అన్వేషించండి

Multibagger Stock: 1 లక్ష రూపాయల్ని 3.50 కోట్లుగా మార్చిన మల్టీబ్యాగర్ స్టాక్.. ప్రస్తుత పరిస్థితి ఏంటీ?

Multibagger Stock India |పెట్టుబడిదారులు నిరంతరం మల్టీ బ్యాగర్ స్టాక్స్ కోసం ప్రయత్నిస్తుంటారు. మార్కెట్ రిస్క్ మధ్య, ఎంపిక చేసిన కొన్ని స్టాక్స్ పెట్టుబడిదారులకు అద్భుతమైన లాభాలను అందించాయి.

City Pulse Multiventures multibagger stock | పెట్టుబడిదారులు తమకు మల్టీబ్యాగర్ రిటర్న్స్‌ను అందించే స్టాక్స్ కోసం సెర్చ్ చేస్తుంటారు. కొత్తగా స్టాక్ మార్కెట్లోకి వచ్చేవాళ్లు సైతం తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాల కోసం ప్రయత్నాలు మొదలుపెడతారు.  మార్కెట్‌లో పెట్టుబడులు రిస్కులకు లోబడి ఉంటాయి. అయితే కొన్ని ఎంపిక చేసిన షేర్లు తమ ఇన్వెస్టర్లకు అద్భుతమైన లాభాలను ఆర్జించే అవకాశాన్ని ఇస్తాయి. అటువంటి షేర్లలో City Pulse Multiventures Ltd ఒకటి. గత కొన్నేళ్లలో ఈ కంపెనీ అనేక రెట్లు రాబడిని ఇచ్చి పెట్టుబడిదారులకు షాకిచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం...

1 లక్ష పెట్టుబడి ఏకంగా 3.50 కోట్లు అయింది
గత కొన్నేళ్లలో City Pulse Multiventures Ltd కంపెనీ షేర్లు ఇన్వెస్టర్లకు అద్భుతమైన రిటర్న్స్‌ను అందించాయి. ఏప్రిల్ 2021లో దీని ధర సుమారు రూ. 8 గా ఉంది. ఒకవేళ ఆ సమయంలో ఎవరైనా 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్ పెట్టి ఉంటే, ఆ మొత్తం సుమారు 3.50 కోట్ల రూపాయలకు చేరువైంది. ఫిబ్రవరి 2026 చివరి వారంలో ఈ షేర్ 2,887 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. ఈ మధ్య కాలంలో షేర్లు సుమారు 31,900 శాతం లాభాలు అందించాయి. అందుకే ఈ కంపెనీ షేర్‌ను మల్టీబ్యాగర్ అని చెప్పవచ్చు. స్టాక్ మార్కెట్లో దీర్ఘకాలం పాటు కొనసాగిన ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ రిటర్న్స్ లభించాయి.

షేర్ మార్కెట్లో కంపెనీ పనితీరు

బీఎస్ఈ (BSE)లో గత వారం రోజుల్లో రూ.388 పెరిగిన సిటీ పల్స్ మల్టీవెంచర్స్ స్టాక్ సోమవారం మార్చి 2న సైతం పతనమైంది. రూ.29.55 తగ్గి రూ.2853.50 వద్ద ముగిసింది. ఉదయం 2945తో ఓపెన్ అయిన స్టాక్ తరువాత ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా షేర్ విలువ పడిపోయింది. బీఎస్ఈ (BSE) లో శుక్రవారం, ఫిబ్రవరి 27న కంపెనీ షేర్లు పడిపోయాయి. కంపెనీ షేర్ 0.86 శాతం లేదా 24.90 రూపాయల తగ్గుదలతో 2883.05 రూపాయల వద్ద ముగిసింది. ఆ రోజు ఇంట్రాడే గరిష్ఠం (High) 2907.95 రూపాయలుగా నమోదైంది.

కంపెనీ షేర్ల 52 వారాల గరిష్ఠ స్థాయిని గమనిస్తే, ఈ కాలంలో షేర్లు 3,289.95 రూపాయల మార్కును తాకాయి. అదేవిధంగా, 52 వారాల కనిష్ఠ స్థాయి 1080 రూపాయలు. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.3074.49 కోట్లుగా ఉంది. గత కొన్నేళ్లుగా ఇలాంటి చాలా స్టాక్స్ మల్టీ బ్యాగర్‌గా మారిన 1 లక్ష రూపాయల కోటి రూపాయలుగా చేశాయి. కానీ వాటికి సంబంధించి పూర్తి అవగాహన లేకపోతే నష్టాలు సైతం అదే స్థాయిలో వస్తాయి.

కంపెనీ ఏం చేస్తుంది?
ఈ కంపెనీ 2000 లో ప్రారంభమైంది. ఇది ప్రధానంగా ఎంటర్టైన్మెంట్ రంగానికి సంబంధించి పనిచేస్తుంది. కంపెనీ సినిమాల డిస్ట్రిబ్యూషన్, మల్టీప్లెక్స్ నిర్వహణ, థియేటర్లలో ఆహార, పానీయాల సరఫరా వంటి పనులు చేస్తుంది. ఇది కాకుండా WOWPLEX పేరుతో ఓటీటీ (OTT) ప్లాట్‌ఫామ్‌ రన్ చేస్తోంది. 

Note: (ఇక్కడ అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. మార్కెట్లో పెట్టుబడులు రిస్క్‌కు లోబడి ఉంటాయని గమనించాలి. ఇన్వెస్టర్‌గా డబ్బు పెట్టే ముందు ఎల్లప్పుడూ ఆర్థిక నిపుణుల సలహా తీసుకోండి. పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం ఎవరికీ ఎప్పుడూ సలహా ఇవ్వదు.)

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Air India New CEO: ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
EPFO Latest News: 20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
Loan Trap: చదువుకు 4 లక్షలు, పెళ్లికి 10 లక్షలు.. అప్పుల ఊబితో తప్పని చిక్కులు- పరిష్కార మార్గాలివే
చదువుకు 4 లక్షలు, పెళ్లికి 10 లక్షలు.. Loan Trapతో తప్పని చిక్కులు- పరిష్కార మార్గాలివే

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Embed widget