Janasena: జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు - గాజు గ్లాసు గుర్తు రిజర్వ్
Andhra News: ఏపీలో జనసేన పార్టీని గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో కేంద్ర ఎన్నికల సంఘం చేర్చింది. గాజు గ్లాస్ గుర్తును రిజర్వ్ చేసింది. ఈ మేరకు ఈసీ జనసేనాని పవన్ కల్యాణ్‌కు లేఖ పంపించింది.

Election Commission Of India Officially Recognise Janasena Party: కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీని (Janasena) ఏపీలోని గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో చేర్చింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తును రిజర్వ్ చేసింది. ఈ మేరకు ఈసీ జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కి (Pawan Kalyan) లేఖ పంపించింది. సార్వత్రిక ఎన్నికల్లో 100 శాతం విజయం నమోదు చేసిన పార్టీగా జనసేన రికార్డు సాధించింది. పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లో, 2 లోక్ సభ స్థానాల్లో అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో జనసేన రికగ్నైజ్డ్ పార్టీగా నిలిచి, గాజు గ్లాసు గుర్తును రిజర్వ్ చేసుకొంది. ఈ మేరకు తమ పార్టీ గుర్తింపు పొందిన పార్టీగా నిలిచి గాజు గ్లాస్ గుర్తు రిజర్వ్ చేసుకుందని జనసేన 'ఎక్స్' వేదికగా వెల్లడించింది.
అటు, లోకేశ్‌కు డిప్యూటీ సీఎం అంశం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారిన వేళ జనసేన (Janasena) పార్టీ అధిష్టానం ఈ వ్యవహారంపై మంగళవారం స్పందించింది. ఇకపై ఈ అంశంపై పార్టీకి చెందిన నేతలెవరూ బహిరంగంగా స్పందించవద్దని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టొద్దని జనసేన కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

