GT vs MI Match Highlights IPL 2025 | ముంబై ఇండియన్స్ పై 36 పరుగుల తేడాతో గుజరాత్ విజయం | ABP Desam
చెన్నై మీద మ్యాచ్ ఓడిపోయి గుజరాత్ కి వెళ్లిన ముంబై ఇండియన్స్ ఈరోజు ఎలా అయినా గెలిచి విన్నింగ్ స్ట్రీక్ ను ప్రారంభిస్తుంది అనుకుంటే రెండో మ్యాచ్ కూడా దేవుడికే ఇచ్చేసింది. గుజరాత్ విసిరిన 197 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించలేక 6వికెట్లు కోల్పోయి 160 పరుగులు మాత్రమే చేసి 36 పరుగుల తేడాతో జీటీకి విజయాన్ని అప్పగించింది. నరేంద్ర మోదీ స్టేడియంలో అంతా గుజరాత్ కి అనుకూలంగానే జరిగిన మ్యాచ్ లో టాప్ 5 హైలెట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం.
1. సూపర్ సాయి సుదర్శన్
టాస్ గెలిచి బ్యాటింగ్ గుజరాత్ కి అప్పగించి ఎంత తప్పు చేశామో ముంబై ఇండియన్స్ త్వరగానే రియలైజ్ అయ్యి ఉంటుంది. దానికి రీజన్ యంగ్ గన్ సాయి సుదర్శన్. కెప్టెన్ శుభ్ మాన్ గిల్ తో కలిసి మంచి ఆరంభాన్ని ఇచ్చాడు సుదర్శన్ జీటీకి. శుభ్ మాన్ గిల్ 38 పరుగులకు అవుటైనా మరో ప్రమాదకర ఆటగాడు జోస్ బట్లర్ తో కలిసి ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించాడు సాయి సుదర్శన్. 41 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్సర్లతో 63పరుగులు చేసి బౌల్ట్ బౌలింగ్ లో ఎల్బీగా వెనుదిరిగాడు సాయి సుదర్శన్
2. దుమ్ము రేపిన కెప్టెన్ పాండ్యా
సాయి సుదర్శన్ 63పరుగులు, గిల్ 38 పరుగులు, బట్లర్ 39 పరుగులు చేసినా...మిగిలిన బ్యాటింగ్ యూనిట్ ను బాగానే డిస్ట్రబ్ చేశారు ముంబై బౌలర్లు. టాప్ 3 బ్యాటర్లు కాకుండా రూథర్ పర్డ్ మినహా మరే ఏ బ్యాటర్ ను పది పరుగులు కూడా చేయనివ్వలేదు ముంబై బౌలర్లు. ప్రధానంగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. స్లోవర్ డెలివ్రీలతో 4 ఓవర్లలో 29 పరుగులు మాత్రమే శుభ్ మన్ గిల్, షారూఖ్ వికెట్లు తీశాడు కెప్టెన్ పాండ్యా. శాంట్నర్ మినహా మిగిలిన బౌలర్లంతా తలో వికెట్ తీయటంతో 200 ఈజీగా దాటేస్తుందనుకున్న గుజరాత్ 197పరుగులకే కట్టడైంది.
3. మోడల్ మోడల్ మియా మోడల్
198 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ కాన్ఫిడెంట్ గానే కనిపించింది. రావటం రావటమే రోహిత్ శర్మ రెండు ఫోర్లతో విరుచుకపడటంతో ముంబై ఇవాళ కుమ్మేస్తుందేమో అనిపించింది. అయితే ఈలోపే ఎక్కుపెట్టిన మిస్సైల్ లా దూసుకొచ్చాడు హైదరాబాదీ మోడల్ సిరాజ్ మియా. ముంబై ఓపెనర్లు రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ లను అవుట్ చేశాడు సిరాజ్. అది కూడా మామాలు అవుట్ కాదు ఇద్దరినీ క్లీన్ బౌల్డ్ చేశాడు. దెబ్బకు 35పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది సిరాజ్ దెబ్బకు ముంబై.
4. వారెవ్వా ప్రసిద్ధ్ కృష్ణ
రోహిత్ శర్మ, రికెల్టెన్ లు అయిపోయిన ముంబై ధైర్యం ఏంటంటే తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ లు ఉన్నారనే. 39పరుగులు చేసిన తిలక్ వర్మను, 28 బంతుల్లో ఓ ఫోర్లు, 4 సిక్సర్లతో 48పరుగులు చేసిన సూర్య కుమార్ యాదవ్ ను అవుట్ చేసింది ఒక్కడే ప్రసిద్ధ్ కృష్ణ. మంచి లైన్ అండ్ లెంగ్త్ వేస్తూ యార్కర్ లెంగ్త్ బాల్స్ తో ఇబ్బంది పెట్టిన ప్రసిద్ధ్ 4 ఓవర్లలో 18 పరుగులు మాత్రమే 2 వికెట్లు తీయటంతో పాటు గుజరాత్ విజయాన్ని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేశాడు. హార్దిక్ పాండ్యాను రబాడా అవుట్ చేస్తే..చివర్లో నమన్ ధీర్, మిచెల్ శాంటర్న్ ఫైర్ వర్క్స్ చేసినా 36పరుగుల తేడాతో విజయం మాత్రం గుజరాత్ నే వరించింది.
5. మిస్టరీ 197
వరుసగా రెండు రోజులు రెండు మ్యాచ్ లు నిజంగా కో ఇన్సిడెన్స్. నిన్న చెన్నై, ఆర్సీబీ మ్యాచ్ జరిగితే ఆర్సీబీ ముందు బ్యాటింగ్ చేసి 196పరుగులు చేసి 197 పరుగుల టార్గెట్ ఇచ్చింది. దాన్ని చెన్నై ఛేదించలేకపోయింది. ఇవాళ కూడా అంతే ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ సరిగ్గా అదే 197 పరుగులు చేసి 197 పరుగుల టార్గెట్ ఇస్తే..ముంబై కూడా ఆ టార్గెట్ ను చేజ్ చేయలేకపోయింది. అదేంటో మరి వరుసగా రెండు రోజుల్లో రెండు మ్యాచు లు 197చేయలేక ఛేజింగ్ చేయాల్సిన టీమ్స్ ఓడిపోవటం కో ఇన్సిడెన్స్ మే బీ.



















