అన్వేషించండి

ఆఫ్‌రోడ్‌ మాన్‌స్టర్‌కి ఫ్యామిలీ టెస్ట్‌! - 16,000 km డ్రైవ్‌లో 2025 Mahindra Thar Roxx ఎలా ఉంది?

2025 Mahindra Thar Roxx ఆఫ్‌రోడ్‌లో చెలరేగిపోతుందని మనందరికీ తెలుసు. కానీ ఇది ఫ్యామిలీ ట్రిప్‌లో, హైవేపై ఎలా పని చేస్తుందో ఈ 16,000 కి.మీ. రిపోర్ట్‌లో తెలుసుకుందాం.

2025 Mahindra Thar Roxx Customer Experience: మహీంద్రా థార్‌ రాక్స్‌ అనే పేరు వినబడగానే... పవర్‌ఫుల్‌ ఇంజిన్‌తో రఫ్‌ రోడ్లను చీల్చుకుంటూ సాగిపోయే SUV ఇమేజ్‌ మన కళ్ల ముందు నుంచి దూసుకెళ్తుంది. కానీ, ఈ సారి దీనిని కాస్త వేరే యాంగిల్‌లో, ఫ్యామిలీ యూజ్‌ కోసం పరీక్షించారు.

ఆఫ్‌రోడ్‌ లెజెండ్‌ నుంచి హైవే ట్రావెలర్‌ వరకు
ఓ కుటుంబం, ఉత్తర భారతదేశంలో 16,000 కి.మీ. డ్రైవింగ్‌ చేసిన తర్వాత 2025 థార్‌ రాక్స్‌ ఎలా ఉందో వివరాలు వెల్లడించింది. వారు చెప్పిన మాటల్లో మొదటిది - ఇది చాలా రిఫైన్‌గా ఉంది. 2.2 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌ స్మూత్‌గా, పవర్‌ఫుల్‌గా పని చేస్తుంది. కానీ 100 kmph స్పీడ్‌ లిమిట్‌లో డ్రైవ్‌ చేయడం కాస్త చికాకే. తక్కువ థ్రాటిల్‌తో నడపాల్సి రావడం వల్ల డ్రైవర్‌కి చిన్న అసహనం కలుగుతుంది.

మైలేజ్‌ కూడా సగటు స్థాయిలోనే ఉంది, లీటరుకు 11.8 km ఇచ్చింది. ఒక హెవీ 4x4 SUVకి ఇదేమీ చిన్న నంబర్‌ కాదు గానీ, ఫ్యామిలీ SUV దృష్టితో ఆలోచిస్తే కాస్త తక్కువ నంబరే.

వర్షాకాలంలో కొన్ని చిన్న లోపాలు
2025 థార్‌ రాక్స్‌కు వర్షాకాలంలో కొన్ని చిన్న ఇబ్బందులు ఉన్నాయి. వెనుక కెమెరా మీద మట్టి త్వరగా చేరుతోంది. ముందు వీల్‌ ఆర్చ్‌ గ్యాప్‌ వల్ల డోర్ల మీద వరకూ నీరు ఎగసిపడుతోంది. వైపర్లు కూడా పూర్తి క్లియర్‌ విజిబిలిటీ ఇవ్వలేదు, అలాగే నిలువుగా ఉన్న విండ్‌షీల్డ్‌ వల్ల నీరు గాజు మీదనే అంటుకుని ఉంటుంది.

సస్పెన్షన్‌ & కంఫర్ట్‌
సస్పెన్షన్‌ సెటప్‌ హార్డ్‌గా ఉంది. చిన్న బంప్స్‌ దగ్గర బాడీ మోషన్‌ ఎక్కువగా ఉంటుంది, కానీ పెద్ద గుంతలు దాటేటప్పుడు మాత్రం థార్‌ సూపర్‌గా పని చేస్తుంది.

ఇంటీరియర్‌ & మ్యూజిక్‌ సిస్టమ్‌
ఇంటీరియర్‌ క్వాలిటీ చాలా మెరుగ్గా ఉంది. Harman/Kardon సౌండ్‌ సిస్టమ్‌ ఒక హైలైట్‌. ఇది గల్జరీ కార్లలో ఉన్న సిస్టమ్‌లకు సమానమైన ఫీల్‌ ఇస్తుంది.

447 లీటర్ల బూట్‌ స్పేస్‌ కూడా ఫ్యామిలీ ట్రిప్‌కి సరిపోతుంది. ఒక చెక్‌-ఇన్‌ బ్యాగ్‌, మూడు బాక్స్‌లు, ఒక డఫిల్‌ బ్యాగ్‌, బ్యాక్‌ప్యాక్‌, మ్యాట్రెస్‌ అన్నీ సులభంగా పెట్టొచ్చు. అయితే డోర్‌ పాకెట్లు చాలా చిన్నవిగా ఉండటం ఒక మైనస్‌.

16,000 కి.మీ.లో థార్‌ రాక్స్‌ మనకు చూపించింది ఏమిటంటే - ఇది కేవలం ఆఫ్‌రోడ్‌ బీస్ట్‌ కాదు, కొంతవరకు ఫ్యామిలీ SUVగానూ ఉపయోగించవచ్చు. అయితే ప్రతిరోజు సిటీ డ్రైవ్‌కి ఇది ఫస్ట్‌ ఆప్షన్‌ మాత్రం కాదు. ఈ బండి బాడీ మూవ్‌మెంట్‌, వెయిట్‌, స్పీడ్‌ లిమిట్స్‌ కారణంగా సిటీ రైడ్‌లో కాస్త అలసట కలిగిస్తుంది. కానీ మీరు ఆఫ్‌రోడ్‌ ఫ్యాన్‌ అయితే, ఈ SUV ఇచ్చే కూల్‌ ఇమేజ్‌ మిమ్మల్ని ఆకట్టుకుంటుంది.

మొత్తంగా, 2025 Mahindra Thar Roxx “రఫ్‌ అండ్‌ రాయల్‌” అనుభవం ఇస్తుంది, కానీ రోజువారీ SUVగా తీసుకోవాలంటే కాస్త ఆలోచించాలి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
Tata Aeris కొనే ముందే మీకివి తెలియాలి! ఆకట్టుకునే ఫీచర్లు, నిరాశపరిచే అంశాలు
టాటా ఏరిస్ కొనాలా? వద్దా? ప్లస్‌ పాయింట్లతో పాటు మైనస్‌లు కూడా ఉన్నాయి!
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!
లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్‌ SUV.. రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం, రూ.21,000 చాలు

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Elon Musk Targets Mukesh Ambani: అంబానీని మరోసారి టార్గెట్ చేసి ఎలాన్ మస్క్.. స్టార్‌లింక్ ఖరీదైనదైతే భయమెందుకని ప్రశ్నలు.. ఇష్యూపై కేంద్రం క్లారిటీ
అంబానీని మరోసారి టార్గెట్ చేసి ఎలాన్ మస్క్.. స్టార్‌లింక్ ఖరీదైనదైతే భయమెందుకని ప్రశ్నలు
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
Durga Idol Immersion: దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
Hyderabad Crime News: పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
Action Thriller OTT : ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Bollaram Kidnap Case: బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
CM Revanth Reddy On El Nino Crisis: రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
Dussehra Navratri Day 1 : దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
Embed widget