Neeraj Chopra Marriage: ప్రేమించి, పెళ్లి చేసుకున్న నీరజ్ చోప్రా.. వధువెవరో తెలుసా..! వివాహాన్ని రహస్యంగా ఉంచిన స్టార్ అథ్లెట్
2020 ఒలింపిక్స్ తో నీరజ్ ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చాడు.ట్రాక్ అండ్ ఫీల్డులో బంగారు పతకం గెలిచిన తొలి భారతీయునిగా రికార్డులకెక్కాడు.జావెలిన్ త్రోలో భారత్ కు దక్కిన మొట్టమొదటి పతకం ఇదే కావడం విశేషం.

Neeraj Chopra News: భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా తాజాగా ఒక ఇంటివాడయ్యాడు. అత్యంత రహస్యంగా జరిగిన ఈ వివాహ వేడుక గురించి నీరజ్ స్వయంగా సోషల్ మీడియాలో పోస్టు చేసేంత వరకు ఎవరికీ తెలియదు. అమెరికాలో క్రీడలకు సంబంధించిన కోర్సు చదువుతున్న హిమానీని నీరజ్ వివాహం చేసుకున్నాడు.
హిమాచల్ ప్రదేశ్ లోని ఒక ప్రదేశంలో కేవలం 50-60 మంది గెస్టుల మధ్య ఈ వేడుక జరిగినట్లు తెలుస్తోంది. 2020 టోక్యో ఒలింపిక్స్ తో నీరజ్ ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చాడు. ట్రాక్ అండ్ ఫీల్డులో బంగారు పతకం గెలిచిన తొలి భారతీయునిగా రికార్డులకెక్కాడు. జావెలిన్ త్రో విభాగంలో భారత్ కు దక్కిన మొట్టమొదటి పతకం ఇదే కావడం విశేషం. టోక్యో ఒలింపిక్స్ లో భారీ అంచనాలతో దిగిన నీరజ్.. రెండో స్థానం సంపాదించి సిల్వర్ మెడల్ కైవసం చేసుకున్నాడు.
View this post on Instagram
విదేశాలకు జంట..
పెళ్లి తంతు ముగియగానే విదేశాలకు నీరజ్ దంపతులు వెళ్లినట్లు సమాచారం. వాళ్లు అక్కడి నుంచి తిరిగి రాగానే గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. పెళ్లి వేడుకకు సంబంధించి సంబరాలు 14, 15,16 తేదీల్లో జరిగినట్లు తెలుస్తోంది. దీన్నొక డెస్టినేషన్ వెడ్డింగ్ గా నిర్వహించారు. కేవలం 40 నుంచి యాభై మంది వరకే హాజరైనట్లు తెలుస్తోంది. మరోవైపు గతేడాది అమెరికాకు చెందిన ప్రముఖ పత్రిక ట్రాక్ అండ్ ఫీల్డ్ న్యూస్ ప్రపంచంలోనే బెస్ట్ జావెలిన్ త్రోయర్ గా ప్రకటించింది. రెండుసార్లు ప్రపంచ చాంపియన్ అండర్సన్ పీటర్్ ను వెనక్కి నెట్టి మరీ నీరజ్ ఈ అవార్డు సాధించడం విశేషం. 2023లో పురుషుల జావెలిన్ త్రోలో నీరజ్ టాప్ ర్యాంకును దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇక 2024లో డైమండ్ లీగ్ లో అంతగా సత్తా చాటలేక పోయాడు. దోహ, లాసన్, బ్రస్సెల్స్ లో జరిగిన టోర్నీల్లో రెండోస్థానం పొందాడు. ఫిన్లాండ్ లోని టుర్కులో జరిగిన పావో నుర్మి గేమ్స్ లో మాత్రమే నీరజ్ చాంపియన్ గా నిలిచాడు.
ప్రేమ వివాహం..?
జీవితంలో తాను కొత్త ఆధ్యాయంలోకి అడుగుపెట్టానని ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశాడు నీరజ్ చోప్రా. పెళ్లి ఫొటోలను పంచుకున్నాడు. తమను కలిపే ఈ సందర్భానికి చేర్చిన ప్రతీ ఆశీర్వాదానికి కృతజ్ఞతలు తెలిపాడు. ప్రేమతో ఒక్కటయ్యామని, ఎప్పటికీ సంతోషంగా ఉంటామని క్యాప్షన్ రాశాడు. నీరజ్, హిమానీ పేర్లు రాసి మధ్యలో లవ్ సింబల్ పెట్టాడు.
పెళ్లి విషయాన్ని ముందుగా నీరజ్ చోప్రా బయటికి చెప్పలేదు. ఎక్కడా విషయం వెల్లడి కాకుండా జాగ్రత్త పడ్డాడు. రెండు రోజుల కిందటే వివాహం జరగగా.. ఇప్పుడు ఒక్కసారిగా ఫొటోలను షేర్ చేశాడు. పెళ్లి జరిగిపోయిందని అందరినీ ఆశ్చర్యపరిచాడు. కుటుంబాల సమక్షంలో వివాహం సంప్రదాయ బద్ధంగా గ్రాండ్‍గా జరిగినట్టు ఫొటోలను చూస్తే అర్థమవుతోంది.
వివాహం చేసుకున్న తర్వాత అప్పుడే నీరజ్, హిమానీ.. హనీమూన్‍కు వెళ్లారట. ఈ విషయాన్ని నీరజ్ బంధువు భీమ్ చెప్పారని పీటీఐ పేర్కొంది. హిమానీ ప్రస్తుతం అమెరికాలో చదువుకుంటున్నారని తెలుస్తోంది. ఇండియాలో రెండు రోజుల క్రితమే పెళ్లి జరిగిందని, పెళ్లి కూతురు.. సోనీపట్‍కు చెందిన వారని తెలిపాడు. ప్రస్తుతం అమెరికాలో చదువుకుంటుందని, నూతన జంట హనీమూన్ కోసం వెళ్లారని, ఎక్కడికి వెళ్లారో తెలియదని భీమ్ చెప్పాడు.
Also Read: IPL 2025: లక్నో నూతన కెప్టెన్‌గా భారత స్టార్ ప్లేయర్ - సోమవారం ప్రకటన, కొత్త జెర్సీ విడుదల కూడా..





















