India ODI World Cup Winning Captain | ఇండియాను ప్రపంచ విజేతలుగా నిలిపిన కెప్టెన్లు
ఇండియన్ క్రికెట్ టీమ్ కు కెప్టెన్ గా ఉండడం అనేది ప్రతి ప్లేయర్ డ్రీమ్. అలాంటి అవకాశం చాలా తక్కువ మందికి దొరుకుతుంది. కెప్టెన్ గా ఉంటూ తమ టీమ్ ను ప్రపంచ ఛాంపియన్ గా నిలబెట్టడం అంటే.. అది ఒక హైప్ ఇచ్చే ఫీలింగ్ అనే చెప్పాలి. ప్లేయర్స్ ను మోటివేట్ చేస్తూ.. సరైన నిర్ణయాలు తీసుకుంటూ... మన ఇండియాను నెంబర్ 1 గా నిలిపిన కెప్టెన్లు ఎంతోమంది. కానీ వన్డే వరల్డ్ కప్ లో ఇండియాను ఛాంపియన్ గా నిలిపిన కెప్టెన్ల గురించి మాట్లాడితే ముందు గుర్తు వచ్చే వచ్చే పేరు కపిల్ దేవి. 1983 వరల్డ్ కప్.
ఇండియాకు 1983 వరల్డ్ కప్ టోర్నమెంట్ ఎంతో స్పెషల్. ఎవరు సాధ్యం కాదు అనుకున్నది కెప్టెన్ కపిల్ దేవ్ చేసి చూపించాడు. పట్టుదలతో ఆడితే ఏదైనా మన సొంతం అని ఈ ఒక టోర్నమెంట్ తో నిరూపించాడు. వెస్టిండీస్ వంటి గొప్ప టీమ్ ను ఓడించి ప్రపంచ కప్‌ను గెలుచుకుంది టీమ్ ఇండియా.
1983 తర్వాత టీమ్ ఇండియా వన్డే వరల్డ్ కప్ కోసం 2011 వరకు వేచి చూడాల్సి వచ్చింది. గ్రేటెస్ట్ కెప్టెన్ గా పేరు తెచ్చుకున్న ధోని సారథ్యంలో ఇండియా సొంత గడ్డపై కప్ సాధించింది. ఫైనల్ మ్యాచ్ లో ధోని కొట్టిన ఆ 6 ను ఎవరు మర్చిపోలేరు. కట్ చేస్తే 2025. టీమ్ ఇండియా మహిళా వన్డే వరల్డ్ కప్ ను కెప్టెన్ హర్మన్ ప్రీత్ సారథ్యంలో గెలుచుకుంది. వన్డే క్రికెట్ లో ఇండియాను ఛాంపియన్ గా నిలబెట్టిన ఈ ముగ్గురు కెప్టెన్ల గురించి మీరు ఎం ఎనుకుంటున్నారో కామెంట్ చేయండి.





















