దేవతల సంఖ్య 3 కోట్లా - 33 కోట్లా..ఈ లెక్కేంటి!
ముక్కోటి దేవతలు అంటుంటారు కదా..ఇంతకీ దేవతల సంఖ్య ఎంత?
మూడు కోట్ల మంది దేవతలు అని కొందరు..33 కోట్ల మంది దేవతలు అని మరికొందరు అంటారు..
వాస్తవానికి కోటి అనేది పురాణాల్లో ఉన్న వివరాలు ప్రకారం సంఖ్యాశాస్త్ర సంకేతం కాదు
ఏకాదశ రుద్రులు (11), ద్వాదశ ఆదిత్యులు (12), అష్ట వసువులు (8), ఇద్దరు అశ్వినీ దేవతలు..మొత్తం 33 మంది అంటోంది వేదం
సంస్కృతంలో ‘కోటి’ అంటే ‘విధము’, ‘వర్గము’ అనే అర్థాలున్నాయి.. ఉచ్ఛకోటి అంటే ఉచ్ఛమైన వర్గానికి చెందినవారని అర్థం
యజుర్వేద, అథర్వణ వేదాలు దేవతల వర్గాలను 33 గా పేర్కొన్నాయి. వీరినే త్రయ త్రింశతి కోటి (33 కోటి) దేవతలు అంటారు
వేదంలో పేర్కొన్న ప్రకారం సృష్టిక్రమంలో అన్నింటికీ వీరే బాధ్యులు..అందుకే ‘ముక్కోటి దేవతలు’ అని పురాణాలు వర్ణించాయి
వీళ్లంతా ఒక్కటై శ్రీ మహావిష్ణువును సేవించేందుకు భూలోకానికి తరలివచ్చే రోజే వైకుంఠ ఏకాదశి..అదే ధనుర్మాస ఏకాదశి
ఈ ముక్కోటి దేవతలతో విష్ణువు భూలోకానికి తరలివచ్చే రోజే ముక్కోటి ఏకాదశి అయింది