జనవరి 20 న శబరిమల ఆలయం క్లోజ్!
శబరిమల ఆలయం మండల మకరవిళక్కు తీర్థయాత్రను జనవరి 20న ముగిస్తుంది
అయ్యప్ప భక్తులు జనవరి 19 ఆదివారం వరకూ స్వామిని దర్శించుకోవచ్చు
జనవరి 19 సాయంత్రం మణిమండపం ముందు నిర్వహించే గురుతి కార్యక్రమంతో సీజన్ ముగుస్తుంది
జనవరి 20న కేవలం పందళం రాజ వంశస్థులు మాత్రమే అయ్యప్ప దర్శనం పొందుతారు
ఉదయం ఐదున్నర గంటలకు గణపతి హోమ నిర్వహిస్తారు..
గణపతి హోమం తర్వాత తిరువాభరణ తిరువనం ప్రారంభమవుతుంది
రాజప్రతినిధి దర్శనం తర్వాత ప్రధాన అర్చకులు అయ్యప్ప విగ్రహానికి విభూతి అభిషేకం నిర్వహిస్తారు
అభిషేకం తర్వాత హరివరాసనం మంత్రోచ్ఛారణతో ఆలయాన్ని మూసివేస్తారు