అన్వేషించండి

AI Agent Trading: ఏఐ ఏజెంట్ ద్వారా ఒక్క రాత్రిలో 40 లక్షల ప్రాఫిట్, క్లెయిమ్ చేసిన యూజర్.. నెటిజన్లు షాక్

AI Agent Trading: ఒక యూజర్ ఏఐ ఏజెంట్ సహాయంతో ఒకే రాత్రిలో 40 లక్షల రూపాయలకు పైగా లాభం సంపాదించినట్లు ఎక్స్‌లో క్లెయిమ్ చేశారు. అతని వాదనపై నెటిజన్లు ప్రశ్నలు, అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

AI Agent Trading: ఒక ఇన్వెస్టర్ ఏఐ (AI) ఏజెంట్ సహాయంతో కేవలం ఒక్క రాత్రిలోనే లక్షల రూపాయల లాభం పొందినట్లు క్లెయిమ్ చేయడం సంచలనంగా మారింది. తాను నిద్రలో ఉన్నప్పుడు, మార్కెట్‌లో 11 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేయడానికి ఏఐ ఏజెంట్ అనుమతి కోరింది. దానికి ఆ యూజర్ పర్మిషన్ ఇచ్చి నిద్రపోయాడు. ఉదయం లేచి చూసేసరికి అతనికి 40 లక్షలకు పైగా లాభం వచ్చింది. అయితే, సోషల్ మీడియాలో చాలా మంది వినియోగదారులు అతని వాదనపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరిగింది, యూజర్ ఏం చెప్పారు, నెటిజన్లు ఎందుకు ఇది కొట్టిపారేస్తున్నారో ఇక్కడ తెలుసుకోండి. 

ఏఐ ఏజెంట్ గడించిన లక్షల లాభం...

ఎక్స్ (X) వేదికగా ‘0x_Discover’ అనే యూజర్ ఈ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. OpenClaw సహాయంతో రూపొందించిన తన ఏఐ ఏజెంట్, ఒకే రాత్రిలో తనకు 40 లక్షల కంటే ఎక్కువ లాభాన్ని తెచ్చిపెట్టిందని అతను తెలిపాడు.  రాత్రి వేళ పాలీమార్కెట్ అనే ప్రిడిక్షన్ మార్కెట్ ప్లాట్‌ఫారమ్‌లో రూ.11 లక్షలు పెట్టుబడి పెట్టడానికి అతను ఏజెంట్‌కు అనుమతి ఇచ్చాడు. ఉదయం లేచి చూసేసరికి ఆ ఏజెంట్ 40 లక్షలకు పైగా లాభాన్ని అందించింది.

ఏఐ ఏజెంట్‌కు ప్రపంచవ్యాప్త సమాచారం

గత 9 రోజులుగా తాను OpenClawతో రూపొందించిన ఏఐ ఏజెంట్‌ను ఉపయోగిస్తున్నట్లు ఆ ఇన్వెస్టర్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఈ ఏజెంట్‌కు వార్తలు తెలుసుకునేందుకు యాక్సెస్ ఇచ్చారు. ఈ సమాచారంతో ఏఐ ఏజెంట్ 6 వేర్వేరు మార్కెట్లలో 11 లక్షలు పెట్టుబడి పెట్టింది. రాత్రి 2 నుండి 6 గంటల మధ్య మార్కెట్‌లో కదలికలు ఉంటే తనను అలర్ట్ చేయాలని ఏజెంట్‌కు సూచనలు ఇచ్చినట్లు తెలిపారు. అమెరికాలో చాలా మంది నిద్రపోయే సమయంలో ప్రపంచంలోని ఇతర దేశాల్లో మార్కెట్ కార్యకలాపాలు జరుగుతుంటాయని, అందుకే ఈ సమయాన్ని ఎంచుకున్నట్లు వెల్లడించారు. ఈ సమాచారం ఆధారంగానే తాను ఏఐ ఏజెంట్ పెట్టుబడి నిర్ణయం తీసుకుంది.

వాదనపై తలెత్తుతున్న సందేహాలు

ఈ వినియోగదారు వాదనపై సోషల్ మీడియాలో సందేహాలు, ప్రశ్నలు మొదలయ్యాయి. చాలా మంది ఆ యూజర్ చెప్పిన విషయాన్ని నమ్మడానికి సిద్ధంగా లేరు. ఇదొక స్కామ్ అని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఏఐ వల్ల మార్కెట్ ట్రేడింగ్ పూర్తిగా మారిపోతుందని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలాగైతే టెక్నాలజీని వాడి ప్రతి ఒక్కరూ ట్రేడింగ్ చేసి లాభాలు పొందుతారని కామెంట్లు వస్తున్నాయి.

Note: ఏది ఏమైనా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి రిస్క్‌తో కూడుకుని ఉంటుంది. ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసే ముందు ఆర్థిక నిపుణులను సంప్రదించడం మంచిది. లేకపోతే మీ డబ్బు పూర్తిగా పోయే ప్రమాదం ఉంది. ఏబీపీ దేశం ఎవరికీ పలానా చోట ఇన్వెస్ట్ మెంట్ చేయాలని సూచించదు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

How To Avoid UPI Fraud:సైబర్‌ వలలో పడకుండా మీ బ్యాంక్ అకౌంట్‌ సేఫ్‌గా ఉండాలా? ఈ UPI టాన్సాక్షన్ సీక్రెట్స్‌ తెలుసుకోండి!
సైబర్‌ వలలో పడకుండా మీ బ్యాంక్ అకౌంట్‌ సేఫ్‌గా ఉండాలా? ఈ UPI టాన్సాక్షన్ సీక్రెట్స్‌ తెలుసుకోండి!
Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
How To Check CIBIL Score In Telugu: పైసా ఖర్చు లేకుండా ఉచితంగా సిబిల్ స్కోర్‌ ఎలా చెక్ చేసుకోవాలి?
పైసా ఖర్చు లేకుండా ఉచితంగా సిబిల్ స్కోర్‌ ఎలా చెక్ చేసుకోవాలి?
Bank Holidays in August: ఆగస్టు 2026లో 14 రోజులు సెలవులు.. బ్యాంక్ పని ఉంటే హాలిడేస్ చెక్ చేసుకోండి
ఆగస్టు 2026లో 14 రోజులు సెలవులు.. బ్యాంక్ పని ఉంటే హాలిడేస్ చెక్ చేసుకోండి

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
PM Modi At Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
YSRCP Leaders Absconding: పరారీలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు - ముస్తఫా, చింతాడ రవికుమార్‌లపై నాన్-బెయిలబుల్ కేసులు!
పరారీలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు - ముస్తఫా, చింతాడ రవికుమార్‌లపై నాన్-బెయిలబుల్ కేసులు!
Godavari River Overflow: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
The Hundred League Hug: భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
PM Modi On CJP Protest: నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
Embed widget