తిరుమలకు వెళ్లే భక్తులకు అలర్ట్!

జననరి 10 నుంచి 19 వరకూ పది రోజుల పాటూ వైకుంఠ ఏకాదశి దర్శనాలకు TTD అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది

వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా ఆ పది రోజుల పాటూ అన్ని ప్రత్యేక దర్శనాలు రద్దు చేసింది టీటీడీ

జనవరి 10 ఉదయం 4:30 గంటలకు VIP దర్శనాలతో శ్రీవారి ఉత్తరద్వార దర్శనం ప్రారంభం అవుతుంది

ఈ 10 రోజుల్లో దాదాపు ఏడున్నర లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకునేలా ఏర్పాట్లు పూర్తిచేశారు

కాలిబాటలో జనవరి 19వ తేదీ వరకూ ఎలాంటి టోకెన్లు జారీ చేయడం లేదని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు

జనవరి 10 వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం 9 నుంచి 11 వరకు స్వర్ణరథంపై మలయప్పస్వామి దర్శనం

జనవరి 10 మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 వరకు వాహన మండపంలో మలయప్పస్వామి దర్శనం ఉంటుంది

జనవరి 11వ తేదీ ఉదయం 5:30 గంటలకు చక్రస్నానం ఉంటుంది

3 వేల మంది పోలీసులు,15 వందల మంది సిబ్బందితో భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు

స్వయంగా వచ్చే ప్రముఖులకు మాత్రమే దర్శనం కల్పిస్తామన్నారు