట్లు!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget