Reverse Digital Arrest: డిజిటల్ అరెస్టు చేసి బుక్కయిపోయాడు - ఈ స్కామర్ బుక్కయిన వైనం తెలిస్తే నవ్వకుండా ఉండలేరు !
Kanpur: డిజిటల్ అరెస్టు పేరుతో చాలా మంది మోసాలు చేస్తున్నారు. కానీ ఆ డిజిటల్ అరెస్టు చేసేస వారిని కూడా స్కామ్ చేసేశాడో యువకుడు.

Cyber Fraudster: యూపీలోని కాన్పూర్ కు చెందిన ఓ యువకుడికి సీబీఐ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. నువ్ ఫోన్ లో అశ్లీల దృశ్యాలు చూస్తున్నావు నీపై కేసు నమోదు అయింది. మా ఆఫీసర్ కాల్ చేస్తాడని ఆ ఫోన్ సారాంశం. అనుకున్నట్లుగానే ఓ ఆఫీసర్ కాల్ చేశాడు.సీబీఐ పోలీసుల డ్రెస్ లో కూర్చుని పిల్లవాడ్ని గద్దించాడు. కేసు నమోదు చేస్తామని అలా చేయకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో ఇది డిజిటల్ అరెస్ట్ అన్న నిర్ణయానికి వచ్చిన ఆ వ్యక్తి .. ఈ విషయంలో నువ్వు పుడింగివా..నేను తోపునో తేల్చుకుందామని డిసైడైపోయాడు.
వెంటనే భయపడిపోయినట్లుగా నటన ప్రారంభించారు. ఈ విషయం తన తల్లికి తెలిస్తే చితక్కొట్టేస్తుందని డబ్బులు ఇచ్చేస్తాన్నాడు.ఫలానా రోజు ఇస్తానని చెప్పడంతో అప్పటికి వదిలేశారు. తర్వాత సమయం వచ్చినప్పుడు కాల్ చేశారు. డబ్బులు ఇవ్వకపోతే మీ తల్లి దగ్గరకు పోలీసులు వస్తారని బెదిరించారు. దీంతో తన వద్ద ఓ బంగారం చెయిన్ ఉందని కాకపోతే కుదువ పెట్టానని..మూడు వేలు ఇస్తే వాటిని ఇచ్చి చెయిన్ తెచ్చి అమ్మేసి ఇస్తానని ఆ వ్యక్తి చెప్పాడు. అది నిజమేనని నమ్మిని స్కామర్.. మూడు వేల రూపాయలు పంపించాడు.
తర్వాత మళ్లీ డబ్బులు పంపకపోవడంతో మళ్లీ స్కామర్ ఫోన్ చేశాడు. అప్పుడు ఆ యువకుడు తన స్నేహితుడ్ని చెయిన్ ను తాకట్టు పెట్టుకున్న వ్యక్తిగా పరిచయం చేశాడు. వడ్డీ ఎక్కువ అయిందని..అదనీ ఇదనీ చెప్పాడు. తాను ఆ చెయిన్ ఇవ్వడం లేదన్నారు. ఇంకా ఏడు వేల రూపాయలు కడితే ఆ చెయిన్ అస్తానన్నాడు. దాంతో స్కామ్ ఆ ఏడువేల రూపాయలుకూడా మళ్లీ కట్టాడు. అమ్మేసి డబ్బులు జమ చేస్తానని స్కామర్ కుచెప్పారు.
అయితే మళ్లీ డబ్బులు చేయలేదు. ఈ సారి కూడా స్కామర్లు ఫోన్ చేయడంతో మరో కారణం చెప్పి డబ్బులు అడిగాడు యువకుడు. కానీఈ ప్రాసెస్ చూస్తే తాము మోసం చేస్తున్న యాంగిల్ లోనే ఉండటంతో అనుమానం వచ్చి తన డబ్బులు తనకు ఇచ్చేయమన్నాడు స్కామర్. ఈ స్కామర్ డీటైల్స్ తీసుకుని నేరుగా వెళ్లి పోలీసులకు సమాచారం ఇచ్చాడు ఆ యువకుడు. స్కామర్ నే స్కామ్ చేసిన ఆ యువకుడ్ని చూసి పోలీసులు అబ్బుర పడ్డారు.
మామూలుగా అయితే డిజిటల్ అరెస్టు అని భయపడిపోయి కోట్లు సమర్పించుకునేవారు చాలా మంది ఉంటారు. అలాంటి వారంతా ఈ కుర్రాడ్ని ఆదర్శంగా తీసుకుని తిరిగి మోసం చేయకపోయినా వాళ్ల గుప్పిట్లో పడవద్దన్న సూచనలను పోలీసులు ఇస్తున్నారు.
చట్టంలో డిజిటల్ అరెస్ట్ అనేదే లేదు. చేయని నేరాలను మీద వేసేసి.. బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు దండుకుంటున్నారని అలాంటి వారికి భయపడవద్దని.. అలా ఎవరైనా బెదిరిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సైబర్ నిపుణులు పిలుపునిస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

