చాణక్య నీతి: మేం సత్య హరిచంద్రులం అనుకునేవాళ్లకు మాత్రమే!

మేం అస్సలు అబద్ధం చెప్పం..అన్నీ నిజాలే మాట్లాడుతాం..సత్య హరిశ్చంద్రుడికి సోదర సమానులం అనుకుంటున్నారా..

అలా ఉండడం కూడా మీకు సమస్యలు తెచ్చిపెడుతుందని ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో వివరించారు

జీవితంలో విజయం సాధించాలి అనుకునే వ్యక్తి తన పనిపై అంకిత భావంతో ఉండాలని, కృషి-విధేయత-నిజాయితీ కలగి ఉండాలన్నారు

అయితే నిజాయితీగా ఉండటం వల్ల కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు చాణక్యుడు

ఈ మాటకు ఉదాహరణగా... నిటారుగా ఉండే చెట్టుని నరికేయడం ఈజీ..ఎవరైనా సులభంగా పడేయగలరు

వంకరటింకరగా ఉన్న చెట్టుని కూల్చటం అంత తేలికైన విషయం కాదు..మనుషులకు కూడా ఇదే వర్తిస్తుంది

నిజాయితీగా ఉండే వ్యక్తిని ఎందుకూపనికిరానివాళ్లు కూడా బాధపెట్టగలరు..వీరిని తొందరగా వినియోగించేసుకుంటారు

నిజాయితీగా ఉండకూడదా అంటే..చాణక్యుడి ఉద్దేశం అదికాదు..అవసరానికి మించిన, మిమ్మల్ని ముంచే నిజాయితీ పనికిరాదు

నిజాయితీతో పాటూ పరిస్థితులను ఎదుర్కొనే తెలివితేటలు కూడా ఉండాలి..