అన్వేషించండి

Warren Buffett: వయసు 94 ఏళ్లు - ఆస్తి 90 లక్షల కోట్లు - అత్యధికం దానం చేసేశాడు !

Buffett: వారెన్ బఫెట్ తన 90 లక్షల కోట్ల ఆస్తిలో అత్యధిక భాగం ట్రస్ట్‌కు కేటాయించారు. 94 ఏళ్ల వయసులో తన కంపెనీలకు వారసుడిగా రెండో కుమారుడ్ని ప్రకటించారు.

Warren Buffett has allocated most of his 90 lakh crore assets to trusts:  ప్రపంచ కుబేరుల్లో ఒకరు వారెన్ బఫెట్. ఆయన ఎలాంటి కంపెనీలను ప్రారంభించలేదు. వాటిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లలేదు. కానీ అలా వెళ్లే కంపెనీలేవో అంచనాలు వేసుకుని పెట్టుబడులు పెడతారు. ఫలితంగా  ఆయన ఇప్పుడు ప్రపంచంలోని అతి పెద్ద కంపెనీల్లో వాటాదారు. అలా ఆయన వాటాల  లెక్కలు వేస్తే సంపద మన రూపాయల్లో రూ. 90 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. అంటే ఓ ట్రిలియన్ డాలర్ల పైమాటే అన్నమాట.                 

వారెన్  బఫెట్ వయసు 94 ఏళ్లు. ఇప్పటికీ ఆయన తన ఇన్వెస్ట్ మెంట్ బిజినెస్ ను రన్ చేసుకుంటూనే ఉన్నారు. బెర్క్ షైర్ హాత్వే ఆయన కంపెనీ పేరు. ఈ కంపెనీకి ఇప్పటికీ ఆయన చైర్మన్ గా ఉన్నారు. అయితే.. ఇప్పుడు ఆయన తనకు రిటైర్మెంట్ టైం వచ్చిందని ఫీలయ్యారు. అందుకే తన వారసుడ్ని ప్రకటించారు. అనేక టెస్టులు పెట్టి తన ముగ్గురు కుమారుల్లో  రెండో కుమారుడ్ని ఎంచుకుకున్నారు. హోవార్డ్ బఫెట్ ను తన కంపెనీలకు చైర్మన్ గా నియమిస్తున్నట్లుగా ప్రకటించారు.  హోవార్డ్ కూడా తన ఉద్యోగ జీవితం  ప్రారంభించినప్పటి నుంచి తండ్రితో పాటు పని చేస్తూనే ఉన్నారు. ఇప్పటికి ఆయన రిటైర్మెంట్ వయసు కూడా అయిపోయింది. అయితే ఇప్పటికైనా తనకు చైర్మన్ పోస్టు ఇచ్చారని ఆ రెండో కొడుకు సంతోషపడుతూ ఉంటారు.               

ఇప్పుడు ఇచ్చి ఏం ప్రయోజనం అని మొదటి కుమారుడు అనుకుని ఉంటారు. ఎందుకంటే ఆయన కూడా 70ల్లోకి వచ్చి ఉంటారు. నిజానికి తన వారసులకు బధ్యతలు మాత్రమే ఇచ్చిన బఫెట్.. ఆస్తిలో అత్యధిక భాగం ట్రస్టులకు రాసిచ్చారు. సేవా కార్యక్రమాల కోసం తన లాభాలను వాడాలని ఆయన ట్రస్టులకు రాసిచ్చారు. ఈ ట్రస్టుల బాధ్యతలను తన ముగ్గురు కుమారులు చూడాలని ఇప్పటికే ప్రకటించారు. అతి కొద్దిగా మాత్రమే అంటే.. కుబేరులు అని చెప్పుకోలేనంత ఆస్తి మాత్రమే సంతానానికి ఇచ్చాడు బఫెట్.                

హోవార్డ్ బఫెట్‌ పూర్తి పేరు 'హోవార్డ్ హౌవీ బఫెట్‌'. ఈయనను 'హౌవీ' అని కూడా పిలుస్తారు. చదువు పూర్తయిన తరువాత తండ్రి బాటలో అడుగులు వేసిన హోవార్డ్.. వారెన్ బఫెట్ సలహా మేరకు లాస్ ఏంజెల్స్‌కు వెళ్లి బెర్క్‌షైర్ హాత్వే యాజమాన్యంలోని సీస్ క్యాండీస్ అనే కంపెనీలో పని చేశాడు. హోవీ బఫెట్ తండ్రి మాదిరిగానే.. దాతృత్వ కార్యక్రమాలపై దృష్టి సారించి స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. అంతే కాకుండా వన్య పరిరక్షణ, వన్యప్రాణులు సంబంధిత అంశాలపై ఎనిమిది పుస్తకాలను కూడా రచించారు.           

Also Read : Los Angeles Wildfire : లాస్ ఏంజిల్స్ అగ్ని ప్రమాదం - ఆ రాష్ట్రాల బడ్జెట్ కంటే విలువైన ఆస్తి నష్టం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sankranti 2025 Telugu Movies: సంక్రాంతి సినిమాల్ని వెంటాడిన సెకండాఫ్... బాలయ్య, వెంకీ, చరణ్ సినిమాల్లో అదే కామన్ ప్రాబ్లమ్
సంక్రాంతి సినిమాల్ని వెంటాడిన సెకండాఫ్... బాలయ్య, వెంకీ, చరణ్ సినిమాల్లో అదే కామన్ ప్రాబ్లమ్
Nara Lokesh Gift: భార్య బ్రహ్మణిని సర్ ప్రైజ్ చేసిన నారా లోకేష్, సంక్రాంతి గిఫ్ట్ మామూలుగా లేదు
భార్య బ్రహ్మణిని సర్ ప్రైజ్ చేసిన నారా లోకేష్, సంక్రాంతి గిఫ్ట్ మామూలుగా లేదు
China Manja For Kites: పీకలు తెగుతున్నా హైదరాబాద్‌లో ఆగని చైనా మాంజా అమ్మకాలు- ఏబీపీ దేశం స్పెషల్ స్టోరీ
పీకలు తెగుతున్నా హైదరాబాద్‌లో ఆగని చైనా మాంజా అమ్మకాలు- ఏబీపీ దేశం స్పెషల్ స్టోరీ
Hari Hara Veera Mallu: వినాలి... వీరమల్లు మాట వినాలి - పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు సంక్రాంతి సర్‌ప్రైజ్, ఫస్ట్ సాంగ్ ప్రోమో చూశారా?
వినాలి... వీరమల్లు మాట వినాలి - పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు సంక్రాంతి సర్‌ప్రైజ్, ఫస్ట్ సాంగ్ ప్రోమో చూశారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Maha Kumbh Mela 2025 Day 1 Highlights | ప్రయాగలో కళ్లు చెదిరిపోయే విజువల్స్ | ABP DesamMahakumbh 2025 | 144ఏళ్లకు ఓసారి వచ్చే ముహూర్తంలో మహాకుంభమేళా | ABP DesamDanthapuri Fort | బుద్ధుడి దంతం దొరికిన ప్రాంతం..అశోకుడు నడయాడిన ప్రదేశం | ABP DesamNara Devansh Sack Run | నారావారిపల్లెలో గోనెసంచి పరుగుపందెంలో దేవాన్ష్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sankranti 2025 Telugu Movies: సంక్రాంతి సినిమాల్ని వెంటాడిన సెకండాఫ్... బాలయ్య, వెంకీ, చరణ్ సినిమాల్లో అదే కామన్ ప్రాబ్లమ్
సంక్రాంతి సినిమాల్ని వెంటాడిన సెకండాఫ్... బాలయ్య, వెంకీ, చరణ్ సినిమాల్లో అదే కామన్ ప్రాబ్లమ్
Nara Lokesh Gift: భార్య బ్రహ్మణిని సర్ ప్రైజ్ చేసిన నారా లోకేష్, సంక్రాంతి గిఫ్ట్ మామూలుగా లేదు
భార్య బ్రహ్మణిని సర్ ప్రైజ్ చేసిన నారా లోకేష్, సంక్రాంతి గిఫ్ట్ మామూలుగా లేదు
China Manja For Kites: పీకలు తెగుతున్నా హైదరాబాద్‌లో ఆగని చైనా మాంజా అమ్మకాలు- ఏబీపీ దేశం స్పెషల్ స్టోరీ
పీకలు తెగుతున్నా హైదరాబాద్‌లో ఆగని చైనా మాంజా అమ్మకాలు- ఏబీపీ దేశం స్పెషల్ స్టోరీ
Hari Hara Veera Mallu: వినాలి... వీరమల్లు మాట వినాలి - పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు సంక్రాంతి సర్‌ప్రైజ్, ఫస్ట్ సాంగ్ ప్రోమో చూశారా?
వినాలి... వీరమల్లు మాట వినాలి - పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు సంక్రాంతి సర్‌ప్రైజ్, ఫస్ట్ సాంగ్ ప్రోమో చూశారా?
Jallikattu: చిత్తూరు జిల్లాలో జల్లికట్టు జోష్, ఎద్దులు రంకెలేసి దూసుకొస్తున్నా తగ్గేదేలే అంటున్న యువత
చిత్తూరు జిల్లాలో జల్లికట్టు జోష్, ఎద్దులు రంకెలేసి దూసుకొస్తున్నా తగ్గేదేలే అంటున్న యువత
Hyderabad Double Murder: సంక్రాంతి రోజు నార్సింగిలో జంట హత్యల కలకలం- యువతి, యువకుడిపై అంత పగ ఎవరికో?
సంక్రాంతి రోజు నార్సింగిలో జంట హత్యల కలకలం- యువతి, యువకుడిపై అంత పగ ఎవరికో?
Sankranti 2025: తెలంగాణకు పాకిన గోదావరి
తెలంగాణకు పాకిన గోదావరి "అతి" మర్యాదలు, శృతి మించుతున్న సంక్రాంతి అల్లుడి వెరైటీ విందులు
CM Chandrababu: సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబు ఫ్యామిలీ - గ్రామ దేవతకు ప్రత్యేక పూజలు
సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబు ఫ్యామిలీ - గ్రామ దేవతకు ప్రత్యేక పూజలు
Embed widget