అన్వేషించండి

EMS Treatment For Fatloss : EMS ట్రీట్​మెంట్​తో కొవ్వు తగ్గుతుందా? వ్యాయామం, డైట్ చేయకపోయినా ఇంచ్​ లాస్ అవ్వడంలో నిజమెంతంటే

Fat Loss Treatment : ఈ మధ్యకాలంలో ఇంచ్ లాస్​కి EMS ట్రీట్​మెంట్ బాగా ఫేమస్ అయింది. అయితే ఈ ట్రీట్​మెంట్​ చేయించుకుంటే వ్యాయామం చేయకపోయినా, డైట్ ఫాలో అవ్వకపోయినా కొవ్వు తగ్గుతుందా? 

Electrical Muscle Stimulation : సోషల్ మీడియాలో బ్యూటీ ట్రీట్​మెంట్స్​లో భాగంగా చాలామంది ఇన్​ఫ్లూయెన్సర్లు, సెలబ్రెటీలు EMS చికిత్సను ప్రమోట్ చేస్తున్నారు. కొవ్వును తగ్గించడంలో ఈ ట్రీట్​మెంట్ హెల్ప్ చేస్తుందని.. వ్యాయామం చేయకపోయినా.. డైట్ ఫాలో అవ్వకపోయినా దీనితో బరువు తగ్గొచ్చని చెప్తున్నారు. ఇంతకీ వారు చెప్పేవాటిలో నిజమెంత? EMS ట్రీట్​మెంట్​తో నిజంగానే బరువు తగ్గొచ్చా? ఈ చికిత్స వల్ల కలిగే ప్రయోజనాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

EMS అంటే ఏమిటి?

EMS అంటే ఎలక్ట్రికల్ మజిల్ స్టిమ్యులేషన్. కండరాల సంకోచాలను ప్రేరేపించడానికి విద్యుత్ ప్రేరణలను ఉపయోగించి చేసే చికిత్స ఇది. నొప్పి లేకుండా.. నాన్​ ఇన్వాసివ్​గా తీసుకునే ఫిజికల్ చికిత్స ఇది. బరువు తగ్గాలనుకునేవారు, ఇంచ్​ లాస్ కావాలనుకునేవారు దీనిని ఫాలో అవ్వుతున్నారు. డైట్ లేకుండా వ్యాయామం చేయకుండా బరువు తగ్గవచ్చంటూ.. ఇన్​స్టంట్ రిజల్ట్స్ చూపిస్తూ.. చాలామంది ఇన్​ఫ్లూయెన్సర్లు ఈ ట్రీట్​మెంట్ గురించి ప్రమోట్ చేస్తున్నారు. 

ఈ చికిత్సను ఇప్పుడు ఆస్పత్రుల్లోనే కాకుండా బ్యూటీ క్లినిక్​, స్పాలలో కూడా నిర్వహిస్తున్నారు. కొవ్వు తగ్గించుకోవడానికి, శరీర ఆకృతి కోసం ఈ చికిత్సను చాలామంది ఫాలో అవ్వుతున్నారు. 

EMS ట్రీట్​మెంట్​తో కలిగే లాభాలివే.. 

ఈ ట్రీట్​మెంట్​తో కండరాల స్థాయి మెరుగవుతుంది. దీనివల్ల త్వరగా బరువు తగ్గినట్లు, ఇంచ్​ లాస్ అయినట్లు కనిపిస్తారు. చికిత్స తీసుకున్న ప్రాంతంలో రక్తప్రవాహం పెరిగి.. ఆక్సిజన్ ఫ్లో పెరుగుతుంది. దీనివల్ల జీవక్రియ పెరిగి కొవ్వు తగ్గుతుంది. రక్తప్రసరణను పెంచి ఫ్యాట్​ను బర్న్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఒత్తిడిని తగ్గించి.. బరువు తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. 

ట్రీట్​మెంట్ ఎలా వర్క్ చేస్తుందంటే.. 

EMS ట్రీట్​మెంట్​ను ఎక్కువగా పొత్తికడుపు, తొడలు, చేతులపై ఎక్కువగా చేస్తారు. కాబట్టి మీరు ఈ చికిత్స తీసుకునేప్పుడు హాయిగా కూర్చోవడం లేదా పడుకోవడం చేయొచ్చు. ఈ చికిత్స సమయంలో మీరు చిన్న వైబ్రేషన్స్​ను పొందుతారు. దీనివల్ల స్ట్రెస్ తగ్గుతుంది. మీ అవసరాలను బట్టి సెషన్​లు ఉంటాయి. 20 నుంచి 30 నిమిషాల్లో ఇవి ఉండొచ్చు. చికిత్స తర్వాత కాస్త నొప్పి ఉండొచ్చు. 

గుర్తించుకోవాల్సిన అంశాలివే.. 

EMS చికిత్సతో పర్మినెంట్ ఫలితాలు రావు. అలాగే ఈ చికిత్స తర్వాత మీరు మళ్లీ యధాస్థితికి వచ్చేస్తారు. మీరు సరైన డైట్ తీసుకుంటూ.. వ్యాయామం చేస్తూ ఉంటే చికిత్స ఫలితాలు ఇంకా మెరుగ్గా, ఎక్కువ కాలం ఉంటాయి. EMSతో పూర్తిగా కొవ్వు తగ్గించుకోవాలనుకుంటే మాత్రం అది అవ్వని పని అని చెప్తున్నారు. ఈ ట్రీట్​మెంట్​ వల్ల మీ చర్మం, బాడీ షేప్​లో మార్పు ఉండొచ్చు.

ఏ వ్యాయామం లేకుండా, డైట్ ఫాలో అవ్వకుండా బరువు తగ్గాలనుకుంటే మాత్రం ఈ ట్రీట్​మెంట్ సరిపోదు. అలా చేయించుకోవాలనుకుంటే మీ డబ్బులు వేస్ట్ అవ్వడం పక్కా అంటున్నారు నిపుణులు. EMS వల్ల మజిల్స్​ యాక్టివేట్ అవ్వడం, ఫ్యాట్ బర్న్ అవ్వడం, నీరు తగ్గడం వల్లే వెంటనే బరువు తగ్గిన ఫీల్, ఇంచ్ లాస్​ అయిన అనుభూతిని పొందుతారని చెప్తున్నారు. కాబట్టి ఈ ట్రీట్​మెంట్ చేయించుకునే ముందు కచ్చితంగా వైద్యుల సలహా తీసుకుంటే మంచిది. 

Also Read : పది సెకన్ల లిప్ కిస్​తో 80 మిలియన్ బ్యాక్టీరియా బదిలీ.. రోజుకు తొమ్మిదిసార్లు ముద్దు పెట్టుకుంటే జరిగేది అదే

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబు ఫ్యామిలీ - గ్రామ దేవతకు ప్రత్యేక పూజలు
సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబు ఫ్యామిలీ - గ్రామ దేవతకు ప్రత్యేక పూజలు
Turmeric Board: నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు - వర్చువల్‌గా ప్రారంభించిన కేంద్ర మంత్రి గోయల్, నెరవేరిన ఏళ్ల కల
నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు - వర్చువల్‌గా ప్రారంభించిన కేంద్ర మంత్రి గోయల్, నెరవేరిన ఏళ్ల కల
Sankranthiki Vasthunam Review - 'సంక్రాంతికి వస్తున్నాం' రివ్యూ: కామెడీ ఒక్కటేనా - కథతోనూ వెంకీ, అనిల్ రావిపూడి మేజిక్ చేశారా?
'సంక్రాంతికి వస్తున్నాం' రివ్యూ: కామెడీ ఒక్కటేనా - కథతోనూ వెంకీ, అనిల్ రావిపూడి మేజిక్ చేశారా?
Padi Kaushik Reddy: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ఊరట - బెయిల్ మంజూరు చేసిన న్యాయమూర్తి
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ఊరట - బెయిల్ మంజూరు చేసిన న్యాయమూర్తి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Maha Kumbh Mela 2025 Day 1 Highlights | ప్రయాగలో కళ్లు చెదిరిపోయే విజువల్స్ | ABP DesamMahakumbh 2025 | 144ఏళ్లకు ఓసారి వచ్చే ముహూర్తంలో మహాకుంభమేళా | ABP DesamDanthapuri Fort | బుద్ధుడి దంతం దొరికిన ప్రాంతం..అశోకుడు నడయాడిన ప్రదేశం | ABP DesamNara Devansh Sack Run | నారావారిపల్లెలో గోనెసంచి పరుగుపందెంలో దేవాన్ష్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబు ఫ్యామిలీ - గ్రామ దేవతకు ప్రత్యేక పూజలు
సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబు ఫ్యామిలీ - గ్రామ దేవతకు ప్రత్యేక పూజలు
Turmeric Board: నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు - వర్చువల్‌గా ప్రారంభించిన కేంద్ర మంత్రి గోయల్, నెరవేరిన ఏళ్ల కల
నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు - వర్చువల్‌గా ప్రారంభించిన కేంద్ర మంత్రి గోయల్, నెరవేరిన ఏళ్ల కల
Sankranthiki Vasthunam Review - 'సంక్రాంతికి వస్తున్నాం' రివ్యూ: కామెడీ ఒక్కటేనా - కథతోనూ వెంకీ, అనిల్ రావిపూడి మేజిక్ చేశారా?
'సంక్రాంతికి వస్తున్నాం' రివ్యూ: కామెడీ ఒక్కటేనా - కథతోనూ వెంకీ, అనిల్ రావిపూడి మేజిక్ చేశారా?
Padi Kaushik Reddy: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ఊరట - బెయిల్ మంజూరు చేసిన న్యాయమూర్తి
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ఊరట - బెయిల్ మంజూరు చేసిన న్యాయమూర్తి
Viral Note: 'నగలు డబ్బు తీసుకెళ్తున్నాం, మా ఇంటికి రాకండి' - సంక్రాంతికి ఊరెళ్తూ ఇంటి డోర్‌పై యజమాని నోట్ వైరల్
'నగలు డబ్బు తీసుకెళ్తున్నాం, మా ఇంటికి రాకండి' - సంక్రాంతికి ఊరెళ్తూ ఇంటి డోర్‌పై యజమాని నోట్ వైరల్
Pigs Fighting: సంక్రాంతి వేళ పందుల పందేలు స్పెషల్ - రూ.కోట్లలో బెట్టింగులు, ఎక్కడో తెలుసా?
సంక్రాంతి వేళ పందుల పందేలు స్పెషల్ - రూ.కోట్లలో బెట్టింగులు, ఎక్కడో తెలుసా?
Sabarimala Makara Jyothi 2025: శబరిమల మకరజ్యోతి కనిపించే ప్రదేశం ఇదే .. ఆ జ్యోతి నిజమా కాదా .. దాని వెనుకున్న సైన్స్ గురించి తెలుసా!
శబరిమల మకరజ్యోతి కనిపించే ప్రదేశం ఇదే .. ఆ జ్యోతి నిజమా కాదా .. దాని వెనుకున్న సైన్స్ గురించి తెలుసా!
Nag Mark-2: భారత అమ్ముల పొదిలోకి మరో అస్త్రం - నాగ్‌మార్క్‌-2 క్షిపణి ప్రయోగం విజయవంతం
భారత అమ్ముల పొదిలోకి మరో అస్త్రం - నాగ్‌మార్క్‌-2 క్షిపణి ప్రయోగం విజయవంతం
Embed widget