అన్వేషించండి

DIY Hair Pack : మెంతులు, అవిసె గింజలు, బియ్యంతో హెయిర్ ప్యాక్.. జుట్టు బలంగా, పొడవుగా పెరగడానికి ట్రై చేసేయండి

Hair Pack : జుట్టు ఎక్కువగా రాలిపోతుందా? హెయిర్ స్ట్రాంగ్ అయ్యేందుకు, రాలకుండా ఉండేందుకు మీరు ఏమైనా ట్రై చేయాలనుకుంటే మెంతులు, అవిసె గింజలు, బియ్యంతో చేసిన ఈ హెయిర్ ప్యాక్ ట్రై చేయవచ్చు.

Methi Flaxseed and Rice Hair Pack : ప్రస్తుతం చాలా మంది జుట్టు రాలడం, చుండ్రు, జుట్టు పలుచబడటం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. మార్కెట్లో లభించే కెమికల్ ప్రొడక్ట్స్ కంటే ఇంట్లోనే సహజ పదార్థాలతో తయారు చేసే హెయిర్ ప్యాక్స్ మంచి ఫలితాలు ఇస్తాయి. అలాంటి వాటిలో మెంతులు, అవిసె గింజలు, బియ్యంతో చేసే హెయిర్ ప్యాక్ ఒకటి. ఈ మూడు పదార్థాల్లో ఉండే పోషకాలు జుట్టుకు బలాన్ని ఇవ్వడమే కాకుండా మెరుపును కూడా అందిస్తాయి.

హెయిర్ ప్యాక్ బెనిఫిట్స్

మెంతుల్లోని ప్రోటీన్లు, నికోటినిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. ఇవి హెయిర్ రూట్స్‌ను బలపరచి జుట్టు రాలడాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. అవిసె గింజల్లోని ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి జుట్టుకు నేచురల్ షైన్ ఇచ్చి సాఫ్ట్‌గా మారుస్తాయి. బియ్యంలో ఉండే అమినో యాసిడ్లు, విటమిన్లు హెయిర్ గ్రోత్‌ను ప్రోత్సహిస్తాయి. జుట్టు పొడవుగా పెరగడంలో ఉపయోగపడతాయి.
ఈ ప్యాక్ స్కాల్ప్‌ను క్లీన్ చేసి డ్రైనెస్‌ తగ్గిస్తుంది. రెగ్యులర్​గా వాడితే చుండ్రు సమస్య క్రమంగా తగ్గే అవకాశం ఉంటుంది. జుట్టు పలుచగా, బలహీనంగా ఉన్నవారికి ఈ ప్యాక్ మంచి ఎంపిక. ఇవి కుదుళ్లను స్ట్రాంగ్‌గా ఉంచడంలో సహాయపడతాయి. మరి ఈ హెయిర్​ప్యాక్​ని ఎలా సిద్ధం చేసుకోవాలి? ఎలా అప్లై చేస్తే మంచిదో చూసేద్దాం. 

కావాల్సిన పదార్థాలు

మెంతులు – 2 టేబుల్ స్పూన్లు

అవిసె గింజలు – 2 టేబుల్ స్పూన్లు

బియ్యం – 3 టేబుల్ స్పూన్లు

నీరు – అవసరమైనంత

తయారీ విధానం

ముందుగా మెంతులు, అవిసె గింజలు, బియ్యాన్ని విడివిడిగా కడిగి 4 నుంచి 5 గంటలు నానబెట్టాలి. తర్వాత వీటన్నింటిని మిక్సీలో వేసి కొద్దిగా నీరు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే మరికొంత నీరు వేసి పేస్ట్‌లా తయారు చేసుకోవచ్చు. ఈ పేస్ట్‌ను జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు బాగా అప్లై చేయాలి. 30 నుంచి 40 నిమిషాలు అలాగే ఉంచి.. మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. 

వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఈ ప్యాక్ వేసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి. హెయిర్ ప్యాక్ వేసే ముందు జుట్టు చిక్కులు లేకుండా దువ్వుకోవాలి. తర్వాత అప్లై చేయాలి. సహజ పదార్థాలతో తయారయ్యే ఈ హెయిర్ ప్యాక్ జుట్టుకు మంచి పోషణ అందించి.. జుట్టు ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. కెమికల్స్ లేకుండా ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే ఈ ప్యాక్ మీరు కూడా ట్రై చేయండి. సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు ముందుగా పాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిది. రెగ్యులర్‌గా వాడితేనే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

జుట్టుకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ ఆర్టికల్స్ కోసం దీనిని క్లిక్ చేయండి.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Room Fresheners : రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
Calcium-Rich Foods : కాల్షియం లోపం రాకుండా ఎముకలు బలం(Stronger Bones)గా ఉండాలంటే.. ఈ 3 ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకోండి
కాల్షియం లోపం రాకుండా ఎముకలు బలం(Stronger Bones)గా ఉండాలంటే.. ఈ 3 ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకోండి
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Monsoon Mold : ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Embed widget