Katha Sudha OTT Release Date: ప్రతీ ఆదివారం ఓ కొత్త కథ - కొత్త స్టోరీలతో ముందుకు వస్తోన్న 'ఈటీవీ విన్'.. ఫస్ట్ స్టోరీ ఎప్పుడంటే?
Katha Sudha OTT Platform: ప్రతీ ఆదివారం ఓ కొత్త స్టోరీని అందుబాటులోకి తీసుకొస్తోంది ప్రముఖ ఓటీటీ ఈటీవీ విన్. కథా సుధ పేరిట ఇవి అందుబాటులోకి తీసుకొస్తుండగా ఏప్రిల్ 6 నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి.

Raghavendra Rao's Katha Sudha OTT Release On ETV Win: కొత్త సినిమాలు, సిరీస్‌లతో ఓటీటీ ఆడియన్స్‌ను అలరించే ప్రముఖ తెలుగు ఓటీటీ 'ఈటీవీ విన్' (ETV Win) మరో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ముందుకువచ్చింది. ఇప్పటికే హారర్, థ్రిల్లర్, క్రైమ్, కామెడీ జోనర్లలో ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా కంటెంట్‌ను అందుబాటులో ఉంచుతుండగా.. వేసవిలో చిన్నారులను అలరించేందుకు కార్టూన్ షోస్‌ను సైతం స్ట్రీమింగ్ చేస్తోంది.
ప్రతి ఆదివారం ఓ కొత్త స్టోరీ
ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో 'కథా సుధ' (Katha Sudha) పేరిట స్టోరీస్ స్ట్రీమింగ్ కానున్నాయి. ప్రతీ ఆదివారం ఓ కొత్త కథ అందుబాటులో ఉండనున్నట్లు 'ఈటీవీ విన్' సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ఏప్రిల్ 6 నుంచి ఇవి స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించింది. పలువురు కొత్త వారు ఈ 'కథా సుధ' ద్వారా పరిచయం కానున్నట్లు పేర్కొంది.
"కథా సుధ" – ఈ కథలు మీ కోసం!
— ETV Win (@etvwin) March 29, 2025
ప్రతి ఆదివారం @ETVWin లో కొత్త కథ! రిలేటబుల్ & ఎమోషనల్.
ఈసారి కథలో మీకు మీరు కనిపిస్తారు!😄
From April 06#KathaSudha #ETVWin #SundayStories pic.twitter.com/lhsjrfRL0t
Also Read: 'ఆ హీరోయిన్ కసికసిగా ఉంది' - నటిపై మాజీ మంత్రి మల్లారెడ్డి కామెంట్స్.. నెట్టింట తీవ్ర విమర్శలు
17 రోజుల్లో 4 కథలు
17 రోజుల్లో నాలుగు కథలు రూపొందించామని.. కొత్త వారిని పరిచయం చేసేందుకు 'కథా సుధ' చాలా ఉపయోగపడుతుందని ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు తెలిపారు. 'ఈటీవీ ద్వారానే నేను దర్శకధీరుడు రాజమౌళిని ఇండస్ట్రీకి పరిచయం చేశాను. దీనికి బహుమతిగా రాజమౌళి నాకు బాహుబలి ఇచ్చాడు. నాకు డైరెక్షన్ తప్ప ఏమీ తెలియదు. ప్రస్తుతం యూట్యూబ్‌లో ఎంతోమంది ప్రతిభావంతులైన యాక్టర్స్ ఉన్నారు. వారితో కథలు తీశాం. కొత్త వారిని పరిచయం చేయడంలో ఆనందం ఉంటుంది. కథా సుధలో భాగమైనందుకు ఆనందంగా ఉంది.' అని రాఘవేంద్రరావు తెలిపారు.
'కథా సుధ'లో వచ్చే కథలన్నీ ఎప్పటికీ మన హృదయాలను హత్తుకునేలా ఉంటాయని ప్రముఖ దర్శకుడు, నటుడు తనికెళ్ల భరణి తెలిపారు. రాఘవేంద్రరావుతో తన పరిచయం అదృష్టమని.. కథా సుధ నుంచి చాలామంది భవిష్యత్తులో ఇండస్ట్రీకి పరిచయం అవుతారని అన్నారు. తన ఆరేళ్ల కుమార్తెతో కలిసి 'కథా సుధ'లో 'వెండి పట్టీలు' అనే కథలో నటించానని నటుడు బాలాదిత్య చెప్పారు.
ఇదో కొత్త కాన్సెప్ట్
'కథా సుధ' ఐడియా బాగుందని.. కొత్తవాళ్లను ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి ఇది మంచి ఆలోచన అని ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపారు. ఇండస్ట్రీకి వెళ్లే వారందరిలోనూ స్ఫూర్తి నింపేందుకు ఓటీటీలో ఈ ప్రయత్నం చేస్తున్నారని.. ఇది అభినందనీయమని అన్నారు. 'రాఘవేంద్రరావు వంటి గొప్ప దర్శకులు చెప్పే మాటలు స్ఫూర్తి ఇస్తాయి. యువకులతో పోటీ పడాలన్న ఆయన విజన్‌కు హ్యాట్సాఫ్. కథను ఓ వాక్యంలో చెప్పగలిగితే, అది అందరికీ అర్థమైతే ఆ సినిమా పెద్ద హిట్. ప్రతి కథను ఎంత సింపుల్‌గా చెప్తే అంత పెద్ద హిట్ అవుతుంది. ఈ కథా సుధ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా.' అని అనిల్ అన్నారు.





















