Himani Mor: నీరజ్ చోప్రా భార్య హిమానీ మోర్ గురించి తెలుసా...? తను కూడా గోల్డ్ మెడల్ తెచ్చింది.
Himani Mor: చడీ చప్పుడు లేకుండా వివాహం చేసుకుని ఒలంపిక్ చాంఫియన్ నీరజ్ చోప్రా.. షాక్ ఇచ్చాడు. టెన్నిస్ ప్లేయర్ హిమానీ మోర్‌తో మూడుముళ్ల బంధంలోకి ఎంటర్ అయ్యాడు ఇప్పుడంతా ఎవరీ హిమానీ అని చూస్తున్నారు.

Neeraj Chopra Marriage: ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్ హిమానీ మోర్‌తో మూడుముళ్ల బంధంలోకి ఎంటర్ అయ్యాడు. అతికొద్ది మంది సన్నిహితుల మధ్య హిమాచల్ ప్రదేశ్‌లో ఈ వివాహం జరిగింది. ఆదివారం సాయంత్రం తన X హ్యాండిల్ ద్వారా ఈ విషయం తెలిపే వరకూ బయట ఈ విషయం పెద్దగా తెలీదు. కేవలం 40-50 దగ్గరి బంధువుల సమక్షంలో ఈ వివాహ వేడుక జరిగింది. “మీ అందరి ఆశీస్సులతో ఈ ప్రేమబంధం ఈ క్షణానికి చేరుకుంది. ఈ సంతోషం ఎప్పటికీ నిలవాలి” అని తమ పెళ్లి ఫోటో షేర్ చేశారు.
Who is Himani Mor?:
నీరజ్ నేరుగా తన భార్యను సోషల్ మీడియాలో పరిచయం చేయడంతో అందరూ ఎవరీ Himani Mor అని ఆరా తీయడం మొదలుపెట్టారు. సోనిపట్‌కు చెందిన 25 ఏళ్ల హిమానీ ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్. ఆమె న్యూ హాంప్‌షైర్‌లోని ఫ్రాంక్లిన్ యూనివర్సిటీ నుంచి స్పోర్ట్స్ మెడినన్‌లో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నారు. ఆమె సోదరడు హిమాన్షు కూడా టెన్నిస్ ఆటగాడే.
ఢిల్లీ యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్ చేసిన హిమానీ 2017లో తైపీలో జరిగిన ప్రపంచ యూనివర్సిటీ గేమ్స్‌లో తన యూనివర్సిటీ తరపున పాల్గొంది. వరల్డ్ జూనియర్ టెన్నిస్ చాంఫియన్‌షిప్‌లో ఆమె గోల్డ్ మెడల్ సాధించింది.
Himani Instagram అకౌంట్ ప్రైవేట్ సెట్టింగ్స్‌లో ఉంది. అయితే ఆ పేరుతో మరొకరు అకౌంట్ ప్రారంభించారు. అందులో హిమానీ టెన్నిస్ కెరీర్‌కు సంబంధించిన ఫోటోలు, తన స్కూల్ డేస్‌కు సంబంధించిన ఫోటోలు ఉన్నాయి. బహుశా తన స్నేహితులు ఎవరైనా ఈ అకౌంట్‌ను రన్ చేస్తూ ఉండొచ్చు. ఈ అకౌంట్ కూడా రెండు రోజుల క్రితమే ప్రారంభమైంది.
హనీమూన్‌కు వెళ్లిన నీరజ్-హిమానీ
నీరజ్ తన పెళ్లి విషయాన్ని చాలా సీక్రెట్‌గా ఉంచాడు. హిమానీ కూడా హరియాణకు చెందిన అమ్మాయి. అయితే కొన్నేళ్లుగా U.Sలో చదువుకుంటోంది. పెళ్లి మూడురోజుల కిందట జరిగినట్లు నీరజ్ మేనమామ భీమ్ పీటీఐకి చెప్పారు. “ ఆ అమ్మాయిది హర్యాణానే. చిన్నప్పుడు ఇక్కడే చదువుకుంది. ఆ తర్వాత వాళ్ల ఫ్యామిలీ యుఎస్ వెళ్లిపోయారు. మూడు రోజుల కిందట పెళ్లి జరిగింది. ఇది బయట వాళ్లకి తెలియాల్సిన పనిలేదని నీరజ్ అనుకున్నాడు. ఇప్పుడు కూడా వాళ్లు ఇండియాలో లేరు. హనీమూన్‌కు వెళ్లిపోయారు. నీరజ్ ఎక్కడికి వెళ్లింది ఎవరికీ చెప్పలేదు” అన్నారు.
ఆలిండియా టెన్నిస్ అసోసియేషన్ AITA వెబ్‌సైట్ ప్రకారం హిమానీ కేరీర్లో బెస్ట్ సింగిల్స్ ర్యాంక్ 42, డబుల్స్ ర్యాంక్ 27. 2018లో ఆమె AITA ఈవెంట్లలో ఆడారు. ఇక నీరజ్ ఇండియాలో టాప్ అథ్లెట్. ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో భారత్‌కు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన వ్యక్తి. జావెలిన్ త్రోలో టోక్యో ఒలంపిక్స్‌లో స్వర్ణ పతకం తెచ్చిన నీరజ్, 2024 పారిస్ ఒలంపిక్స్‌లో రజతం సాధించాడు. వరల్డ్ చాంఫియన్ షిప్‌లోనూ సత్తా చాటాడు. 2023లో జావెలిన్ త్రో లో వరల్డ్ నెంబర్‌వన్ గా నిలిచాడు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

