Ajinkya Rahane Comments on BCCI | బీసీసీఐపై విరుచుకుపడ్డ రహానె
ప్రస్తుతం రంజీ ట్రోఫీ హోరాహోరీగా కొనసాగుతుంది. ముంబై టీమ్ ఛత్తీస్‌గఢ్‌తో రెండో రౌండ్ మ్యాచ్ ఆడుతోంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై 8 వికెట్ల నష్టానికి 406 పరుగులు చేసింది. ముంబై తరపున సీనియర్ బ్యాట్స్‌మన్ అజింక్య రహానె తన 42వ సెంచరీని చేసాడు. ఇబ్బందులో పడ్డ టీమ్ ను తన క్లాస్ ఇన్నింగ్స్ తో బయటకి తీసుకొచ్చాడు రహానే. 21 ఫోర్లతో 159 పరుగులు చేశాడు. అయితే ఈ ఇన్నింగ్స్ తర్వాత మీడియాతో మాట్లాడిన రహానే టీమ్ ఇండియాలో తన ప్లేస్ కు సంబంధించి కామెంట్స్ చేసాడు.
‘సెలక్షన్ కు వయస్సు అడ్డంకి కాకూడదు. ఇది వయస్సు గురించి కాదు, ఉద్దేశ్యం గురించి. ఇది రెడ్ బాల్ పై ఉన్న ప్యాషన్ అండ్ హార్డ్ వర్క్ కి సంబంధించింది. ఏజ్ ఎక్కువ ఉందని ఇగ్నోర్ చేయడంతో నేను ఏకీభవించను. మైఖేల్ హస్సీ 30 ఏళ్ల వయసులో ఆస్ట్రేలియా టీమ్ లో అరంగేట్రం చేసి ఎన్నో పరుగులు చేశాడు. రెడ్-బాల్ క్రికెట్‌లో ఎక్స్పీరియన్స్ ముఖ్యం. ఆస్ట్రేలియాలో టీమ్ ఇండియాకు నా అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. 34-35 తర్వాత ప్లేయర్స్ ను ఓల్డ్ ఏజ్ గా కన్సిడర్ చేస్తారు. కానీ రెడ్-బాల్ క్రికెట్‌పై ఆసక్తి ఉన్న ప్లేయర్స్ కు అవకాశం ఇవ్వాలి. “సెలెక్టర్లు స్టాట్స్ పై కాకుండా ఇంటెన్షన్, ప్యాషన్ పై దృష్టి పెట్టాలి. ఇది ప్రదర్శన గురించి కాదు, కానీ ఒక ప్లేయర్ రెడ్ బాల్ తో ఆడటానికి ఎంత డెడికేటెడ్ గా ఉన్నాడనేది ముఖ్యం” అని రహానె అన్నాడు.





















