అన్వేషించండి

Sanju Samson: ఆ కారణాలతోనే సంజూకి చోటు దక్కలేదు - బెటర్ లక్ నెక్స్ట్ టైం అంటూ దిగ్గజ క్రికెటర్ వ్యాఖ్యలు

Sanju Samson: టీ20ల్లో సెంచరీల మీద సెంచరీలు బాదుతున్న సంజూ.. 16 వన్డేల్లో 516 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు ఫిఫ్టీలు ఉన్నాయి. 56కి పైగా సగటు, 99కిపైగా స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించాడు.

ICC Champions News: ఇటీవల ప్రకటించిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో కేరళకు చెందిన సంజూ శాంసన్‌కు మొండిచెయ్యి ఎదురైన సంగతి తెలిసిందే. వికెట్ కీపర్ బ్యాటర్ అయిన సంజూకు కేఎల్ రాహుల్, రిషభ్ పంత్‌ల నుంచి గట్టి ప్రతిఘటన ఎదురైంది. దీంతో స్క్వాడ్‌‌లో వాళ్లిద్దరినే చేర్చుకుని, సంజూను పక్కనపెట్టారు. నిజానికి గత పదేళ్లుగా వన్డేల్లో అడపాదడపా ఆడుతున్న సంజూకు మంచి రికార్డే ఉంది. 16 వన్డేల్లో 516 పరుగులు చేసిన సంజూ.. ఒక సెంచరీ, మూడు ఫిఫ్టీలు బాదాడు. 56కి పైగా సగటు, 99కిపైగా స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించాడు. తాజాగా సంజూని పక్కన పెట్టడంపై దిగ్గజ క్రికెటర్, లిటిల్ మాస్టర్ సునీల్ గావస్కర్ విచారం వ్యక్తం చేశాడు. తప్పనిసరి పరిస్థితుల్లోనే సంజూకు మొండిచేయి ఎదురైందని వ్యాఖ్యానించాడు. 

ఆ ఓక్క కారణంతోనే..
ముఖ్యంగా పంత్‌తోనే సంజూకు పోటీ ఎదురైందని, అయితే నిమిషాల్లో ఆటను మార్చే సామర్థ్యం పంత్‌కు సాధ్యమని, అందుకే అతడికే సెలెక్టర్లు ఓటేశారని గావస్కర్ తెలిపాడు. నిజానికి పంత్ కంటే సంజూ మంచి బ్యాటరని, అయితే వికెట్ కీపింగ్‌తో పాటు దూకుడైన ఆటతీరుతో పంత్ సెలెక్టర్ల మనసు దోచాడని చెప్పుకొచ్చాడు. అయినా జాతీయ జట్టులోకి ఎంపిక కానందుకు సంజూ ఫీల్ కావాల్సిన అవసరం లేదని, దేశ ప్రజలంతా తన ఆటతీరును ఎప్పటీకీ స్మరించుకుంటారని తెలిపాడు. ఆటలో ఇవన్నీ సహజమని, ముందుకు వెళ్లాలని ఏదో ఒకరోజు ఫలితముంటుందని బెస్టాఫ్ లక్ చెప్పాడు. టీ20 జట్టులో రెగ్యులర్ ఓపెనర్‌గా ఉన్న సంజూకి, అటు టెస్టులు, ఇటు వన్డేల్లో స్థానం దక్కడం లేదు. అయితే ఇటీవల పొట్టి ఫార్మాట్‌లో తను సెంచరీల మీద సెంచరీలు కొడుతున్నాడు. 

సంజూ నిర్లక్ష్యం కూడా కారణమా..?
క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడటంతోనే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే సువర్ణవకాశాన్ని సంజూ శాంసన్ కోల్పోయినట్లు తెలుస్తోంది. దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొనడం ద్వారా బీసీసీఐ ఫోకస్‌లో పడాలని సంజూ కోరుకున్నాడు. అయితే కేరళ క్రికెట్ సంఘం ధోరణితో అతనికి ఈ సువర్ణావకాశం మిస్సయ్యిందని తెలుస్తోంది. ఇందులో సంజూ తప్పు కూడా ఉందని సమాచారం. విజయ్ హజారే ట్రోఫీ కోసం 30 మందితో కూడిన ప్రిపరేటరీ క్యాంపునకు వచ్చేందుకు సంజూ విముఖత చూపుతూ, తను అందుబాటులో లేనని కేరళ క్రికట్ సంఘానికి తెలిపాడు. క్యాంపు ముగిసి జట్టును ఎంపిక చేశాక, తను జట్టులోకి వస్తానని సంజూ కోరాడని, అతని అభ్యర్థనను తిరస్కరించినట్లు తెలుస్తోంది. 
జాతీయ జట్టుకు కేరళ సంఘం ద్వారానే సంజూ వెళ్లాడని, అయితే సంఘం నిబంధనలను పాటించకపోవడం ఏంటని సంఘం ప్రెసిడెంట్ జయేశ్ జార్జ్ ఫైరయ్యారు. ఇలా బాధ్యత రాహిత్యంగా ప్రవర్తిస్తే సహించేది లేదని పేర్కొన్నారు. విజయ్ హజారే ట్రోఫీలో ఆడని కారణంగానే చాంపియన్స్ ట్రోపీలో పాల్గొనే చాన్స్ ను సంజూ కోల్పోయాడా అనే విషయం తనకు తెలియదని తెలిపారు. ఏదేమైనా బంగారం లాంటి ఐసీసీ టోర్నీలో పాల్గొనే అవకాశాన్ని సంజూ మిస్సవ్వడంపై అతని అభిమానులు ఫీలవుతున్నారు. 

Also Read: Himani Mor: నీరజ్ చోప్రా భార్య హిమానీ మోర్ గురించి తెలుసా...? తను కూడా గోల్డ్ మెడల్ తెచ్చింది

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Review: శాంతిభద్రతలపై డీసీఎం పవన్ సమీక్ష- పోలీసులకు స్ట్రాంగ్ వార్నింగ్
శాంతిభద్రతలపై డీసీఎం పవన్ సమీక్ష- పోలీసులకు స్ట్రాంగ్ వార్నింగ్
IPL 2025 SRH VS LSG Result Update :  SRH కి LSG రిటర్న్ గిఫ్ట్.. గతేడాది ఓటమికి ఘనంగా బదులు తీర్చుకున్న లక్నో.. పూరన్ విధ్వంసం.. హైదరాబాద్ కు తొలి ఓటమి
 SRH కి LSG రిటర్న్ గిఫ్ట్.. గతేడాది ఓటమికి ఘనంగా బదులు తీర్చుకున్న లక్నో.. పూరన్ విధ్వంసం.. హైదరాబాద్ కు తొలి ఓటమి
YSRCP: సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవరెడ్డిలకు ముందస్తు బెయిల్ - పోసాని కేసులో ఇచ్చిన హైకోర్టు
సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవరెడ్డిలకు ముందస్తు బెయిల్ - పోసాని కేసులో ఇచ్చిన హైకోర్టు
Robinhood Twitter Review - 'రాబిన్‌హుడ్' ట్విట్టర్ రివ్యూ: ఆ దేవుడి మీద భారం వేయక తప్పదా... నితిన్ సినిమాకు ఊహించని టాక్!
'రాబిన్‌హుడ్' ట్విట్టర్ రివ్యూ: ఆ దేవుడి మీద భారం వేయక తప్పదా... నితిన్ సినిమాకు ఊహించని టాక్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

SRH vs LSG Match Highlights IPL 2025 | 300 కొట్టేస్తాం అనుకుంటే..మడతపెట్టి కొట్టిన LSG | ABP DesamSRH vs LSG Match Preview IPL 2025 | నేడు సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ | ABPKL Rahul Joins Delhi Capitals | నైట్ పార్టీలో నానా హంగామా చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ | ABP DesamRC 16 Ram Charan Peddi First Look | రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా RC16 టైటిల్, ఫస్ట్ లుక్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Review: శాంతిభద్రతలపై డీసీఎం పవన్ సమీక్ష- పోలీసులకు స్ట్రాంగ్ వార్నింగ్
శాంతిభద్రతలపై డీసీఎం పవన్ సమీక్ష- పోలీసులకు స్ట్రాంగ్ వార్నింగ్
IPL 2025 SRH VS LSG Result Update :  SRH కి LSG రిటర్న్ గిఫ్ట్.. గతేడాది ఓటమికి ఘనంగా బదులు తీర్చుకున్న లక్నో.. పూరన్ విధ్వంసం.. హైదరాబాద్ కు తొలి ఓటమి
 SRH కి LSG రిటర్న్ గిఫ్ట్.. గతేడాది ఓటమికి ఘనంగా బదులు తీర్చుకున్న లక్నో.. పూరన్ విధ్వంసం.. హైదరాబాద్ కు తొలి ఓటమి
YSRCP: సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవరెడ్డిలకు ముందస్తు బెయిల్ - పోసాని కేసులో ఇచ్చిన హైకోర్టు
సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవరెడ్డిలకు ముందస్తు బెయిల్ - పోసాని కేసులో ఇచ్చిన హైకోర్టు
Robinhood Twitter Review - 'రాబిన్‌హుడ్' ట్విట్టర్ రివ్యూ: ఆ దేవుడి మీద భారం వేయక తప్పదా... నితిన్ సినిమాకు ఊహించని టాక్!
'రాబిన్‌హుడ్' ట్విట్టర్ రివ్యూ: ఆ దేవుడి మీద భారం వేయక తప్పదా... నితిన్ సినిమాకు ఊహించని టాక్!
Mad Square First Review: 'మ్యాడ్ స్క్వేర్' ఫస్ట్ రివ్యూ...  ఫస్ట్ 40 మినిట్స్ నాన్ స్టాప్ నవ్వులు - తర్వాత ఎలా ఉందంటే?
'మ్యాడ్ స్క్వేర్' ఫస్ట్ రివ్యూ... ఫస్ట్ 40 మినిట్స్ నాన్ స్టాప్ నవ్వులు - తర్వాత ఎలా ఉందంటే?
Polavaram: గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం పూర్తి - ముందే నిర్వాసితులకు పరిహారం - చంద్రబాబు కీలక ప్రకటనలు
గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం పూర్తి - ముందే నిర్వాసితులకు పరిహారం - చంద్రబాబు కీలక ప్రకటనలు
Telangana Assembly: కక్ష కట్టి ఉంటే ఫ్యామిలీతో చర్లపల్లిలో ఉండేవాళ్లు - కేటీఆర్‌కు రేవంత్ కౌంటర్
కక్ష కట్టి ఉంటే ఫ్యామిలీతో చర్లపల్లిలో ఉండేవాళ్లు - కేటీఆర్‌కు రేవంత్ కౌంటర్
Nicholas Pooran:పోర్లు! సిక్స్‌లు! నికోలస్ పూరన్ విశ్వరూపం, ఐపీఎల్ 2025లో ఫాస్టెస్ట్‌ హాఫ్ సెంచరీ
పోర్లు! సిక్స్‌లు! నికోలస్ పూరన్ విశ్వరూపం, ఐపీఎల్ 2025లో ఫాస్టెస్ట్‌ హాఫ్ సెంచరీ
Embed widget