అన్వేషించండి

Ipl Vs Ranji: షాకింగ్.. ఐపీఎల్ కోసం రంజీ జట్టును స్కిప్ చేసిన వర్థమాన స్టార్.. బీసీసీఐ కన్నెర్ర..!

గత నవంబర్ లో జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో అనూజ్ ను గుజరాత్ 3.40 కోట్లకు కొనుగోలు చేసింది. వికెట్ కీపర్ బ్యాటర్ అయిన 25 ఏళ్ల ఈ ఢిల్లీ ఆటగాడు దూకుడుగా ఆడగలడు. 

Gujarat Titans: ఒకవైపు బీసీసీఐ దేశవాళీల్లో రంజీ ట్రోఫీ ఆడాలని చెబుతుంటే, కొంతమంది ఆటగాళ్లు మాత్రం ఐపీఎల్ కే మొగ్గు చూపుతున్నారు. ఐపీఎల్ కోసం రంజీ సన్నాహక శిభిరాలను కూడా స్కిప్ చేస్తున్నారు. తాజాగా అలాంటి సంఘటన ఢిల్లీ రంజీ జట్టులో చోటు చేసుకుంది. ఇటీవల ఐపీఎల్ మెగావేలంలో గుజరాత్ టైటాన్స్ జట్టు  అనూజ్ రావత్ ను కొనుగోలు చేసింది. వికెట్ కీపర్ బ్యాటరైన అనూజ్ ను తమ భవిష్యత్తు సన్నాహకాల్లో భాగంగా కొనుగోలు చేసిననట్లు తెలుస్తోంది. అయితే ఒకవైపు రంజీ ట్రోఫీ మ్యాచ్ లుజరుగుతుండగానే, టైటాన్స్ జట్టు యాజమాన్యం ప్రీ ఐపీఎల్ సన్నాహక శిబిరాన్ని స్టార్ట్ చేసింది. అయితే ఇందులో అనూజ్ పాల్గొనడం వివాదస్పదమైంది. ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండానే అనూజ్ ఈ పనికి పాల్పడినట్లు తెలుస్తోంది. 

ముందస్తు అనుమతి తప్పనిసరి..
ఐపీఎల్లో పాల్గొనాలంటే ఆయా రాష్ట్ర క్రికెట్ అసోసియేన్ల నుంచి ప్లేయర్లు అనుమతి తీసుకోవడం తప్పనిసరి. ఇక రంజీలాంటి ప్రతిష్టాత్మక టోర్నీలు జరుగుతున్నప్పుడు ఫస్ట్ ప్రయారిటీ రంజీలకే ఇవ్వాల్సి ఉంటుంది. అయితే అనూజ్ మాత్రం నిబంధనలు తుంగలో తొక్కినట్లు తెలుస్తోంది. డీడీసీఏ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండానే టైటాన్స్ శిబిరానికి చేరుకున్నట్లు సమాచారం. ఇప్పటికే అనూజ్ తోపాటు ఇషాంత్ శర్మ, జయంత్ యాదవ్, కుమార్ కుశాగ్ర, మహిపాల్ లామ్రోర్, అర్షద్ ఖాన్ తమ శిబిరానికి చేరుకున్నట్లు ప్రకటించింది. దీంతో అనూజ్ వైపు అందరి నజర్ నెలకొంది.

మరోవైపు శిబిరానికి వెళ్లేందుకు తమ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదని డీడీసీఏ కార్యదర్శి అశోక్ శర్మ పేర్కొన్నారు. ముందుస్తు అనుమతి లేకుండా తను ఇలా ప్రవర్తించడం సరికాదని ఫైరయ్యారు. రెడ్ బాల్ కంటే ధనాధన్ ఆటపైనే మక్కువ చూపెట్టడాన్ని ఆయన ఖండించారు. దీనిపై బీసీసీఐకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. 

ఇషాంత్ కేసు వేరు..
నిజానికి ఢిల్లీకే చెందిన ఇషాంత్ శర్మ ఈ శిబిరానికి హాజరైనప్పటికీ తన కేసు వేరని తెలుస్తోంది. రంజీలకు రిటైర్ అయిన ఆటగాళ్లు ఐపీఎల్ శిబిరాలలో పాల్గొనవచ్చు. దీంతో ఇషాంత్ శర్మతో సహా మిగతా రిటైర్డ్ క్రికెటర్లు ఐపీఎల్ ప్రీ క్యాంపుల్లో పాల్గొనడానికి వచ్చిన ఇబ్బందేమీ లేదు. అయితే మరో రెండు రంజీ మ్యాచ్ లు మిగిలి ఉన్న క్రమంలో చెప్పా పెట్టకుండా అనూజ్ ఇలా రంజీ ట్రైనింగ్ క్యాంపును వీడటంపై పలు విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. ఇలాంటి ఆటగాళ్లను ఉపేక్షించ కూడదని పలువురు మాజీలు డిమాండ్ చేస్తున్నారు. బీసీసీఐ కూడా డొమెస్టిక్ క్రికెట్ పై పట్టుదలగా ఉండటంతో అనూజ్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. ఇక ఈనెల 23 నుంచి మలి అంచె రంజీ పోటీలు జరుగుతాయి. ఐపీఎల్ ప్రారంభానికి ముందు రంజీ ట్రోఫీ ముగుస్తుంది. ఇక ఐపీఎల్ వచ్చే మార్చి 23 నుంచి ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. 

Also Read: Bumrah Award: బూమ్.. బూమ్ బుమ్రా.. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా స్టార్ పేసర్.. కమిన్స్ కు షాక్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Makara Jyothi Darshan: శబరిమలలో అయ్యప్ప మకరజ్యోతి దర్శనం -   లక్షల మంది భక్తులు శరణం నినాదాలు
శబరిమలలో అయ్యప్ప మకరజ్యోతి దర్శనం - లక్షల మంది భక్తులు శరణం నినాదాలు
Purandeswari About Balakrishna: డాకు మహారాజ్ సినిమా చూసిన ఎంపీ పురందేశ్వరి, సోదరుడు బాలకృష్ణ నటనపై ప్రశంసలు
డాకు మహారాజ్ సినిమా చూసిన ఎంపీ పురందేశ్వరి, సోదరుడు బాలకృష్ణ నటనపై ప్రశంసలు
Warren Buffett: వయసు 94 ఏళ్లు - ఆస్తి 90 లక్షల కోట్లు - అత్యధికం దానం చేసేశాడు !
వయసు 94 ఏళ్లు - ఆస్తి 90 లక్షల కోట్లు - అత్యధికం దానం చేసేశాడు !
Sankranti 2025 Telugu Movies: సంక్రాంతి సినిమాల్ని వెంటాడిన సెకండాఫ్... బాలయ్య, వెంకీ, చరణ్ సినిమాల్లో అదే కామన్ ప్రాబ్లమ్
సంక్రాంతి సినిమాల్ని వెంటాడిన సెకండాఫ్... బాలయ్య, వెంకీ, చరణ్ సినిమాల్లో అదే కామన్ ప్రాబ్లమ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Maha Kumbh Mela 2025 Day 1 Highlights | ప్రయాగలో కళ్లు చెదిరిపోయే విజువల్స్ | ABP DesamMahakumbh 2025 | 144ఏళ్లకు ఓసారి వచ్చే ముహూర్తంలో మహాకుంభమేళా | ABP DesamDanthapuri Fort | బుద్ధుడి దంతం దొరికిన ప్రాంతం..అశోకుడు నడయాడిన ప్రదేశం | ABP DesamNara Devansh Sack Run | నారావారిపల్లెలో గోనెసంచి పరుగుపందెంలో దేవాన్ష్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Makara Jyothi Darshan: శబరిమలలో అయ్యప్ప మకరజ్యోతి దర్శనం -   లక్షల మంది భక్తులు శరణం నినాదాలు
శబరిమలలో అయ్యప్ప మకరజ్యోతి దర్శనం - లక్షల మంది భక్తులు శరణం నినాదాలు
Purandeswari About Balakrishna: డాకు మహారాజ్ సినిమా చూసిన ఎంపీ పురందేశ్వరి, సోదరుడు బాలకృష్ణ నటనపై ప్రశంసలు
డాకు మహారాజ్ సినిమా చూసిన ఎంపీ పురందేశ్వరి, సోదరుడు బాలకృష్ణ నటనపై ప్రశంసలు
Warren Buffett: వయసు 94 ఏళ్లు - ఆస్తి 90 లక్షల కోట్లు - అత్యధికం దానం చేసేశాడు !
వయసు 94 ఏళ్లు - ఆస్తి 90 లక్షల కోట్లు - అత్యధికం దానం చేసేశాడు !
Sankranti 2025 Telugu Movies: సంక్రాంతి సినిమాల్ని వెంటాడిన సెకండాఫ్... బాలయ్య, వెంకీ, చరణ్ సినిమాల్లో అదే కామన్ ప్రాబ్లమ్
సంక్రాంతి సినిమాల్ని వెంటాడిన సెకండాఫ్... బాలయ్య, వెంకీ, చరణ్ సినిమాల్లో అదే కామన్ ప్రాబ్లమ్
Bumrah Award: బూమ్.. బూమ్ బుమ్రా.. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా స్టార్ పేసర్.. కమిన్స్ కు షాక్..
బూమ్.. బూమ్ బుమ్రా.. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా స్టార్ పేసర్.. కమిన్స్ కు షాక్..
Nara Lokesh Gift: భార్య బ్రహ్మణిని సర్ ప్రైజ్ చేసిన నారా లోకేష్, సంక్రాంతి గిఫ్ట్ మామూలుగా లేదు
భార్య బ్రహ్మణిని సర్ ప్రైజ్ చేసిన నారా లోకేష్, సంక్రాంతి గిఫ్ట్ మామూలుగా లేదు
Maha Kumbh 2025: అస్వస్థతకు గురవుతున్న కుంభమేళాలో పాల్గొన్న భక్తులు - కారణాలు ఏంటంటే
అస్వస్థతకు గురవుతున్న కుంభమేళాలో పాల్గొన్న భక్తులు - కారణాలు ఏంటంటే
China Manja For Kites: పీకలు తెగుతున్నా హైదరాబాద్‌లో ఆగని చైనా మాంజా అమ్మకాలు- ఏబీపీ దేశం స్పెషల్ స్టోరీ
పీకలు తెగుతున్నా హైదరాబాద్‌లో ఆగని చైనా మాంజా అమ్మకాలు- ఏబీపీ దేశం స్పెషల్ స్టోరీ
Embed widget