Revanth Chit Chat: ప్రధానిని కించపర్చలేదు- కులగణనలో తప్పుల్లేవు - రేవంత్ కీలక వ్యాఖ్యలు
caste census: కులగణనలో ఒక్క తప్పు ఉన్నా చూపించాలని రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.

CM Revanth Reddy: కులగణనలో ఒక్క తప్పు ఉన్నా చూపించాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. జనం స్వయంగా చెప్పిన వివరాలే రికార్డుల్లో నమోదయ్యాయని స్పష్టం చేశారు. కులగణనలో ఒక్క తప్పు ఉన్నా చూపించాలన్నారు. ఒక్కొక్క ఎన్యుమరేటర్ కి 150 ఇళ్ళు కేటాయించామని తప్పులు లేకుండా సర్వే జరిగిందన్నారు.
సమగ్ర కుటుంబ సర్వేలో నాలుగు కేటగిరీలే
కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వేలో 4 కేటగిరీలు మాత్రమే చూపారని.. గుర్తు చేశారు. అందులో 'బీసీ'లు 51% శాతం, 'ఎస్సీ'లు 18%, 'ఎస్టీ'లు 10% శాతం, మిగతావాళ్ళు 'ఓసీ'లుగా చూపారున్నారు. మా సర్వేలో మొత్తం 5 కేటగిరీలుగా విభజించి, ముస్లింలలో ఉన్న బీసీలను కూడా కలిపి చెప్పామమన్నకాుయ ఆ ప్రకారం హిందూ, ముస్లిం బీసీలంతా కలిసి 56% అయ్యారని ఇంకెక్కడ లెక్క తప్పిందని ప్రశ్నించారు. 42% బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం తీసుకొచ్చి, పార్లమెంట్ ఆమోదానికి పంపిస్తామన్నారు. రాజకీయ జోక్యానికి తావులేకుండా కమిషన్ ద్వారానే ప్రాసెస్ చేస్తున్నామని రేవంత్ స్పష్టం చేశారు.
ఎస్సీల్లో ఉన్నవి 59 కులాలు!
కేసీఆర్ సర్వేలో ఎస్సీలు 82 కులాలుగా చూపారు. కానీ ఉన్నవి 59 కులాలేనని రేవంత్ గుర్తు చేశారు. స్పెల్లింగ్ తప్పుగా ఎంట్రీ అయినా దాన్ని మరో కులంగా చూపారని.. ఎవరు ఏమనుకున్నా, ఎలాంటి విమర్శలు చేసిన నేను పట్టించుకోనని రేవంత్ స్పష్టం చేశారు. కొంత మంది తనపై విమర్శలు చేసి మానసిక తృప్తి పొందుతున్నారని విమర్శించారు.రాహుల్ గాంధీ చెప్పిన మేరకే కులగణన సహా అన్నీ చేస్తున్నాననని..ఎంత రిస్క్ అయినా పని చేస్తామని తెలిపారు. పీసీసీ కార్యవర్గం, మంత్రివర్గ విస్తరణ తదితర అంశాలపై కొందరు పైశాచిక ఆనందం కోసం ఊహాగానాలు వ్యాప్తి చేస్తున్నారని.. అందులో నిజం లేదన్నారు. ఎస్సీ వర్గీకరణ పై చట్టం చేసిన తర్వాత సభను ఏర్పాటు చేసి.. రాహుల్ గాంధీని పిలుస్తామన్నారు.
మోదీని కించపర్చలేదు!
మోడీ విషయంలో తాను ఎటువంటి తప్పుడు కామెంట్ చేయలేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన హోదాను తగ్గించి లేదా అగౌరవపరిచి మాట్లాడలేదన్నారు. ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బిసి అన్నాను. కిషన్ రెడ్డి కూడా అదే మాట చెప్పారు. కాకపోతే ఎప్పుడు బీసీ గా మారారు అన్న తేదీ సమయం విషయంలోనే తేడా ఉండొచ్చన్నారు. ఈ విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పిన తేదీనే నేను అంగీకరిస్తున్నానని వ్యాఖ్యానించారు.
మోదీ కులంపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ విషయంలో ఆయనపై బీజేపీ నేతలు మండి పడుతున్నారు. రాహుల్ కులమేంటో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి తాను చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు. మోదీ కులం.. బీసీల్లో చేర్చిన సమయంలో కాంగ్రెస్ అధికారంలో ఉందని కిషన్ రెడ్డి చెప్పిన మాటలతో తాను ఏకీభవిస్తున్నాని చెప్పుకొచ్చారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

