యుజ్వేంద్ర చాహల్, ధన శ్రీ. వీరి డివోర్స్ రూమర్స్​తో ప్రస్తుతం ఇంటర్నెట్​లో హాట్​ టాపిక్​గా నిలిచారు ఈ జంట.

సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టి రిలేషన్​లో ఉన్నామంటే.. ఒకరినొకరు అన్​ఫాలో చేసుకుని డివోర్స్ అంటున్నారు సెలబ్రెటీలు.

చాహల్, ధనశ్రీ కూడా అదే కోవకు వస్తారు. వీరి డివోర్స్ రూమర్స్​ ఎప్పటి నుంచో వస్తోన్న అవేమి పట్టనట్టే ఉన్నారు.

కానీ తాజాగా ఇన్​స్టాలో ఫోటోలు డిలేట్ చేయడం.. ఒకరినొకరు అన్​ఫాలో చేయడం ఈ రూమర్స్​ నిజమే అనేలా చేశాయి.

లెగ్ స్పిన్ బౌలర్​గా ఇండియన్ క్రికెట్​లో చాహాల్ తన కెరీర్​ను ముందుకు తీసుకెళ్లాడు.

ఐపీఎల్​ కూడా చాహల్ తన బౌలింగ్​తో ఆకట్టుకున్నాడు. అయితే ఈ ఆటగాడు లాక్ డౌన్ టైమ్​లో ప్రేమలో పడ్డాడు.

యూట్యూబర్, డ్యాన్సర్, డెంటిస్ట్ అయిన ధనశ్రీని ఇష్టపడ్డాడు. ఇన్​స్టాలోనే వారి మధ్య చనువు పెరిగింది.

ధనశ్రీ షేర్ చేసే ఫోటోలకు కామెంట్లు పెడుతూ.. ఇద్దరూ కలిసి లైవ్స్ కూడా చేసేవారు.

ధనశ్రీకి చాహాలే ప్రపోజ్ చేసినట్లు ఈ జంట ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. అనంతరం వీరు పెళ్లి చేసుకున్నారు.

వీరి పెళ్లి తర్వాత నుంచి ధనశ్రీ ఎవరితో ఫోటోలు దిగినా.. ఏమి చేసినా.. ట్రోల్స్ చేసేవారు నెటిజన్లు.

జస్టిస్ ఫర్ చాహల్ అంటూ కామెంట్లు పెట్టారు. చివరికి వారి రూమర్స్​ను నిజం చేస్తూ ఈ జంట సోషల్ మీడియాలో విడిపోయింది.