Viral Video: రంగులు పూయనివ్వలేదని కొట్టి చంపేశారు - రాజస్థాన్‌లో దారుణం - గుండెలు పిండేసే వీడియో
Rajasthan: హోలీ పండుగ రంగులు పూయించుకోలేదని ఓ యువకుడ్ని కొంత మంది కొట్టి చంపారు. రాజస్తాన్ లోని దౌసాలో ఈ ఘటన జరిగింది.

Holi Murder: రంగులు పూయించుకోలేదని ఓ వ్యక్తిని కొట్టి చంపిన ఘటన రాజస్థాన్ లోని దౌసాలో జరిగింది. హన్స్ రాజ్ అనే వ్యక్తి లైబ్రరీలో చదువుకుంటున్నారు. ఆ సమయంలో ముగ్గురు వ్యక్తులు రంగులు పూసేందుకు వచ్చారు. అయితే ఆ రంగులు పూయించుకునేందుకు హన్స్ రాజ్ వ్యతిరేకత వ్యక్తం చేశారు. దీంతో అతన్ని ముగ్గురు వ్యక్తులు బెల్టులతో కొట్టారు. తరవాత గొంతు కోసి చంపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ముగ్గురు వ్యక్తులు హన్స్ రాజ్ గ్రామంలోనే ఉంటారని పోలీసులు గుర్తించారు.
दौसा जिले के लालसोट में लाइब्रेरी में पढ़ रहे हंसराज मीणा नामक छात्र की निर्मम हत्या सिर्फ़ इसलिए कर दी गई क्योंकि उसने गुलाल लगाने से मना कर दिया था। यह भजनलाल सरकार की कानून-व्यवस्था की नाकामी को दर्शाता है। हम प्रशासन से दोषियों पर सख्त कार्रवाई की मांग करते हैं! pic.twitter.com/5HJZWbWrFC
— Hansraj Meena (@HansrajMeena) March 13, 2025
హన్స్ రాజ్ ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న లక్ష్యంతో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. అందు కోసం లైబ్రరీలోనే ఎక్కువ సేపే ఉంటూ చదవుకుంటూ ఉన్నాడు. అయితే ్తని చదువును డిస్ట్రబ్ చేయాలని ఉద్దేశమో లేకపోతే హోలీ పండుగ అని ఏమో కానీ రంగులు పూసేందుకు ప్రయత్నించారు. రోడ్డు మీద కూడా కాకుండా నేరుగా లైబర్రీలోకి వచ్చి రంగులు పూసే ప్రయత్నం చేశారు. కానీ అతను అంగీరించలేదు. దాంతో నిందితులలో ఒకరు హన్స్‌రాజ్‌ను గొంతు కోసి చంపారని పోలీసులు ప్రకటించారు.
#Holi का साइड इफेक्ट…
— Ali Sohrab (@007AliSohrab) March 13, 2025
राजस्थान के दौसा में लाइब्रेरी में पढ़ कर रहे
छात्र "हंसराज मीणा" की
होली का रंग लगाने से मना करने पर
3 युवकों ने पीट पीटकर अधमरा किया
और फिर गला दबाकर निर्मम हत्या कर दिए…#Rajasthan pic.twitter.com/KcpLbSbeAx
మృతుడి కుటుంబ సభ్యులు , గ్రామస్తులు హన్స్‌రాజ్ మృతదేహంతో గురువారం తెల్లవారుజామున 1 గంట వరకు నిరసన తెలిపారు జాతీయ రహదారిని దిగ్బంధించారు. హన్స్‌రాజ్ కుటుంబానికి 50 లక్షల పరిహారం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, నిందితులైన ముగ్గురిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
రంగులు పూయించుకోవాలా లేదా అన్నది వారి ఇష్టమని ఇలా వ్యతిరేకించినందుకు చంపడం ఏమిటని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. నిందితుల్ని వదిలి పెట్టకూడదని అంటున్నారు.
कोई होली खेले या न खेले उसका लोकतांत्रिक अधिकार!
— ved prakash vidrohi (@vpvidrohi) March 13, 2025
पर एक छात्र हंसराज मीणा की रंग न लगाने के अनुरोध के बाद रंग लगाने को आतुर लफंगों द्वारा उसकी हत्या करना घोर अमानवीय कुकृत्य!
राजस्थान में कानून व्यवस्था ध्वस्त हो चुकी!
और भाजपा-संघी राज जंगल राज में बदला!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

