Body Count : బాడీ కౌంట్ ట్రెండ్ గురించి తెలుసా? ఇది ఎక్సర్‌సైజ్‌కి రిలేటడ్ అయితే కాదు, అంతకుమించి
Teenage Relationships : సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న బాడీ కౌంట్ గురించి మీరు వినే ఉంటారు. అసలు ఈ బాడీ కౌంట్ ఏంటి? ఎందుకు దీనిని ట్రెండ్ చేస్తున్నారంటే..

Body Count Trend : సోషల్ మీడియాలోని టీనేజ్ రిలేషన్షిప్స్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఒక్కోసారి ఒక్కో కొత్త రిలేషన్‌ని, రిలేషన్స్కి సంబంధించి కొత్త పదాన్ని వాడుకలోకి తీసుకువస్తారు. అలాంటి వాటిలో "Body count" ఒకటి. ఈ మధ్య ఇది బాగా ట్రెండ్ అవుతుంది. కొందరు దీని అర్థం తెలీక బుర్ర పీక్కుంటుంటే.. మరికొందరు మాత్రం చాలా క్యాజువల్‌గా దీని గురించి మాట్లాడేస్తున్నారు. అసలు ఈ బాడీ కౌంట్ అంటే అర్థమేంటి?
బాడీ కౌంట్..
వయసులో కాస్త పెద్దవారు.. ఈ జెనరేషన్ ట్రెండ్స్‌కి దూరంగా ఉన్నవారు బాడీ కౌంట్ అంటే వ్యాయానికి రిలేటెడ్‌గా వర్డ్ అనుకుంటున్నారు. కానీ బాడీ కౌంట్ అంటే అసలైన అర్థమేంటంటే.. ఓ వ్యక్తి శారీరకంగా దగ్గరవ్వడం, లైంగిక చర్యలో పాల్గొన్న వ్యక్తుల సంఖ్యను Body count అంటారు. ఉదాహరణకు ఓ అమ్మాయి లేదా అబ్బాయి.. ఓ నలుగురు వ్యక్తులతో సెక్సువల్ రిలేషన్ కలిగి ఉంటే.. వారి Body count 4.
నువ్వు ఎంతమందితో ఫిజికల్ రిలేషన్లో ఉన్నావనేది డైరక్ట్‌గా అడగకుండా.. ఇన్‌డైరక్ట్‌గా Body count ఎంత అని అడుగుతున్నారు. పైగా ఇప్పుడు ఈ వర్డ్ చాలా నార్మల్ అయిపోయింది. సోషల్ మీడియాలో దీని గురించి అమ్మాయిలు, అబ్బాయిలు ఓపెన్‌గా డిస్కస్ చేస్తున్నారు. దీని అర్థం తెలుసుకున్న కొందరేమో.. అరే వీటి గురించి కూడా మాట్లాడుకుంటారా అనుకుంటుంటే.. వీళ్లేంటి తెగ ఫీల్ అయిపోతున్నారు. ఇది చాలా కామన్ కదా అనుకునేవారు కూడా ఉన్నారు.
బాడీ కౌంట్ ట్రెండ్
ఈ బాడీ కౌంట్ అనే పదాన్ని ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కొందరు లైంగిక సంబంధాలు, సాన్నిహిత్యం పెచుకోవడం కోసం.. రొమాన్స్‌ని హైలెట్ చేయడం కోసం ఉపయోగిస్తూ ట్రెండ్ చేస్తున్నారు. దీని గురించి ఓపెన్ డిబెట్స్ పెడుతున్నారు. ఓ రకంగా ఇది కొందరికి అవగాహనను అందిస్తుంది. నెటిజన్స్ వారి ఆలోచనలు, అభిప్రాయాలు, బాడీ కౌంట్‌కి సంబంధించిన అనుభవాలు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. ఇలా ఓపెన్ డిస్కస్ చేయడం వల్ల పాజిటివ్, నెగిటివ్ కూడా ఉంటుంది.
పాజిటివ్ అంశాలు ఏంటంటే..
ఓపెన్ డిస్కస్ వల్ల లైంగిక సంబంధాలు, రొమాన్స్ గురించి నిజాయితీగా చర్చలు జరుగుతాయి. అలాగే తమ అనుభవాలు, ఆలోచనలు పంచుకోవడం ద్వారా లైంగిక రిలేషన్ మీద కచ్చితంగా ఏదొ ఒక అభిప్రాయానికి అయితే వస్తారు. లైంగిక ఆరోగ్యం గురించి కూడా ఆలోచించగలుగుతారు.
నెగిటివ్ ఏంటంటే..
ఒకరితో ఒకరు పోల్చుకుంటారు. ఇది బాడీ కౌంట్ సంఖ్యను పెంచుకోవడం దేనికైనా రెడీ అయిపోయే ధోరణిని పెంచవచ్చు. లైంగికంగా కోరికలు పెరిగే అవగాశముంది. ఎమోషనల్ అటాచ్మెంట్స్ పోయి.. ఫిజికల్ అట్రాక్షన్ పెరగవచ్చు. కొన్ని సందర్భాల్లో అవతలి వ్యక్తికి ఇష్టం లేకుండానే ఫోర్స్ చేసే అవకాశముంది.
బాడీ కౌంట్ అనేది ట్రెండ్ చూసో.. లేదా కౌంట్ లేదనో షేమ్‌గా ఫీల్ అయ్యేది కాదని అందరూ గుర్తించాలి. బహిరంగంగా ఈ తరహా సంభాషణలు ఓకే కానీ.. అవి మీ మీద నెగిటివ్ ఇంపాక్ట్ లేకుండా చూసుకోవాలి. ఎమోషనల్ కనెక్షన్ లేనప్పుడు లైంగికంగా కనెక్షన్స్ పెట్టుకోకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు.
Also Read : పిల్లలతో తల్లిదండ్రులు ఈ విషయాలు కచ్చితంగా మాట్లాడాలి.. టీనేజర్స్‌కు ఇవ్వాల్సిన రిలేషన్షిప్ సూచనలివే






















