Vikarabad Road Accident: వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటో, లారీ ఢీకొని నలుగురు మృతి
వికారాబాద్ జిల్లా బుగ్గరామేశ్వరం సమీపంలో ఆటో, లారీ ఢీకొన్న ప్రమాదంలో పెండ్లిమడుగు గ్రామానికి చెందిన నలుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.

Road Accident in Vikarabad District | వికారాబాద్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే గ్రామానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు. పెండ్లిమడుగు నుంచి కేరెల్లికి వెళ్తున్న ఒక ఆటో, బుగ్గరామేశ్వరం సమీపంలోని మలుపు వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
మృతులను ఆటో డ్రైవర్ నాగేశ్తో పాటు అదే గ్రామానికి చెందిన మహిళలు చంద్రమ్మ, పార్వతమ్మ, సరితగా పోలీసులు గుర్తించారు. ఒకే గ్రామానికి చెందిన నలుగురు ఒకేసారి మృత్యువాత పడటంతో ఆ గ్రామంలో పలు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ట్రెండింగ్ వార్తలు























