చాణక్య నీతి: మీరు బెస్ట్ ఫ్రెండ్స్ అనుకున్నవాళ్లు మీతో ఇలాగే ఉన్నారా!

ఆచార్య చాణక్యుడు అప్పటి పరిస్థితుల ఆధారంగా చాలా విషయాలు శిష్యులకు బోధించారు.. తన నీతిశాస్త్రంలో పొందుపరిచారు

కుటుంబం, బంధం, ప్రేమ, స్నేహం, వృత్తి, ఉద్యోగం..ఇలా ప్రతి విషయంలోనూ ది బెస్ట్ ఎలా ఉండాలో నీతిశాస్త్రంలో ప్రస్తావించారు

సాధారణంగా బెస్ట్ ఫ్రెండ్ అంటుంటారు కదా.. మరి బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎలా ఉంటారో, ఎలా ఉండాలో తెలుసా..

ఎవరినైనా బెస్ట్ ఫ్రెండ్ అనుకోవాలి అంటే వారు.. ఈ 6 సందర్భాల్లో మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్లలేరని స్పష్టం చేశారు చాణక్యుడు

మొదటి సందర్భం: మీకు ఏ చిన్న అవసరం వచ్చినా అది నెరవేరేవరకూ మీతోనే ఉంటారు

రెండో సందర్భం: ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మీరు పూర్తిగా కోలుకునేవారకూ అనుక్షణం మీకోసమే అన్నట్టుంటారు

మూడో సందర్భం: ఆర్థిక ఇబ్బందులు అయినా, వ్యక్తిగత సమస్యలు అయినా వాటిని తమవిగా భావించి అండగా నిల్చుంటారు

నాలుగో సందర్భం: మీరు ఎవరితోనైనా వివాదంలో చిక్కుకున్నప్పుడు ఆ సమయంలో మిమ్మల్ని సపోర్ట్ చేసి వారిని ఎదిరిస్తారు

ఐదో సందర్భం: జీవితంలో ఉన్నతికి సంబంధించి ఎవరినైనా పెద్దలను కలిసేటప్పుడు వెన్నంటే ఉండి ధైర్యం చెప్పి పంపిస్తారు

ఆరో సందర్భం: స్మశానానికి వెళ్లాల్సి వచ్చిన సందర్భం మీకు ఎదురైనప్పుడు మీతోనే ఉంటారు...