అన్వేషించండి

BRS On Rohit Reddy: మొయినాబాద్ డ్రగ్స్ కేసు- రోహిత్ రెడ్డికి బీఆర్‌ఎస్ షోకాజ్ నోటీసులు.. పార్టీకి దూరంగా ఉండాలని ఆదేశాలు

Moinabad Drugs Case మొయినాబాద్ డ్రగ్స్ కేసులో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ప్రమేయం ఉందని పోలీసులు తెలపడంతో బీఆర్ఎస్ పార్టీ ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

Moinabad farmhouse Case | హైదరాబాద్: మొయినాబాద్‌ లోని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫాంహౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో రోహిత్ రెడ్డి ప్రమేయంపై భారత రాష్ట్ర సమితి (BRS) అధిష్టానం గుర్రుగా ఉంది. నిందితుడిగా ఉండటంతో పాటు డ్రగ్స్ పాజిటివ్ రావడంతో ఆయనపై క్రమశిక్షణా చర్యలు చేపట్టింది. పార్టీ ప్రతిష్ఠకు, విశ్వసనీయతకు భంగం కలిగించేలా వ్యవహరించినందుకు రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లోగా దీనిపై లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని, ఒకవేళ సమాధానం సంతృప్తికరంగా లేకపోతే కఠిన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని పార్టీ స్పష్టం చేసింది. తుది నిర్ణయం వెలువడే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆయనను ఆదేశించింది.

రోహిత్ రెడ్డి ఫాం హౌస్ లో డ్రగ్స్ పార్టీ..

 మొయినాబాద్‌లోని రోహిత్ రెడ్డి ఫాంహౌస్‌పై పోలీసులు శనివారం రాత్రి ఆకస్మిక దాడి చేసినప్పుడు అక్కడ మాదకద్రవ్యాల వినియోగం జరిగినట్లు ఆధారాలు లభించాయి. ఈ పార్టీలో టీడీపీ నేత, ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌, ఢిల్లీకి చెందిన నమిత్ శర్మ వంటి ప్రముఖులు కూడా పాల్గొన్నారు. పోలీసుల సోదాల్లో కొకైన్ వంటి నిషేధిత పదార్థాలతో పాటు ఫారిన్ రివాల్వర్ (.32 క్యాలిబర్) స్వాధీనం చేసుకున్నారు. పార్టీకి హాజరైన వారిలో ఆరుగురికి డ్రగ్స్ పరీక్షల్లో పాజిటివ్ రావడంతో ఈ కేసు మరింత ముదిరింది. నిందితులు తొలుత బుకాయించినప్పటికీ, వైద్య పరీక్షలలో ఎంపీ పుట్టా మహేష్‌తో పాటు రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మ మొత్తం ఆరుగురికి పాజిటివ్ వచ్చిందని ఈగల్ టీం ఎస్పీ గిరిధర్ తెలిపారు. 

మొయినాబాద్ పోలీసులు ఈ కేసును డ్రగ్స్ సరఫరా, ఆయుధాల చట్టం (Arms Act) కింద దర్యాప్తు చేస్తున్నారు. కేవలం ఈ ఒక్క పార్టీయే కాకుండా, గతంలో కూడా ఇలాంటి కార్యకలాపాలు జరిగాయా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితుల ఫోన్ కాల్ డేటా, బ్యాంక్ లావాదేవీలను పరిశీలిస్తున్నారు. రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, సాఫ్ట్ వేర్ ఉద్యోగుల మధ్య ఉన్న ఈ డగ్రస్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది. అధికార కాంగ్రెస్ తో పాటు బీజేపీ నేతల విమర్శలను సీరియస్ గా తీసుకున్న పార్టీ క్రమశిక్షణను కాపాడేందుకు బీఆర్‌ఎస్ నాయకత్వం రోహిత్ రెడ్డిని పక్కన పెడుతూ నిర్ణయం తీసుకుంది.

మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. రిమాండ్ రిపోర్టులో సంచలన నిజాలు

హైదరాబాద్ శివారు మొయినాబాద్ మండలం అజీజ్ నగర్‌లోని ఫామ్‌హౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. పోలీసులు దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టు ప్రకారం, మార్చి 14, 2026 రాత్రి జరిగిన ఈ పార్టీలో నిందితుడు నమిత్ శర్మ పోలీసులపైకే కాల్పులు జరిపారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డికి చెందిన రివాల్వర్‌తో పోలీసులను భయపెట్టి తప్పించుకునేందుకు కాల్పులు జరిపినట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఘటనా స్థలంలో జర్మనీ తయారీ రివాల్వర్, లైవ్ బుల్లెట్, 0.26 గ్రాముల కొకైన్‌తో పాటు రాయల్ సెల్యూట్, చివాస్ రీగల్ వంటి ఖరీదైన విదేశీ మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఏ-1గా నమిత్ శర్మ, ఏ-2 రోహిత్ రెడ్డి సహా మొత్తం 11 మందిపై ఎన్డీపీఎస్ (NDPS), ఆర్మ్స్ యాక్ట్, బీఎన్ఎస్ (BNS) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిందితుల్లో వ్యాపారవేత్తలు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఉండటం గమనార్హం. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Trainee IPS Uday Krishna Reddy Remand: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్ - ఉప్పరపల్లి కోర్టు తీర్పు, చంచల్‌గూడ జైలుకు తరలింపు!
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్ - ఉప్పరపల్లి కోర్టు తీర్పు, చంచల్‌గూడ జైలుకు తరలింపు!
Supreme Court Big Relief Telangana: తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
Adilabad Rains News: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
Lafoot Gang Producer : 2 కోట్ల గోల్డ్ స్కామ్ - టాలీవుడ్ నిర్మాత అరెస్ట్... 14 రోజుల రిమాండ్
2 కోట్ల గోల్డ్ స్కామ్ - టాలీవుడ్ నిర్మాత అరెస్ట్... 14 రోజుల రిమాండ్

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
West Bengal Birbhum Police Raid: బెంగాల్‌లో షాకింగ్ రైడ్ - బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం!
బెంగాల్‌లో షాకింగ్ రైడ్ - బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం!
Tamil Nadu Head Shaving Scam: ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
Ram Charan : ఆస్పత్రి నుంచి రామ్ చరణ్ డిశ్చార్జ్ - ఉపాసనతో కలిసి అయ్యప్ప ఆలయానికి మెగా పవర్ స్టార్
ఆస్పత్రి నుంచి రామ్ చరణ్ డిశ్చార్జ్ - ఉపాసనతో కలిసి అయ్యప్ప ఆలయానికి మెగా పవర్ స్టార్
Maruti Suzuki Victoris EMI calculator: హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్‌ కొనాలి అంటే నెలకు చెల్లించాల్సిన EMI ఎంత?
హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్‌ కొనాలి అంటే నెలకు చెల్లించాల్సిన EMI ఎంత?
Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
Korean Horror Thriller OTT : దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
Embed widget