Sridevi Drama Company Promo : స్టేజ్‌పై నూకరాజు, పంచ్ ప్రసాద్ ఫైట్ - ఒకరిపై ఒకరు ఫైర్, నమ్మొచ్చా బాసూ !?
Sridevi Drama Company Promo : 'శ్రీదేవి డ్రామా కంపెనీ' లేటెస్ట్ ప్రోమోలో నూకరాజు, పంచ్ ప్రసాద్ మధ్య సీరియస్ ఫైట్ జరిగినట్టు చూపించారు. అలాగే యాదమ్మ రాజు అవాక్కవ్వడం కూడా హైలెట్‌గా నిలిచింది.

Sridevi Drama Company: బుల్లితెర పాపులర్ షోల్లో 'శ్రీదేవి డ్రామా కంపెనీ' కూడా ఒకటి. ఇక పేరుకు తగ్గట్టుగానే ఈ షోలో ప్రతి వారం ఏదో ఒక డ్రామా జరుగుతూనే ఉంటుంది. ఇంతకుముందు ఇదే స్టేజ్‌పై ఎన్నో గొడవలు జరగడం, ఆ తర్వాత అవన్నీ ప్రాంక్ అని తేలిపోవడం చూశాం. తాజాగా 'శ్రీదేవి డ్రామా కంపెనీ' లేటెస్ట్ ప్రోమోలో పంచ్ ప్రసాద్, నూకరాజు మధ్య జరిగిన ఫైట్ హైలెట్‌గా నిలిచింది.
స్టేజ్‌పైనే పంచ్ ప్రసాద్, నూకరాజు ఫైట్...
రష్మీ గౌతమ్ హోస్ట్‌గా, ఇంద్రజ జడ్జిగా వ్యవహరిస్తున్న బుల్లితెర షో 'శ్రీదేవి డ్రామా కంపెనీ'. ఇందులో ఆటో రాంప్రసాద్, నూకరాజు, నరేష్, శ్రీదేవి, తాగుబోతు రమేష్ తదితరులు తమ కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. తాజాగా రిపబ్లిక్ డే రోజు ప్రసారం కాబోతున్న ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేశారు. ఆ ప్రోమోలో పెన్నుపై పంచ్ ప్రసాద్ వేసిన పంచులు హైలెట్‌గా నిలిచాయి. "పెన్ను సరిగ్గా రాయడం లేదు సార్" అని ఓ వ్యక్తి కంప్లైంట్ చేయగా, "చదువుకోలేదేమో" అంటూ హీలేరియస్ పంచ్ వేసి కామెడీ చేశారు. ఆ తర్వాత పాటలు, ఆటలతో రిపబ్లిక్ డే స్పెషల్‌గా రాబోతున్న 'శ్రీదేవి డ్రామా కంపెనీ' ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతున్నట్టు చూపించారు.
ఇక అందులో భాగంగానే ప్రోమోలో పంచ్ ప్రసాద్ మాట్లాడుతూ.. "బేసిగ్గా నూకరాజు నాకు బ్రదర్ కంటే ఎక్కువ. వాడసలు నాతో ఎందుకు మాట్లాడట్లేదు అనేది నాకు తెలియాలి" అని అన్నాడు. దీంతో నూకరాజు ఎంట్రీ ఇచ్చి "ఒక మనిషికి దూరంగా ఉంటున్నాము అంటే... అదేంటో నాకు తెలుసు" అని అన్నాడు. వెంటనే పంచ్ ప్రసాద్ అందుకుని "తెలిస్తే నాకు చెప్పొచ్చు కదా" అని అడిగాడు. "అది ఆల్రెడీ మనం డిస్కస్ చేశాము. ఇక్కడ డిస్కస్ చేసేది కాదు" అంటూ నూకరాజు ఈ విషయాన్ని మాట్లాడ్డానికి ఒప్పుకోలేదు. ఆ తర్వాత ఇద్దరి మధ్య సీరియస్ డిస్కషన్ నడిచినట్టుగా చూపించారు. హీటింగ్ డిస్కషన్ జరగడంతో, ఏకంగా లైట్స్ ఆఫ్ చేసి గొడవను చల్లబరిచే ప్రయత్నం చేసినట్టు ప్రోమోలో కనిపిస్తోంది. అసలు వీరిద్దరి మధ్య ఏం జరిగింది అన్నది తెలియాల్సి ఉంది.
అదంతా ప్రాంకా?
'శ్రీదేవి డ్రామా కంపెనీ' లేటెస్ట్ ప్రోమోను చూశాక నెటిజన్లు పంచ్ ప్రసాద్, నూకరాజు మధ్య జరిగిన ఫైట్ ప్రాంక్ అని అనుకుంటున్నారు. "ట్రాజెడీని కూడా పంచ్ ప్రసాద్ కామెడీగా చేస్తాడు. కాబట్టి కామెడీ కోసం ప్రాంక్ చేయడా?" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వాళ్ల అభిమానులు మాత్రం నూకరాజు, ప్రసాద్ ఇద్దరూ బ్రదర్స్‌లాగా కలిసి ఉండాలని కోరుకుంటున్నారు. మరి ఇది నిజంగానే ప్రాంకా? లేదంటే సీరియస్‌గా నూకరాజు - ప్రసాద్ మధ్య ఫైట్ జరిగిందా? అనేది తెలియాలంటే జనవరి 26న ప్రసారం కాబోతున్న 'శ్రీదేవి డ్రామా కంపెనీ' కొత్త ఎపిసోడ్‌ను చూడాల్సిందే.
యాదమ్మ రాజు అవాక్కు
ఇక ఇదే ప్రోమోలో హైలెట్‌గా నిలిచిన మరో విషయం యాదమ్మ రాజు పేరు. కంటెస్టెంట్‌గా పాల్గొన్న ఓ అమ్మాయిని పిలిచి, రష్మీ స్టేజ్‌పై ఒక టాస్క్ ఇచ్చింది. ఆ టాస్క్‌లో భాగంగా ఎదురుగా ఉన్న బోర్డుపై అందరి పేర్లు పెట్టి "ఇందులో ఒకరిని టార్గెట్ చేయొద్దు అంటే ఎవరి పేరు చెప్తావ్?" అని ప్రశ్నించింది. వెంటనే ఆ అమ్మాయి "ఎద్దమ్మా రాజు" అంటూ సమాధానం చెప్పడంతో యాదమ్మ రాజు అవాక్కైనట్టు ఫన్నీ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు.
Read Also : Dil Raju IT Raids: హైదరాబాద్‌లో ఐటీ సోదాలు- దిల్ రాజు సహా నిర్మాతల ఇళ్లు, ఆఫీసులపై ఆకస్మిక దాడులు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

