చాణక్య నీతి: ఇలాంటి వాళ్లు నరకంలో ఉండే ఆత్మలతో సమానం!

అత్యస్తలేవః కటుతా చ వాణీ దరిద్రతా చ స్వజనేషు వైరమ్
నీచ ప్రసంగః కులహీనసేనా చిహ్నాని దేహే నరకస్థితానామ్

కొన్ని లక్షణాలుంటే వ్యక్తులతో స్నేహం చేస్తే నరకానికి మార్గం వేసుకున్నట్టే అని ఈ శ్లోకం ద్వారా చెప్పారు ఆచార్య చాణక్యుడు

అపకారం, నీచమపు పనులు చేసే వ్యక్తులు, చిన్న విషయానికే ఎక్కువ కోపం ప్రదర్శించేవారితో సవహాసం తగదు

కఠినమైన మాటలు మాట్లాడేవారు, మంచి వ్యక్తులకో తగాదాకు దిగేవారు, నీచులతో స్నేహంగా ఉండేవారితో స్నేహం వద్దు

కులహీనులకు సేవ చేసేవారికి కూడా దూరంగా ఉండడం మంచిదని చాణక్యుడు చెప్పారు

ఈ లక్షణాలన్నీ నరకంలో ఉండే ఆత్మలకు ఉంటాయి..అందుకే వీరికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని బోధించారు

ఈ లక్షణాలు ఉండేవారు ఎప్పుడూ దారిద్ర్యాన్ని అనుభవిస్తారు..వీరితో ఉంటే అది మీకు అంటుకుంటుంది

పైగా ఇలాంటి పనులు చేసేవారికోసం నరక ద్వారాలు తెరిచి ఉంటాయిని చాణక్యుడు ఈ శ్లోకం ద్వారా వివరించారు