చాణక్య నీతి: నేను తెలివైనోడిని అనుకునేవారికోసం!

“నాస్తి బుద్ధిమతాం శత్రుః”
తెలివైన వ్యక్తికి శత్రువులు ఉండరు అని దీని అర్థం

ఎందుకంటే శత్రువులను మిత్రులుగా మార్చుకోవడం తెలివైన వ్యక్తి లక్షణం

జ్ఞానం అంటే వృత్తి విద్యకు సంబంధించినది కాదు..ఆచరణాత్మకంగా ఉండేది. తెలివైనవ్యక్తి తన జ్ఞానాన్ని అందరితో పంచుకుంటారు

ఇతరుల చేతిలో ఉన్న ధనం మనకు ఎలా ఉపయోగపడతదో..మీ జ్ఞానం పుస్తకాల్లో బంధీ అయిపోయినా అంతే..వీరిని తెలివైనవారు అనరు

అనవసర విషయాల గురించి అతిగా ఆలోచించేవారు జీవితంలో అడుగు ముందుకువేయలేరు..

చేరుకోవాల్సిన లక్ష్యం విషయంలో స్పష్టంగా ఉండాలి... అహం, శౌర్యం, ఆత్మగౌరవం, అందం విషయాల్లో అయోమయానికి గురికాకూడదు

సమస్య ఎదురైనప్పుడు దాన్ని పరిష్కరించుకునే తీరును బట్టి మీరు ఎంత గొప్పవారో అర్థం అవుతుంది

ప్రతిష్ట అంటే అహానికి మరో రూపం. అందుకే ఎందుగూ పనికిరాని ప్రతిష్ట జోలికిపోవద్దు..అహం అన్నం పెట్టదని తెలుసుకోవాలి

నీ శక్తేంటో నీకు తెలిస్తే ఎంత పెద్ద సమస్య అయినా ఇట్టే పరిష్కరించుకోవచ్చు..సమస్య మీకు సమస్యే అవదు