అన్వేషించండి

Mahakumbh 2025: ఒక్క రోజు కుంభమేళా..ఇది కదా ప్లాన్ అంటే - ఇది ఫాలో అయితే ప్రమాదకర ఘటనలకు ఛాన్సే ఉండదు!

కుంభమేళాకి భారీగా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం లేదు..ఒక్కరోజు చాలు..మీరు కూడా ఒక్క రోజు కుంభమేళాకు హాజరవ్వాలి అనుకుంటే లా ప్లాన్ చేసుకోండి

Mahakumbh 2025: సింగిల్ గా అయినా, స్నేహితులతో అయినా కుంభమేళాకు ఒక్కరోజు ప్లాన్ చేసుకుంటే చాలు. మూడు రోజులు, నాలుగు రోజులు  అంటూ అంత రద్దీలో ఇబ్బందిపడేకన్నా ఒక్కరోజు ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. కుంభమేళాకి హాజరవడం వెనుకున్న అసలైన ఉద్దేశం  త్రివేణి సంగమంలో స్నానం ఆచరించడంమే. అందుకే వెళ్లామా..పుణ్యస్నానం ఆచరించామా..వెంటనే బయలుదేరి వచ్చేశామా అన్నట్టుండాలి ప్లాన్. అందరూ ఇలా ప్లాన్ చేసుకుంటే ఎంత రద్దీ అయినా కానీ ఎలాంటి ప్రమాదాలు, తొక్కిసలాటలు జరగకుండా ఉండేందుకు మీవంతు మీరు ప్రయత్నం చేస్తున్నట్టే.  

Also Read: తీర్ధ, ఆనంద, హంస.. సన్యాసులకు, అఘోరాలకు ఈ పేర్లు ఎవరిస్తారు? దశనామి సంప్రదాయం అంటే ఏమిటి?

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా ప్రారంభమైన తర్వాత రోజురోజుకీ భక్తుల రద్దీ  పెరుగుతోంది. లెక్కలేనంత మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. మహాకుంభస్నానం చేసేందుకు స్వదేశీయులే కాకుండా విదేశీ భక్తులు కూడా తరలివస్తున్నారు. ఇలాంటి  పరిస్థితిలో పుణ్యస్నానాలు ఆచరించే ప్రదేశం మొత్తం జాతరను తలపిస్తోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే మహాకుంభమేళాలో ఏర్పాట్లు,భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నీ మీడియాలో ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నారు. అందుకే వన్ డే ట్రిప్ ప్లాన్ చేసుకుంటే ప్రయాణం సులభంగా ఉండడమే కాదు..మిగిలిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీవంతు సహకారం అందినట్టవుతుంది.

సింగిల్ డే కుంభమేళాకి వచ్చేవారు ముఖ్యంగా ఈ జాగ్రత్తలు తీసుకోండి

Also Read: ఫిబ్రవరి 26 or 27.. మహా శివరాత్రి ఎప్పుడు - మిగిలిన దేవుళ్ల కన్నా శివుడు ఎందుకు ప్రత్యేకం!

మీకు అత్యవసరం అయిన వస్తువులను మాత్రమే తీసుకెళ్లాలని గుర్తుంచుకోండి. ఘాట్‌ వద్దకు వాహనాలు తీసుకెళ్లే సౌకర్యం లేదు అందుకే మోసుకెళ్లే వస్తులను తగ్గించుకోండి. ఒంటరిగా వెళ్లాల్సి వస్తే మీ సామాన్లతో చాలా దూరం నడవాల్సి వస్తుంది..నదిలో స్నానానికి దిగేటప్పుడు వాటిని జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది. ప్రయాగరాజ్ కు వెళ్లిన చాలామంది భక్తుల సమాన్లు మిస్సయ్యాయి. కుంభమేళాకి వెళ్లి స్నానం ఆచరించిన వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్లాన్ చేసుకోండి. కుంభమేళాలో టెంట్ సౌకర్యం ఉంది కానీ అది చాలా ఖరీదైనది. ఇక టెంట్ ఖరీదైనది అంటే ఇక హోటళ్లు కూడా ఎంత ఖరీదైనవి అవుతాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అందుకే ఉదయాన్నే అక్కడకు చేరుకుని తిరిగి ఈవెనింగ్ అక్కడి నుంచి మూవ్ అవడం మంచిది. తప్పనిపరిస్థితుల్లో కుంభమేళాలో నైట్ స్టే చేయాల్సి వస్తే.. మీతో పాటు శాలువా , షీట్లు ఉండేలా చూసుకోండి. నిద్రపోయేందుకు స్థలం దొరకనప్పుడు ఏదో మూలన మీ శాలువా మీరు కప్పుకుని పడుకోవచ్చు. లేదు హోటల్ కి వెళ్లాల్సిందే అనుకుంటే మాత్రం..ప్రయాగరాజ్ నుంచి కొంచెం దూరం వచ్చి ట్రై చేస్తే బటర్.  

జనవరి 13 భోగిరోజు  ప్రారంభమైన మహా కుంభమేళా ఫిబ్రవరి 26 మహాశివరాత్రి వరకూ కొనసాగుతుంది.. 

Also Read: జ్యోతిర్లింగాలను ఒకే ట్రిప్​లో ఎలా కవర్​ చేయొచ్చో తెలుసా? హైదరాబాద్​ నుంచి ఇలా స్టార్ట్ అయిపోండి

 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

03-08-2026 సోమవారం మీ రాశిఫలాలు!
03-08-2026 సోమవారం మీ రాశిఫలాలు!
మీన రాశి ఆగస్టు 2-8 వారఫలాలు: ప్రేమ, కెరీర్, ఆర్థిక విజయాలు మీ సొంతం!
మీన రాశి ఆగస్టు 2-8 వారఫలాలు: ప్రేమ, కెరీర్, ఆర్థిక విజయాలు మీ సొంతం!
కుంభ రాశి ఆగస్టు 2-8 వారఫలాలు: అద్భుత అవకాశాలు, ఆర్థిక వృద్ధి
కుంభ రాశి ఆగస్టు 2-8 వారఫలాలు: అద్భుత అవకాశాలు, ఆర్థిక వృద్ధి
మకర రాశి: ఆగస్టు 2-8 వారం - మీ జీవితంలో స్థిరత్వం, ఎదుగుదలకు ఇదే సమయం!
మకర రాశి: ఆగస్టు 2-8 వారం - మీ జీవితంలో స్థిరత్వం, ఎదుగుదలకు ఇదే సమయం!

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Secret Soldier : చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
Embed widget