శని ఉన్నచోటే ఐశ్వర్యం .. భయం వద్దు స్మరించండి!
నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం
ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం
నీలాంజనం - నల్లటి కాటుక రూపంలో ఉండేవాడు
రవిపుత్రం - సూర్యభగవానుడి పుత్రుడు
యమాగ్రజం - సూర్యుడి మరో తనయుడు అయిన యముడికి సోదరుడు
ఛాయా మార్తాండ సంభూతం - ఛాయా దేవికి మార్తాండు అంటే సూర్య భగవానుడికి జన్మించినవాడు
తం నమామి శనైశ్చరం - శనీశ్వరుడికి నమస్కరిస్తున్నా..
శని అనగానే భయపడకండి.. ఆయన పూర్తి పేరు శనైశ్చరుడు, శనీశ్వరుడు అంటారు.. అందులోనే ఈశ్వర శబ్ధం ఉంది
ఈశ్వర శబ్ధం ఉన్నచోట ఐశ్వర్యం ఉంటుంది.. ఆ శబ్ధం వినగానే శని దేవుడు కూడా భోళాశంకరుడిలా అనుగ్రహిస్తాడు
ముక్కోటి దేవతల్లో ఒకరైన శనైశ్చరుడిని త్రికరణ శుద్ధిగా పూజిస్తే అన్నీ శుభాలే జరుగుతాయి
శని , ఏల్నాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని..వీటికి భయపడకండి. శనైశ్చరుడిని స్మరించండి.. కష్టపడి పని చేయండి
శని ప్రభావం నుంచి తప్పించుకునేందుకు భారీ హోమాలు, జపాలు అవసరం లేదు..భక్తితో స్మరణ చాలు