భోగి శుభాకాంక్షలు ఇలా చెప్పేయండి!
మిమ్మల్ని వెంటాడిన కష్టాలన్నీ భోగి మంటల్లో మసైపోవాలి
కొత్త ఆనందాలు మీ జీవితంలో వెల్లివిరియాలి
మీ జీవితంలో ఉండే చీడ తొలగిపోవాలి
నూతన వెలుగులు నిండాలి
ఈ భోగి మీకు అన్ని భాగ్యాలను అందించాలి
మీలోని చెడును, వ్యసనాలను భోగి మంటల్లో పడేయండి
మీ జీవితంలోకి కొత్త వెలుగులకు ఆహ్వానం పలకండి
రంగు రంగుల గాలిపటాలు ఆకాశంలో ఆనందంగా ఎగురుతున్నట్టు
మీ జీవితంలో సరికొత్త ఆనందాలు రావాలి
చెడును దహించే భోగి మంటలు
భోగాలను అందించే భోగి పళ్లు
నింగిని తాకే పతంగులు..ఆనందాన్ని పెంచే కోళ్ల పందేలు..
చిందులువు వేసే బసవన్నలు..సంక్రాంతి మూడు దినాలు..
చెడును దహించేసే భోగి మంటలు
సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి మీ ఇల్లు