Dil Raju IT Raids: హైదరాబాద్‌లో ఐటీ సోదాలు- దిల్ రాజు సహా నిర్మాతల ఇళ్లు, ఆఫీసులపై ఆకస్మిక దాడులు
IT Raids in Hyderabad | హైదరాబాద్‌లో మంగళవారం ఉదయం ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. దిల్ రాజు సహా ప్రముఖ నిర్మాతల ఇళ్లు, ఆఫీసులపై ఆకస్మిక దాడులు జరిపింది ఐటీ శాఖ.

IT Raids At Dil Raju Home | హైదరాబాద్: హైదరాబాద్‌లో పలు చోట్ల ఐటీ అధికారులు ఆకస్మిక దాడులు చేస్తున్నారు. గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాము సినిమాలు నిర్మించిన దిల్ రాజు ప్రొడక్షన్స్ పై ఐటీ అధికారులు ఫోకస్ చేశారు. ప్రముఖ నిర్మాతలు, తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు, శిరీష్, లతో పాటు దిల్ రాజు కూతురు హన్సితా రెడ్డిలకు సంబంధించిన ఆస్తులపై ఐటి సోదాలు చేపట్టినట్లు సమాచారం. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లలో పలు నిర్మాతల ఇళ్లు, ఆఫీసులు, ఇతర ఆస్తులపై ఐటీ అధికారులు తనిఖీలు జరుగుతున్నాయి. ఏకకాలంలో 8 చోట్ల దాదాపు 50 మంది అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
హైదరాబాద్‌లో ఐటీ అధికారుల దూకుడు కొనసాగిస్తున్నారు. ఎఫ్‌డీసీ చైర్మన్, నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్ తో పాటు మైత్రి మూవీ మేకర్స్ సంస్థలోనూ ఐటీ సోదాలు జరుగుతున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ సీఈవో చెర్రీ ఇళ్లు, ఆఫీసుల్లో.. మైత్రి నిర్మాతల నివాసాలలోనూ అధికారులు తనిఖీలు చేపట్టారు. భారీ కలెక్షన్లు సాధించిన అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిందని తెలిసిందే.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

