చాణక్య నీతి: గుణం కన్నా ధనం మిన్న!

యస్యార్థాస్తన్య మిత్రాణి యస్యార్థాస్తన్య బాన్థవాః
యస్యార్థాః న పుమాంలోకే యస్యార్థాః న చ వణ్డితః

ధనవంతులు-గుణవంతుల గురించి చర్చిస్తూ చాణక్యుడు చెప్పిన శ్లోకం ఇది

అప్పుడెప్పుడో చాణక్యుడు చెప్పిన ఈ శ్లోకం ఇప్పటి తరానికీ వర్తించేలా ఉంటుంది

సాధారణంగా ధనం ఉన్నవాడికే లోకులు మిత్రులవుతారు..బంధువులు వచ్చిపోతుంటారు

డబ్బులేనివారిని ఇంటా-బయటా ఓ మనిషిగా కూడా గుర్తించరు

మిత్రులు, బంధువులు ముఖం చాటేస్తారు..చివరకు కుటుంబ సభ్యులు కూడా విస్మరిస్తారు

ధనవంతుడిని జ్ఞానిగా, విధ్వాంసుడిగా కీర్తిస్తారు..ధనం లేనివాడు గుణవంతుడైనా పట్టించుకోరు

గుణాన్ని కూడా పట్టించుకోనంత ప్రభావం ధనానికి ఉందంటారు ఆచార్య చాణక్యుడు