అన్వేషించండి

Shubman Gill Record:  గిల్ ధ‌మాకా.. అహ్మ‌దాబాద్ లో అరుదైన రికార్డు న‌మోదు.. గేల్ త‌ర్వాత గిల్ కి మాత్ర‌మే సాధ్య‌మైన ఘ‌న‌త‌

ప్రిన్స్ గిల్ ఐపీఎల్లో అరుదైన రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు. ముంబైతో జ‌రుగుతున్న మ్యాచ్ లో కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు భార‌తీయ ప్లేయ‌ర్ల‌కు సాధ్యం కానీ ఘ‌న‌త‌ను సాధించాడు. 

IPL 2025 MI VS GT Latest Updates: గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్టు కెప్టెన్ శుభ‌మాన్ గిల్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. ఐపీఎల్లో ఒక మైదానంలో అత్యంత వేగంగా వెయ్యి ప‌రుగులు సాధించిన రెండో ఆట‌గాడిగా రికార్డులకెక్కాడు. 2022లో అహ్మ‌దాబాద్ లో గుజరాత్ తరపున తొలి మ్యాచ్ ఆడిన గిల్.. కేవ‌లం 20 ఇన్నింగ్స్ ల్లోనే వెయ్యి ప‌రుగుల మార్కును చేరుకున్నాడు. దీంతో ఐపీఎల్లో అత్యంత వేగంగా వెయ్యి ప‌రుగులు సాధించిన భార‌తీయ ప్లేయ‌ర్ గా నిలిచాడు. 2022లో గుజ‌రాత్, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ఐపీఎల్లో అరంగేట్రం చేశాయి. అప్ప‌టి నుంచి గుజ‌రాత్ హోం మ్యాచ్ లు అహ్మ‌దాబాద్ లో జ‌రుగుతున్నాయి. తాజాగా ముంబై ఇండియన్స్ మ్యాచ్ లో గిల్ 27 బంతుల్లో 38 ప‌రుగులు సాధించాడు. 4 ఫోర్లు, 1 సిక్స‌ర్ చేశాడు. దీంతో ఈ మైదానంలో వెయ్యి ప‌రుగుల మార్కును చేరుకున్నాడు. ఇక ఈ మైదానంలో గిల్ కు అద్భుత‌మైన రికార్డు ఉంది. ఏకంగా మూడు సెంచ‌రీల‌ను ఈ మైదానంలో సాధించాడు. ఓవ‌రాల్ గా నాలుగు సెంచ‌రీలు త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఇక 19 ఇన్నింగ్స్ లో క్రిస్ గేల్ వెయ్యి ప‌రుగుల‌ను బెంగళూరు వేదిక‌లో పూర్తి చేసుకుని, ఒక వేదికపై ఈ ఘ‌న‌తను అత్యంత వేగంగా సాధించిన ప్లేయ‌ర్ గా రికార్డుల‌కెక్కాడు. కేవ‌లం ఒక్క ఇన్నింగ్స్ తేడాతో గిల్ ఈ రికార్డును చేజార్చుకోవ‌డం విశేషం. 

గ‌తేడాది నుంచి కెప్టెన్ గా గిల్.. 
2022లో అరంగేట్రం చేశాక‌, గుజ‌రాత్ కు సార‌థిగా హార్దిక్ పాండ్యా వ్య‌వ‌హ‌రించాడు. ఆ సీజ‌న్ లో గుజ‌రాత్ చాంపియ‌న్ గా నిలిచాడు. ఆ త‌ర్వాత ఏడాది కూడా అద్భుతంగా రాణించిన గుజ‌రాత్ టైటాన్స్ .. ర‌న్న‌ర‌ప్ గా నిలిచింది. అయితే 2024లో ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టుకు హార్దిక్ పాండ్యా వ‌ల‌స వెల్లి పోవ‌డంతో గుజ‌రాత్ జ‌ట్టు ప‌గ్గాల‌ను గిల్ తీసుకున్నాడు. అయితే గ‌త సీజ‌న్ లో గుజ‌రాత్ క‌నీసం ప్లే ఆఫ్స్ కు కూడా చేర‌లేక‌పోయింది. అయితే ఈసారి మాత్రం ఫ‌స్ట్ ప్లేఆఫ్స్ కు చేర‌డ‌మే టార్గెట్ గా గుజ‌రాత్ బ‌రిలోకి దిగుతోంది. ఇక ముంబైతో మ్యాచ్ లో గెలిచి శుభారంభం చేయాలని పట్టుదలగా ఉంది. 

బోణీ కొట్టాల‌ని త‌హ‌త‌హా..
ఇక ఈ సీజ‌న్ లో శుభారంభం చేయ‌డంలో గుజ‌రాత్ విఫ‌ల‌మైంది. తొలి మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ చేతిలో ప‌రాజయం పాలైంది. దీంతో ముంబై ఇండియ‌న్స్ తో జ‌రుగుతున్న రెండో మ్యాచ్ లో గెలుపు టార్గెట్ గా బ‌రిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన గుజ‌రాత్.. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల‌కు 196 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్ సాయి సుద‌ర్శ‌న్ (41 బంతుల్లో 63, 6 ఫోర్లు, 2 సిక్స‌ర్లు)తో స‌త్తా చాటాడు. ముంబై బౌల‌ర్ల‌లో కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు రెండు వికెట్లు ద‌క్కాయి.   

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget