చాణక్య నీతి: జీవితంలో ఈ రెండే ఎక్కువ ముఖ్యం! ప్రతి ఒక్కరి జీవితంలో విద్య, ఆరోగ్యం, వ్యాపారం, వైవాహిక జీవితం ,సంపద ఇవన్నీ ముఖ్యమైనవని చెప్పారు ఆచార్య చాణక్యుడు వీటిలో సంపద, ఆరోగ్యం ఈ రెండూ అత్యంత ముఖ్యమైనవని నీతిశాస్త్రంలో ప్రస్తావించారు చాణక్యుడు..ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో అతి పెద్ద ఆస్తి అంటే ఆరోగ్యమే..ఆరోగ్యంగా ఉండే వ్యక్తి తన జీవితంలో వచ్చే పెద్ద కష్టాన్ని అయినా ఎదుర్కొంటాడు మీరు తీసుకునే ఆహారంపైనే ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అందుకే సమయానికి మంచి ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది ఆహారం తిన్న వెంటనే ఎక్కువ నీరు తాగడం అంటే అది విషం తీసుకోవడంతో సమానం అని ప్రస్తావించారు చాణక్యుడు శరీరం శుభ్రంగా ఉండేందుకు నిత్యం స్నానం చేసినట్టే..మానసిక ఆరోగ్యం కోసం ధ్యానం, యోగా కూడా అవసరం అదే సమయంలో సంపద కూడా జీవితంలో ముఖ్యమైన భాగం..ఎంత కష్టం నుంచి అయినా బయటపడేసి డబ్బే.. జీవితంలో మంచి, చెడు ఈ రెండు సమయాల్లోనూ డబ్బు అవసరం ఉంటుంది..అందుకే జాగ్రత్తగా ఖర్చుచేయాలి