Hyderabad Road Accident: జూబ్లీహిల్స్‌లో మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టి కారు బీభత్సం, డ్రైవర్‌కు తీవ్రగాయాలు - మద్యం మత్తే కారణమా?
Hyderabad Car Accident: జూబ్లీహిల్స్ లో ఓ కారు మెట్రో పిల్లర్ ను ఢీకొట్టింది. ఆపై డివైడర్ ను ఢీకొట్టి రోడ్డు మధ్యలో నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు.

Hyderabad Car Accident | హైదరాబాద్: నగరంలో అర్ధరాత్రి వేళ, తెల్లవారుజామున తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ఘటనలు చూస్తూనే ఉంటాం. తాజాగా హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఏరియాలో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో దూసుకొచ్చిన కారు మెట్రో పిల్లర్‌ను ఆపై డివైడర్‌ను ఢీకొట్టి రోడ్డుకు అడ్డంగా నిలిచిపోయింది. కారు వేగంగా దూసుకొచ్చి మెట్రో పిల్లర్ ను ఢీకొట్టి బీభత్సం చేయడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
ఈ రోడ్డు ప్రమాదంలో కారు డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కృష్ణానగర్ నుంచి కారు జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో కారు డ్రైవింగ్ చేయడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

