Train Journey: రైలు ప్రయాణంలో ఎవరైనా సహజ మరణం చెందితే ఎంత పరిహారం లభిస్తుంది?
Train Passenger Death Compensation: రైలులో ప్రయాణిస్తున్న వ్యక్తి సహజ మరణం చెందితే అతనికి రైల్వే శాఖ నుంచి పరిహారం అందుతుందా?. ఒకవేళ, రైలు ప్రమాదం వల్ల చనిపోతే ఎంత పరిహారం వస్తుంది?.

Indian Railway Rules For Natural Death Compensation: భారతీయ రైల్వేలు ప్రయాణానికి చాలా అనుకూలంగా ఉంటాయి. దూర ప్రయాణాలు చేయడానికి ఎక్కువ మంది ప్రజల ఫస్ట్ ఛాయిస్ రైలు. రైలులో ప్రజలకు చాలా సౌకర్యాలు లభిస్తాయి.
రైళ్లలో ప్రయాణించే ప్రయాణీకుల కోసం భారతీయ రైల్వే (Indian Railway) కొన్ని నియమాలను రూపొందించింది. ఈ నిబంధనలు ప్రయాణీకుల సౌకర్యార్థం ప్రవేశరపెట్టింది, ఆ రూల్స్ వల్లే ప్రయాణీకులు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని పొందగలుగుతున్నారు. రైలులో ప్రయాణించే వ్యక్తి రైలు వ్యవస్థ కారణంగా నష్టపోతే దానికి రైల్వే విభాగం బాధ్యత వహిస్తుంది, ప్రయాణీకుడికి పరిహారం చెల్లిస్తుంది.
అయితే, రైల్లో ప్రయాణిస్తున్న ప్రయాణీకుడు సహజంగా చనిపోతే, అంటే ఏదైనా జబ్బు లేదా మరేదైనా ఆరోగ్య సమస్య వల్ల చనిపోతే అతని కుటుంబానికి రైల్వే విభాగం నుంచి పరిహారం అందుతుందా? అన్నది చాలా మందికి ఉన్న సందేహం.
సాధారణంగా, ప్రయాణీకుడికి ఆస్తి నష్టం లేదా ప్రాణనష్టం జరిగినప్పుడు రైల్వే శాఖ బాధ్యత వహిస్తుంది. అయితే, అన్ని సందర్భాల్లోనూ కాదు. జరిగిన ఆస్తి నష్టం లేదా ప్రాణనష్టంలో రైల్వే వ్యవస్థ లేదా రైల్వే ఉద్యోగుల నిర్లక్ష్యం ఉన్నప్పుడు మాత్రమే పరిహారం లభిస్తుంది.
ప్రయాణీకుడి సహజ మరణానికి పరిహారం లభిస్తుందా?
ఒక ప్రయాణీకుడు సహజ పరిస్థితుల్లో మరణిస్తే, లేదా తోటి ప్రయాణీకుల పొరపాటు కారణంగా చనిపోతే అటువంటి సందర్భాల్లో రైల్వే విభాగం బాధ్యత వహించదు. కాబట్టి, ఆ తరహా కేసుల్లో రైల్వే నుంచి ఎటువంటి పరిహారం ఆ కుటుంబానికి అందదు.
మరో ఆసక్తికర కథనం: పీఎం కిసాన్ యోజన పేరిట మెసేజ్ - ఆ లింక్ మీద క్లిక్ చేస్తే అంతే సంగతులు!
రైలు ప్రమాదంలో మరణిస్తే రూ.10 లక్షల బీమా
రైలు ప్రయాణీకులు దేశంలోనే అత్యంత చవకైన ప్రమాద & జీవిత బీమా పాలసీని (Cheapest Life And Accidental Insurance Policy) కొనుగోలు చేయవచ్చు. ఈ పాలసీ ధర కేవలం 45 పైసలు మాత్రమే. దీని ద్వారా రూ. 10 లక్షల వరకు బీమా కవరేజ్ పొందవచ్చు.
ఈ బీమా పాలసీని రైలు ప్రయాణీకులు మాత్రమే కొనుగోలు చేయగలరు. రైలు ప్రయాణం కోసం IRCTC వెబ్‌సైట్‌లో టిక్కెట్ బుక్ చేసుకుంటున్నప్పుడు, ఈ పాలసీని కొనే ఆప్షన్ కూడా అక్కడే కనిపిస్తుంది. పాలసీ హోల్డర్ రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు.. రైళ్లు ఢీకొనడం లేదా పట్టాలు తప్పడం లేదా రైలుకు సంబంధించిన ఇతర ప్రమాదాల వల్ల చనిపోయినా, తీవ్రంగా గాయపడినా ఈ బీమా కవరేజ్ వర్తిస్తుంది.
పాలసీదారు రైలు ప్రమాదంలో చనిపోయినా, శాశ్వత అంగవైకల్యం పొందినా అతనికి/అతని కుటుంబానికి రూ.10 లక్షలు అందుతుంది. తాత్కాలిక వైకల్యానికి రూ.7.50 లక్షలు; స్వల్ప గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందితే రూ.2 లక్షల వరకు బీమా కవర్ ఉంటుంది.
ఈ పాలసీ రైలులో ప్రయాణ కాలానికి మాత్రమే వర్తిస్తుంది. అంటే, పాలసీహోల్డర్ రైలు ఎక్కిన మరుక్షణంలో ప్రారంభమై, అతను రైలు దిగిన తక్షణం రద్దు అవుతుంది. ఇది ఆటోమేటిక్‌గా జరుగుతుంది.
మరో ఆసక్తికర కథనం: మీ క్రెడిట్ కార్డ్‌ను ఇలా వాడండి - ఈ ప్రయోజనాలన్నీ సొంతం చేసుకోండి!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

