ప్రయాగ్‌రాజ్‌లో జరిగే మహాకుంభమేళాకు దేశ విదేశాల నుంచి భక్తులు వస్తున్నారు.



దాదాపు 144 సంవత్సరాల తర్వాత జరిగే మహా కుంభమేళా దివ్యమైనది భక్తుల విశ్వాసం.



కోట్ల మంది భక్తులు పవిత్రమైన గంగా, యమునా, సరస్వతీ త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరిస్తున్నారు.



భక్తుల సౌకర్యార్థం అధికార యంత్రాంగం వినూత్నమైన ఏర్పాట్లు చేసింది.



ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అధికారులు వినియోగించుకుంటున్నారు.



మహాకుంభ్ డిజిటల్ AI ఆధారిత 'ఖోయా పాయా సెంటర్' ఆకట్టుకుంటోంది



భారీ రద్దీలో ప్రజలు తప్పిపోయే ప్రమాదం ఉండనే ఉంటుంది



అలా తప్పిపోయిన వారి ఆచూకి సులభంగా గుర్తించేందుకే AI ఆధారిత కంప్యూటరైజ్డ్ లాస్ట్ అండ్ ఫౌండ్ సెంటర్లు



సహాయం కోసం భక్తులకు కావాల్సిన వీడియోలు చూపించి బంధువుల ఆచూకీ కనుగొంటున్న సిబ్బంది



ఒక వేళ వెంటనే ఆచూకి లభించకపోతే దొరికినప్పుడు సొంత ఖర్చులలతో ఇంటికి చేర్చనున్న అధికారులు



ఇలాంటి వారికి ఫుడ్‌, బెడ్‌, ఇత అన్ని వసతులు కల్పిస్తారు. కౌన్సిలింగ్ కూడా ఇస్తారు.



తప్పిపోయిన చిన్నారుల కోసం ప్రత్యేకంగా ప్లేజోన్‌లు కూడా ఏర్పాటు చేశారు.



ఏరియా సెక్టార్ల వారీగా లాస్ట్ అండ్ ఫౌండ్ సెంటర్లు ఏర్పాటు చేశారు.



వృద్ధులు, చిన్నారుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు అధికారులు



ఇప్పటి వరకు తప్పిపోయిన వారు దొరకని పరిస్థితి లేదంటున్నారు పోలీసులు