ఉపవాసం ఉన్నరోజు ఆలయంలో ప్రసాదం తినొచ్చా! ఉపవాసం అంటేనే ఏమీ తినకుండా ఉండడం..మరి గుడికెళితే ప్రసాదం ఇస్తారు..అది తినొచ్చా? చాలామందిలో ఈ సందేహం ఉంటుంది..ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఇదిగో ఉపవాసం ఎందుకు చేస్తారు అని అడిగితే స్వామి/అమ్మవార్ల అనుగ్రహం కోసమే కదా.. ఆలయంలో దర్శనం తర్వాత ఇచ్చే తీర్థం, ప్రసాదం ఆ స్వామి అనుగ్రహమే... స్వామివారి కరుణాకటాక్షాలు తీర్థప్రసాదాల రూపంలో మీకు చెరుతాయన్నమాట భగవంతుడి అనుగ్రహంతో కూడిన ప్రసాదం తినడం వల్ల మనసు బుద్ధిగా మారుతుంది..మంచి ఆలోచన కలుగుతుంది ఆలోచన సక్రమంగా ఉన్నప్పుడు జీవితంలో ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కోగలరు ఉపవాస సమయంలో ఆలయాన్ని సందర్శించినప్పుడు అక్కడ ప్రసాదాన్ని తినొచ్చు.. ప్రసాదాన్ని ప్రసాదంలా మాత్రమే తీసుకోవాలి..టిఫిన్, భోజనంలా కాదని సూచిస్తున్నారు పండితులు