విద్య, ఆరోగ్యం, సంపద, వివాహం.. సమస్యకో శ్లోకం - విష్ణుసహస్రం అంత పవర్ ఫుల్!

Published by: RAMA

ఒక్కో శ్లోకానికి ఒక్కో ప్రత్యేకత

విష్ణు సహస్రనామం నిత్యం పఠిస్తే అత్యంత పుణ్యఫలం..వైకుంఠ ఏకాదశిరోజు ఇంకా మంచిది.

విద్యాభివృద్ధికి - 14వ శ్లోకం

సర్వగ సర్వవిద్భాను ర్విష్వక్సేనో జనార్దనః |
వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః ||

సంతోషంగా ఉండేందుకు - 18వ శ్లోకం

వేద్యో వైద్య స్సదాయోగీ వీరహా మాధవో మధుః |
అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః ||

మేధాసంపత్తికి - 19వ శ్లోకం.

మహాబుధ్ధి ర్మహావీర్యో మహాశక్తి ర్మహాద్యుతిః |
అనిర్దేశ్య వపుః శ్రీమా నమేయాత్మా మహాద్రిధృక్ ||

కోర్కెలు నెరవేరాలంటే - 27వ శ్లోకం

అసంఖ్యేయో2ప్రమేయాత్మ విశిష్ట శ్శిష్ట క్రుచ్ఛిచిః |
సిద్ధార్థ స్సిధ్ధసంకల్పః సిద్ధిద స్సిధ్ధిసాధనః ||

వివాహానికి అడ్డంకులు ఉంటే - 32వ శ్లోకం

భూతభవ్య భవన్నాధః పవనః పావనో2నలః |
కామహా కామక్రుత్కాన్తః కామః కామప్రదః ప్రభుః ||

మృత్యు భయం తొలగిపోయేందుకు - 44వ శ్లోకం

వైకుంఠ: పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః ప్రుథుః |
హిరణ్యగర్భః శత్రుఘ్నో వ్యాప్తో వాయు రథోక్షజః ||

ప్రయాణం చేసేముందు

వనమాలీ గదీ శారంగీ శంఖీ చక్రీ చ నన్దకీ|
శ్రీమన్నారాయణో విష్ణుః వాసుదేవో భిరక్షతు||

ధనాభివృద్ధికి - 46వ శ్లోకం

విస్తారః స్థావర స్స్తాణుః ప్రమాణం బీజ మవ్యయం!
అర్థో నర్థో మహా కోశో మహా భోగో మహాధనః !!