చాణక్య నీతి: వీళ్లకి సలహాలు ఇవ్వకండి చాణక్యడు బోధించిన విషయాలు సక్సెస్ కి చేరువచేస్తాయి. అందుకే తరాలు గడిచినా ఆచరణీయం అంటారు పెద్దలు ఓ వ్యక్తి సంతృప్తికరమైన, విజయవంతమైన జీవితాన్ని ఎలా గడపాలో, ఎలా ఉండాలో , ఎలా ఉండకూడదో బోధించారు చాణక్యుడు మీరెంత గొప్ప స్థాయిలో ఉన్నాకానీ..ఎదుటివారికి అత్యవసం అయినా మీరు సలహా ఇవ్వకూడదని వ్యక్తులు కొందరున్నారు ఇందులో చాణక్యుడు ముఖ్యంగా ప్రస్తావించిన విషయం నైతికత.. నైతికత లేని వ్యక్తులకు సలహా ఇవ్వడం అస్సలు సరికాదు నైతికత లేనివ్యక్తులకు సలహా ఇస్తే వారు వినకపోగా మీకు శత్రువులుగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు మీ మాటకు గౌరవం ఇచ్చేవారికి సలహా ఇవ్వండి కానీ..మూర్ఖంగా వాదించేవారికి ఎప్పుడూ సలహా ఇవ్వొద్దు తప్పుడు ఆలోచనతో ఉండేవారికి సలహా ఇస్తే మిమ్మల్ని తప్పుగా, శత్రువుగా చూస్తారు కానీ ఎలాంటి ఉపయోగం ఉండదు అత్యాశ ఉన్న వారికి సలహా ఇస్తే వారు ప్రతీదీ డబ్బుతో కొలుస్తారు..దురాశతో వ్యవహరిస్తారు మిమ్మల్ని అనుమానించే వ్యక్తులకు సలహా ఇస్తే వారు పాటించకపోగా మిమ్మల్ని తిరిగి అవమానించే అవకాశం ఉంది