వైకుంఠ ఏకాదశి విశిష్టత, పాటించాల్సిన నియమాలు! సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించే ముందు వచ్చే శుక్లపక్ష ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా జరుపుకుంటారు శ్రీ మహావిష్ణువు మూడుకోట్లమంది దేవతలతో కలసి భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు అందుకే ముక్కోటి ఏకాదశి అంటారు ఈ రోజు ఉత్తరద్వార దర్శనం ద్వారా స్వామిని దర్శించుకుంటే సకల శుభాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం ఆలయాలకు వెళ్లలేనివారు..ఇంట్లోనే బ్రహ్మ ముహూర్తంలో శ్రీ లక్ష్మీనారాయణుడిని పూజించి విష్ణుసహస్రం పారాయణం చేయాలి ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం చేస్తే 24 ఏకాదశులు ఉపవాసం చేసినంత ఫలితం లభిస్తుందని శాస్త్రవచనం అనారోగ్య సమస్యలతో ఉండేవారు పాలు, పండ్లు తీసుకుని ఉపవాసం చేయొచ్చు.. దశమి రోజు నుంచి నియమాలు పాటించి..ఏకాదశి ఉపవాసం చేసి..ద్వాదశి ఘడియలు పూర్తికాకముందే భోజనం చేయాలి ఏకాదశి రోజు ఉపవాసంతో పాటూ జాగరణ చేస్తే ఇంకా మంచింది.. ఈ సమయంలో భగవంతుడిని కీర్తించాలి ఏకాదశి అంటే 11..5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనసును అందుపులో ఉంచుకోవడమే ఉపవాసం ఆంతర్యం జాగారం అంటే ప్రాపంచిక విషయాలు పక్కనపెట్టి విష్ణు సేవలో మునిగితేలడం..