అన్వేషించండి

E20 Petrol Mileage: E20 పెట్రోల్‌ వాడితే పాత BS4 కార్లలో 10-12% మైలేజ్‌ డ్రాప్‌ - కారణం ఇదే!

E20 పెట్రోల్‌ వాడినప్పుడు పాత BS4 కార్ల మైలేజ్‌ 10-12% వరకు తగ్గుతున్నట్టు టెస్టులు చెబుతున్నాయి. Maruti Dzire, Hyundai Grand i10, Volkswagen Polo GT TSI కార్లపై చేసిన పరిశీలనలో ఇది స్పష్టమైంది.

BS4 Cars Fuel Efficiency With E20 Petrol: భారతదేశంలో 2025 నాటికి E20 పెట్రోల్‌ను పూర్తిగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కానీ పాత BS4 కార్లు ఈ కొత్త ఇంధనానికి సిద్ధమా?. తాజాగా చేసిన రియల్‌-వరల్డ్‌ టెస్టుల ప్రకారం - పాత BS4 మోడళ్లలో E20 పెట్రోల్‌ వాడితే మైలేజ్‌ తగ్గుదల స్పష్టంగా తెలుస్తోంది.

E20 పెట్రోల్‌ అంటే ఏమిటి?
E20 అనేది 20% ఎథనాల్‌, 80% పెట్రోల్‌ మిశ్రమం. ఎథనాల్‌ పర్యావరణహితమైనప్పటికీ, ప్రతి లీటరుకు 30% తక్కువ ఎనర్జీ ఇస్తుంది. దీంతో, వాహనాల ఫ్యూయల్‌ ఎఫిషియన్సీ సహజంగానే తగ్గుతుంది.

ఏ మోడళ్లపై టెస్ట్‌ చేశారు?
2016 Maruti Suzuki Dzire, 2016 Hyundai Grand i10, 2017 Volkswagen Polo GT TSI మోడళ్లపై E20 పెట్రోల్‌తో మైలేజ్‌ టెస్టులు చేశారు. ఇవన్నీ BS4 స్పెక్‌ ఇంజిన్లు, అంటే E10 ఇంధనానికి మాత్రమే సరిపోయే పాత మోడళ్లు.

టెస్ట్‌ ఫలితాలు

మైలేజ్‌ పరీక్ష ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి:

మారుతి డిజైర్‌: మైలేజ్‌ 12.4% తగ్గింది. సగటున 19.3 km స్పీడ్‌లో - E10 ఇంధనంతో ఈ కారు లీటరుకు 12.65 km మైలేజ్‌ ఇచ్చింది. E20 ఇంధనంతో 11.49 km మైలేజ్‌ ఇచ్చింది. 

హ్యుందాయ్‌ గ్రాండ్‌ i10: మైలేజ్‌ 9.2% తగ్గింది. సగటున 19.3 km స్పీడ్‌లో - E10 ఇంధనంతో ఈ కారు లీటరుకు 11.19 km మైలేజ్‌ ఇచ్చింది. E20 ఇంధనంతో 9.8 km మైలేజ్‌ ఇచ్చింది. 

వోక్స్‌వ్యాగన్‌ పోలో GT TSI: మైలేజ్‌ కేవలం 5.2% తగ్గింది. సగటున 18 km స్పీడ్‌లో - E10 ఇంధనంతో ఈ కారు లీటరుకు 9.63 km మైలేజ్‌ ఇచ్చింది. E20 ఇంధనంతో 9.13 km మైలేజ్‌ ఇచ్చింది. 

వోక్స్‌వ్యాగన్‌ పోలో లో ఉన్న 1.2 లీటర్‌ టర్బో ఇంజిన్‌ అధిక కంప్రెషన్‌ రేషియోతో పని చేయడం వల్ల E20లోనూ కొంత మైలేజ్‌ రికవర్‌ చేయగలిగింది. కానీ డిజైర్‌, i10 వంటి నేచురల్‌ ఆస్పిరేటెడ్‌ ఇంజిన్లు E20కి తగినట్టు ట్యూన్‌ కాలేదు.

ఎందుకు తేడా వస్తుంది?
ఎథనాల్‌ తక్కువ ఎనర్జీ ఇస్తుంది. అయితే అది ఆక్టేన్‌ రేటింగ్‌ను పెంచుతుంది, దీంతో కొన్ని టర్బో ఇంజిన్లు ఇగ్నిషన్‌ టైమింగ్‌ సర్దుబాటు చేసుకుని ఎఫిషియన్సీని కాపాడగలవు. కానీ పాత నేచురల్‌ ఇంజిన్లు అలా చేయలేవు. అందుకే అవి ఎక్కువ ఫ్యూయల్‌ వాడతాయి. డిజైర్‌లో ఉన్న 4-స్పీడ్‌ టార్క్‌ కన్వర్టర్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ మోడల్‌ కూడా మైలేజ్‌ తగ్గడానికి ఇదే ప్రధాన కారణం.

E20 వాడకం వల్ల భవిష్యత్‌ ప్రభావం
పాత BS4, ప్రారంభ BS6 మోడళ్ల యజమానులు E20 వాడితే లాంగ్‌టర్మ్‌లో సీళ్లు, రబ్బరు భాగాలు, ఇంజెక్టర్‌లు డ్యామేజ్‌ అయ్యే అవకాశం ఉంది. కొన్ని కంపెనీలు (ఉదా: మారుతి) అప్‌గ్రేడ్‌ కిట్లు ఇవ్వొచ్చు కానీ అవి కేవలం సేఫ్టీకి మాత్రమే; మైలేజ్‌ డ్రాప్‌ తగ్గించలేవు.

E20 ఇంధనం పర్యావరణానికి మంచిదే కానీ పాత వాహనాల యజమానుల జేబుకు కొంచెం భారమవుతుంది. మైలేజ్‌ తగ్గడం వల్ల రన్నింగ్‌ ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యంగా, కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌ ధర తగ్గించకపోవడంతో ఈ ప్రభావం మరింత బాగా కనిపిస్తుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

మిడిల్ క్లాస్‌ బడ్జెట్‌లోనే లగ్జరీ కార్‌ ఫీచర్లు.. క్రెటా కంటే తక్కువ ధరలో వస్తున్న హ్యుందాయ్ బేయాన్!
మిడిల్‌క్లాస్‌ కోసం ప్రీమియం కారు.. లాంచ్‌కు సిద్ధమైన Hyundai Bayon.. ఈ కారుతో మీరు మాట్లాడవచ్చు!
Royal Enfield Guerrilla 450 - Triumph Tracker 400 మధ్య పోటీ.. ఏ బండి ముందుగా 100 కి.మీ. వేగాన్ని అందుకుంది?
రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 vs ట్రయంఫ్ ట్రాకర్ 400.. వేగంలో ఏది కింగ్? రియల్‌ టెస్ట్‌లో తేలిన నిజాలివే!
పెట్రోల్, డీజిల్‌కు ఇక CNG తోడు.. మహీంద్రా ఎక్స్‌యూవీ 3XOలో సన్‌రూఫ్‌తో కొత్త లుక్‌
Mahindra XUV 3XO తో మరింత మైలేజ్‌.. CNG వేరియంట్‌ వచ్చేస్తోంది.. అక్టోబర్ 15న!
పెద్ద చక్రాలు, కొత్త ఇంజిన్‌.. Aprilia SXR GT 125లో ఇంకా ఏం ఉన్నాయో కొనే ముందే తెలుసుకోండి
సూపర్‌ స్టైలిష్‌ స్కూటర్‌ Aprilia SXR GT 125 మీద ఇంట్రెస్ట్‌ ఉందా?, ఈ 5 విషయాలు మీకు తెలుసా?

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
UP Blue Drum Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన!
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన
Imanvi Esmail: ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
మిడిల్ క్లాస్‌ బడ్జెట్‌లోనే లగ్జరీ కార్‌ ఫీచర్లు.. క్రెటా కంటే తక్కువ ధరలో వస్తున్న హ్యుందాయ్ బేయాన్!
మిడిల్‌క్లాస్‌ కోసం ప్రీమియం కారు.. లాంచ్‌కు సిద్ధమైన Hyundai Bayon.. ఈ కారుతో మీరు మాట్లాడవచ్చు!
 TDP Janasena: కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
 కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
Jailer 2: 'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Embed widget