By: Arun Kumar Veera | Updated at : 21 Jan 2025 04:23 PM (IST)
PM కిసాన్ 19వ విడత వివరాలు ( Image Source : Other )
PM Kisan Yojana 19th Instalment Date: భారతదేశ వ్యాప్తంగా రైతులు 'ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన' (PM Kisan Samman Nidhi Scheme) 19వ విడత డబ్బులు ఎప్పుడు బ్యాంక్ ఖాతాలో పడతాయా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. పీఎం కిసాన్ యోజన 19వ విడత డబ్బుల్ని వచ్చే నెలలో అంటే ఫిబ్రవరిలో విడుదల చేయడానికి షెడ్యూల్ చేశారు. భారత ప్రభుత్వం, అర్హత కలిగిన లబ్ధిదారు రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా రూ. 2,000 జమ అవుతుంది.
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఏడాదికి మొత్తం ఆర్థిక సహాయం రూ. 6,000 లభిస్తుంది. దీనిని మూడు విడతలుగా, ఒక్కో విడతలో రూ.2,000 చొప్పున పంపిణీ చేస్తున్నారు.
PM కిసాన్ పథకం ఎందుకు?
చిన్న & సన్నకారు రైతులకు ఆర్థిక స్థిరత్వాన్ని అందించడం, దేశ వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరచడం, రైతుల జీవనోపాధికి భద్రత కల్పిచడంలో సాధ్యమైనంత సాయం చేయడం PM కిసాన్ పథకం లక్ష్యం. 2019 ఫిబ్రవరిలో ప్రారంభించినప్పటి నుంచి, ఈ పథకం భారతదేశం అంతటా వ్యవసాయ రంగ అభివృద్ధికి గణనీయంగా తోడ్పడింది.
PM కిసాన్ 19వ విడత వివరాలు (PM Kisan 19th Installment Key Details)
ఈ పథకం కింద, దేశవ్యాప్తంగా 9.5 కోట్ల మందికి పైగా రైతులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.
19వ విడత నగదు ఫిబ్రవరి 2025లో విడుదల అవుతుందని భావిస్తున్నారు.
అర్హత గల ప్రతి లబ్ధిదారు రైతుకు రూ. 2,000 అందుతుంది.
భారత ప్రభుత్వం ఈ విడత కోసం రూ. 20,000 కోట్లకు పైగా కేటాయించింది.
19వ విడత నగదు స్వీకరణలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చూసుకోవడానికి, లబ్ధిదారులు తమ eKYC ధృవీకరణను ఆన్‌లైన్‌లో లేదా సాధారణ సేవా కేంద్రాలలో (CSCలు) పూర్తి చేయాలి. రైతులు ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (direct benefit transfers) కోసం వారి ఆధార్ నంబర్‌ను బ్యాంకు ఖాతాతో లింక్ చేయడంతో పాటు వివరాలను కూడా అప్‌డేట్ చేయాలి.
లబ్ధిదారుల జాబితాలో పేరు ఉందో, లేదో ఎలా తనిఖీ చేయాలి? (How To Check The PM Kisan Beneficiary List?)
మీ అర్హత & చెల్లింపు స్థితిని తనిఖీ చేయడానికి, అధికారిక పీఎం కిసాన్ పోర్టల్‌లో ఈ స్టెప్స్ అనుసరించండి:
అధికారిక పీఎం కిసాన్ వెబ్‌సైట్‌ను సందర్శించండి.
హోమ్‌పేజీలోని 'Farmers Corner' విభాగంపై క్లిక్ చేయండి.
'Know Your Status' ఎంచుకోండి.
మీ రిజిస్ట్రేషన్ నంబర్, క్యాప్చా కోడ్‌ను నమోదు చేయండి.
'Get OTP' మీద క్లిక్ చేసి, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని నమోదు చేయండి.
మీ పేమెంట్ డిటైల్స్ స్క్రీన్ మీద కనిపిస్తాయి.
ఒకవేళ మీరు ఇప్పటికీ eKYC పూర్తి చేయకపోతే, ఇప్పటికీ సమయం మించిపోలేదు, తక్షణం ఆ పని పూర్తి చేయండి. 19వ విడత డబ్బులు ఫిబ్రవరిలో, 20వ విడత డబ్బులు జూన్ నెలలో విడుదలవుతాయని అంచనా వేస్తున్నారు.
మరో ఆసక్తికర కథనం: రెండేళ్లలోనే లక్షాధికారులను చేసే స్కీమ్, FD కంటే ఎక్కువ రాబడి - మహిళలకు మాత్రమే
RBI Key Decisions: జీరో బ్యాలెన్స్ బ్యాంకు ఖాతాదారులకు గుడ్‌న్యూస్, పలు ఛార్జీలు ఎత్తివేస్తూ నిర్ణయం
IndiGo Flight Crisis : ఈ తేదీ వరకు ఇండిగో టికెట్ రద్దు చేస్తే పూర్తి రీఫండ్! పూర్తి వివరాలు తెలుసుకోండి!
Airtel Recharge Plan: ఎయిర్టెల్ వినియోగదారులకు బిగ్ షాక్ ! రెండు చౌకైన రీఛార్జ్ ప్లాన్‌లను సైలెంట్‌గా క్లోజ్!
Gold Price: బంగారం ధర 15నుంచి 30 శాతం వరకు పెరిగే ఛాన్స్! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం వెల్లడి!
RBI Repo Rate:రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన RBI, తగ్గనున్న EMIలు
Goa Fire Accident: గోవా నైట్ క్లబ్‌లో విషాదం.. సిలిండర్ పేలుడుతో 25 మంది మృతి- విచారణకు ఆదేశించిన సీఎం
Tirupati Crime News: విద్యార్థినిపై ప్రొఫెసర్ లైంగిక దాడి, గర్భం దాల్చిన బాధితురాలు.. తిరుపతిలో దారుణం
Virat Kohli Records: సచిన్ ఆల్ టైమ్ రికార్డును బద్దలుకొట్టిన విరాట్ కోహ్లీ.. ప్రపంచంలో నెంబర్ 1 బ్యాటర్
Sonarika Bhadoria : పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ హీరోయిన్ - కపుల్‌కు వెల్లువెత్తుతున్న విషెష్