Skeleton Lake: 16 వేల అడుగుల ఎత్తులో ఎటు చూసినా ఎముకలే..
హిమాలయాల్లో మంచు కరిగిన ప్రతిసారీ ఒక భయంకరమైన రహస్య సరస్సు బయటపడుతుంది. ఆ సరస్సులో ఎటు చూసినా కంకాళాలే. వందల పుర్రెలు, వేల అస్థిపంజరాలతో నిండిపోయి ఏదో నరకానికి మార్గంలా ఉంటుందా సరస్సు. సముద్ర మట్టానికి దాదాపు 16 వేల అడుగుల ఎత్తులో ఉండే ఆ భయంకరమైన సరస్సు.. ఇప్పటికీ ప్రపంచానికే అంతుచిక్కని మిస్టరీగా ఉంది. అయితే మానస సరోవరం లాంటి దైవిక సరస్సులకి నిలయమైన హిమాలయాల్లో అసలు కంకాళాలతో నిండి ఉండే సరస్సు ఎలా వచ్చింది? అసలు ఆ సరస్సులోకి అస్థిపంజరాలెలా వచ్చాయి? పదండి ఈ రోజు మిస్టరీ టూ హిస్టరీలో తెలుసుకుందాం.
హాయ్ అండ్ వెల్‌కమ్ టూ మిస్టరీ టూ హిస్టరీ. హిమాలయాల్లో మన మేథస్సుకి, మన ఆలోచనలకి అంతుచిక్కని మిస్టరీలు ఎన్నో దాగి ఉన్నాయి. అలాంటి మిస్టరీల్లో ఒకటి రూప్ కుండ్. పవిత్ర గంగోత్రి పర్వత శ్రేణులలో ఈ సరస్సు ఉంటుంది. ఈ సరస్సును అక్కడి ప్రజలంతా 'స్కెలిటన్ లేక్’ అని పిలుస్తుంటారు. దానికి కారణం ఈ సరస్సులో ఎటు చూసినా ఎముకల గుట్టలు కనిపించడమే. అయితే ఈ సరస్సులోకి ఈ ఎముకలు ఎలా వచ్చాయనేది ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీనే. అయితే ఈ లేక్‌ని ఫస్ట్ టైం 1942లో బయటపడింది. అప్పట్లో బ్రిటిష్ ఇండయా ఆఫీసర్‌గా.. నందా దేవి రిజర్వ్‌లో పనిచేసే భారతీయ ఫారెస్ట్ రేంజర్ హెచ్‌కే మధ్వాల్ ఈ సరస్సును ఫస్ట్ టైం కనిపెట్టాడు. అయితే అప్పటికే రెండో ప్రపంచ యుద్ధం జరుగుతుండటంతో.. భారత్‌లోకి చొరబడటనికి ప్రయత్నించిన జపాన్ సైనికులే ఇక్కడ చలికి చనిపోయి ఉంటారని అనుకున్నారు. కానీ అసలు విషయం బయటపడ్డాక వాళ్ల వెన్నులో వణుకు పుట్టింది.





















